ప్రస్తుతం ఊబకాయం సమస్య బారిన పడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. మారిన జీవన విధానం, తగ్గిన శారీక శ్రమ కారణంగా బరువు పెరుగుతున్నారు. దీంతో పెరిగిన బరువు తగ్గించుకునేందుకు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. తీసుకునే ఆహారం మొదలు, వ్యాయామం వరకు అలవాటు చేసుకుంటారు. అయితే బ్లాక్ కాఫీ తాగడం వల్ల బరువు తగ్గుతారని చాలా మంది భావిస్తుంటారు. ఇందులో ఎంత వరకు నిజం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.
బ్లాక్ కాఫీ బరువును తగ్గించడంలో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. బ్లాక్ కాఫీలో ఉండే కెఫిన్ జీవక్రియకు వేగాన్ని అందిస్తుంది. జీవక్రియ వేగంగా మారడం వల్ల బరువు తగ్గించడంలో ఉపయోగపడుతుంది. తక్కువ సమయంలో ఎక్కువ కేలరీలను బర్న్ చేస్తుంది. అలాగే బ్లాక్ కాఫీ ఆకలిని తగ్గించడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఇది బరువు తగ్గడానికి దోహదపడుతుంది. ఇంతకీ బ్లాక్ కాఫీ బరువు తగ్గడానికి ఎలో తోడ్పడుతుందంటే.
బ్లాక్ కాఫీలో ఉండే కెఫిన్ జీవక్రియను పెంచుతుంది. ఇది శరీరంలో కేలరీలు బర్నింగ్ రేటును పెంచుతుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇక బ్లాక్ కాఫీలో పాలు, చక్కెర లేదా క్రీమ్ లేకపోవడం వల్ల తక్కువ కేలరీలు ఉంటాయి. దీన్ని తాగడం వల్ల శరీరంలో కేలరీలు కూడా తక్కువగా చేరుతాయి. కెఫిన్ ఆకలిని తగ్గించడంలో సహాయపడుతుంది, తద్వారా అనవసరమైన చిరుతిళ్లను తగ్గిస్తుంది, ఇది కేలరీలను అదుపులో ఉంచుతుంది. కెఫీన్ శరీరంలోని కొవ్వు కణాలను శక్తిగా మార్చడంలో సహాయపడుతుంది, ఇది వ్యాయామం చేసేటప్పుడు శరీరంలోని కొవ్వును కాల్చే ప్రక్రియను వేగవంతం చేస్తుంది. కాబట్టి బ్లాక్ కాఫీ తాగడం వల్ల బరువు త్వరగా తగ్గొచ్చని చెప్పడంలో నిజం ఉందని చెప్పాలి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..