Diabetes Diet: క్యాబేజీ, క్యాలీఫ్లవర్‌ తింటే మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో షుగర్‌ లెవల్స్‌ పెరుగుతాయా?

|

Jan 01, 2024 | 12:40 PM

శీతాకాలంలో దొరికే కూరగాయల్లో క్యాబేజీ, క్యాలీఫ్లవర్‌ ముఖ్యమైనవి. వీటితో రకరకాల వంటకాలు తయారు చేసుకుని ఇష్టం ఆరగిస్తుంటారు. అయితే డయాబెటిక్ పేషెంట్లకు ఏమి తినాలి, ఏమి తాగాలి అనే దానిపై కొన్ని పరిమితులు ఉంటాయి. ఉదాహరణకు, అధిక చక్కెర ఆహారాలకు దూరంగా ఉండాలి. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలకు ప్రాధాన్యత ఇవ్వాలి అని వైద్యులు సూచిస్తుంటారు. అయితే క్యాబేజీ, క్యాలీఫ్లవర్‌ వంటి శీతాకాలపు కూరగాయలను తింటే బ్లడ్‌లో షుగర్ లెవల్స్‌..

Diabetes Diet: క్యాబేజీ, క్యాలీఫ్లవర్‌ తింటే మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో షుగర్‌ లెవల్స్‌ పెరుగుతాయా?
Diabetes Diet
Follow us on

శీతాకాలంలో దొరికే కూరగాయల్లో క్యాబేజీ, క్యాలీఫ్లవర్‌ ముఖ్యమైనవి. వీటితో రకరకాల వంటకాలు తయారు చేసుకుని ఇష్టం ఆరగిస్తుంటారు. అయితే డయాబెటిక్ పేషెంట్లకు ఏమి తినాలి, ఏమి తాగాలి అనే దానిపై కొన్ని పరిమితులు ఉంటాయి. ఉదాహరణకు, అధిక చక్కెర ఆహారాలకు దూరంగా ఉండాలి. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలకు ప్రాధాన్యత ఇవ్వాలి అని వైద్యులు సూచిస్తుంటారు. అయితే క్యాబేజీ, క్యాలీఫ్లవర్‌ వంటి శీతాకాలపు కూరగాయలను తింటే బ్లడ్‌లో షుగర్ లెవల్స్‌ పెరుగుతాయా? తగ్గుతాయా? అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ తెలుసుకుందాం..

నిజానికి క్యాబేజీలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీనిలో గ్లైసెమిక్ సూచిక కూడా తక్కువగా ఉంటుంది. కాబట్టి క్యాబేజీ తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ పెరుగుతాయనే భయం అక్కర్లేదు. అంతేకాకుండా ఈ కూరగాయలలో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు మధుమేహ వ్యాధిగ్రస్తులకు ప్రయోజనకరంగా ఉంటాయి. అలాగే విటమిన్ సి, కె, కాల్షియం, ఫాస్పరస్ కూడా క్యాబేజీల్లో ఉంటాయి. మధుమేహంతో బాధపడేవారికి బరువును అదుపులో ఉంచుకోవడం ఒక సవాలుగా మారుతుంది. క్యాబేజీలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది సులువుగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. మరోవైపు, డయాబెటిస్‌ వల్ల నరాల దెబ్బతినే ప్రమాదం ఉంది. క్యాబేజీలోని విటమిన్లు, ఫైటోన్యూట్రియెంట్లు నరాల ఆరోగ్యానికి తోడ్పడతాయి. అలాగే విటమిన్ సి ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని నివారించడంలో సహాయపడుతుంది. కాబట్టి డయాబెటిక్ పేషెంట్లు క్యాబేజీతో చేసిన ఆహారాలను ఎలాంటి సందేహం లేకుండా తినవచ్చు.

మధుమేహ వ్యాధిగ్రస్తులు ఎల్లప్పుడూ తక్కువ కేలరీల ఆహారాన్ని తినాలని వైద్యులు చెబుతుంటారు. కాలీఫ్లవర్ కూడా క్యాలరీలు తక్కువగా ఉంటాయి. కాబట్టి దీనిని తినడానికి సంకోచించనవసరం లేదు. కాలీఫ్లవర్‌లో డైటరీ ఫైబర్ ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది. దీనిలో కొవ్వు ఉండదు. కాబట్టి క్యాలీఫ్లవర్ తినడం వల్ల బరువు పెరుగుతారనే భయం అక్కర్లేదు. మధుమేహం కూడా అధిక రక్తపోటుకు కారణమవుతుంది. రక్తపోటును సాధారణంగా ఉంచుకోవడానికి కాలీఫ్లవర్ తినవచ్చు. కాలీఫ్లవర్‌లో ఫైబర్‌తో పాటు పొటాషియం కూడా ఉంటుంది. ఈ పదార్ధం రక్తపోటును అదుపులో ఉంచుతుంది. కాలీఫ్లవర్‌లో విటమిన్ సి ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. చలికాలంలో రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి కాలీఫ్లవర్ తినవచ్చు. శీతాకాలంలో దొరికే క్యాలీఫ్లవర్, క్యాబేజీ రెండింటినీ మధుమేహ వ్యాధి గ్రస్తులు తినవచ్చని నిపుణులు అంటున్నారు. కానీ ఎక్కువ నూనె, మసాలాలు వినియోగించకపోవడం మంచిది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్‌ చేయండి.