IRCTC Tour Package: సింగపూర్ వెళ్లాలనుకుంటున్నారా..? ఐఆర్‌సీటీసీ అద్భుత అవకాశం.. వివరాలు ఇవే

హైదరాబాద్ నుంచి సింగపూర్‌కు ఐఆర్‌సీటీసీ స్పెషల్ ప్యాకేజ్‌ను అందుబాటులోకి తెచ్చింది. సింగపూర్‌ వెళ్లాలనుకునేవారికి ఇది మంచి అవకాశంగా చెప్పవచ్చు. సింగపూర్‌లోని అన్ని ప్రదేశాలను మీరు సందర్శించవచ్చు. వచ్చే నెల నుంచి ఈ టూర్ ప్రారంభం కానుంది. టికెట్లు ముందుగానే బుక్ చేసుకోవాలి.

IRCTC Tour Package: సింగపూర్ వెళ్లాలనుకుంటున్నారా..? ఐఆర్‌సీటీసీ అద్భుత అవకాశం.. వివరాలు ఇవే
Singapore

Updated on: Nov 22, 2025 | 5:07 PM

ప్రపంచంలోనే అత్యంత ధనిక నగరంగా చెప్పబడుతున్న సింగపూర్ వెళ్లాలనుకునేవారికి గుడ్‌న్యూస్. సింగపూర్ విజిట్ చేసి అక్కడి అందాలను చూడాలనుకునేవారి కోసం ఐఆర్‌సీటీసీ స్పెషల్ ప్యాకేజ్ అందుబాటులోకి తెచ్చింది. తెలుగు రాష్ట్రాల నుంచి చాలామంది సింగపూర్ చూడాలని వెళుతుంటారు. అలాంటివారి కోసమే ఈ ప్యాకేజ్. సింగపూర్ టూర్ ఎన్ని రోజులు ఉంటుంది..? ఏమే సౌకర్యాలు ఉంటాయి..? ప్యాకేజ్ ధర ఎంత? అనే వివరాలు చూద్దాం.

ఎన్ని రోజులు

సింగపూర్ టూర్ 6 రోజులు ఉంటుంది. 5 రాత్రులు అక్కడే గడుపుతారు. హైదరాబాద్ నుంచి ఈ టూర్ ప్రారంభమవుతుంది. విమాన ప్రయాణం ఉంటుంది. పాస్‌పోర్ట్ కలిగి ఉండాలి.

ప్యాకేజ్ ధర ఎంతంటే..?

సింగిల్ షేరింగ్ రూ.1,56,900గా ఉంటుంది. ఇద్దరు వ్యక్తులు వెళ్లాలనుకుంటే ఒక్కొక్కరికీ రూ.1,29,250గా ఉంది. ఇక ముగ్గురు కలిసి వెళ్లాలనుకుంటే ఒక్కొక్కరికీ రూ.1,29,00గా ఉంది. ఇక చైల్డ్‌ విత్ బెడ్ అయితే రూ.1,25,750, చైల్డ్‌ వితౌట్ బెడ్ అయితే రూ.1,23,600గా ఉంది.

ఎప్పుడు ప్రారంభమవుతుంది..?

ఈ టూర్ డిసెంబర్ 11న ప్రారంభమవుతుంది. 11వ తేదీ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి విమానం బయల్దేరుతుంది. తిరిగి టూర్ ముగించుకుని 17వ తేదీన విమానంలో హైదరాబాద్‌ చేరుకుంటారు. హోటల్స్, ఫుడ్ అన్నీ సౌకర్యాలు ఈ ప్యాకేజీలో ఉంటాయి.

ఏయే ప్రదేశాలు చూపిస్తారు..?

ఇండిపెండెన్స్ స్క్వేర్, కింగ్స్ ప్యాలెస్, నేషనల్ మాన్యుమెంట్. చాక్లెట్ హోల్‌సేల్ షాప్, పెట్రోనాస్ ట్విన్ టవర్, బటు గుహలు, జెంటింగ్ హైలాండ్స్, పుత్రజయ సందర్శన, ఆర్కిడ్ గార్డెన్, మెర్లియన్ పార్క్ , సింగపూర్ ఫ్లైయర్ రైడ్, మేడమ్ టుస్సాడ్స్, IOS, వింగ్స్ ఆఫ్ టైమ్ 1వ షో , యూనివర్సల్ స్టూడియోస్ గార్డెన్స్, బర్డ్ ప్యారడైజ్‌

సౌకర్యాలు

విమాన ప్రయాణం, 3 స్టార్ హోటల్స్‌లో వసతి, భోజనం, టూరిస్ట్ గైడ్, ప్రయాణ బీమా, వీసా ఛార్జీలు