దేశంలో చాలా మంది ప్రజలు సందర్శించాలనుకునే ప్రాంతం కాశ్మీర్. అక్కడి అందమైన లోయలు, మంచు పర్వతాలు, ఎత్తయిన చెట్లు, వాాతావరణం ఎంతో ఆసక్తిగా ఉంటాయి. ప్రర్యాటకులకు స్వర్గధామంగా పిలిచే కాశ్మీర్ లో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. సినిమాల్లో కనిపించే సుందర కాశ్మీరాన్ని నిజంగా చూడాలనుకునేవాళ్లకు ఐఆర్ సీటీసీ మంచి అవకాశం కల్పించింది. కొత్తగా ఆరు రోజుల టూర్ ప్యాకేజీని ప్రకటించింది. దీనికి ప్యారడైజ్ ఆన్ ఎర్త్ – కశ్మీర్ ఎక్స్ బెంగళూరు అనే పేరు పెట్టింది. బెంగళూరు నుంచి కశ్మీర్ వరకు రౌండ్ ట్రిప్ విమాన ఏర్పాట్లు చేసింది. చక్కగా విమానంలో వెళ్లి కాశ్మీర్ అందాలను ఆస్వాదించవచ్చు. ఈ ప్యాకేజీ ధర, ఇతర వివరాలు ఇలా ఉన్నాయి.
భారతీయ రైల్వేకి అనుబంధ సంస్థ అయిన ఐఆర్ సీటీసీ (ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్) రైళ్ల ద్వారా దేశవ్యాప్తంగా వివిధ మతపరమైన, పర్యాటక ప్రాంతాలకు టూర్ ప్యాకేజీలను నిర్వహిస్తుంది. తక్కువ ధరకే ఆయా ప్రాంతాలను సందర్శించే అవకాశం కల్పిస్తుంది. వీటితో పాటు దేశీయ, అంతర్జాతీయ పర్యాటక ప్రదేశాలకు ఎయిర్ టూర్ ప్యాకేజీలను కూడా ప్రవేశపెట్టింది. అంటే విమానంలో ఆయా ప్రాంతాలను చూసి వచ్చే వీలుంటుంది. దీనిలో భాగంగా ఇటీవల కాశ్మీర్ టూర్ ప్యాకేజీని ప్రకటించింది. భూమిపై స్వర్గంగా పిలిచే కాశ్మీర్ అందాలను సెప్టెంబర్‌లో చూడాలనుకునే వారికి ఐఆర్ సీటీసీ అందించే ఈ ప్యాకేజీ చాలా ఉపయోగంగా ఉంటుంది.
ప్యారడైజ్ ఆన్ ఎర్త్- కాశ్మీర్ ఎక్స్ బెంగళూరు అని పేరుతో ప్రవేశపెట్టిన ఈ ప్యాకేజీ వివరాలు ఇలా ఉన్నాయి. ఇది 5 రాత్రులు, 6 రోజుల పర్యటన. ప్యాకేజీలో భాగంగా బెంగళూరు నుంచి కాశ్మీర్ వరకు రౌండ్-ట్రిప్ విమాన ఏర్పాట్లు చేశారు. శ్రీనగర్, పహల్గాం, గుల్మార్గ్, సోన్‌మార్గ్ తదితర అందమైన ప్రదేశాలను చూడవచ్చు. అల్పాహారం, రాత్రి భోజనం, హోటల్లో వసతి, ప్రయాణానికి క్యాబ్ సేవలతో పాటు ప్రయాణ బీమా కూడా ప్యాకేజీలో ఉన్నాయి.
కాశ్మీర్ ను చూడాలనే ఆసక్తి కల పర్యాటకులు చాలా సులువుగా ఈ టూర్ ప్యాకేజీని బుక్ చేసుకోవచ్చు. ముందుగా ఐఆర్సీటీసీ వెబ్ సైట్ ని సందర్శించాలి. దానిలోని ’బుక్ నౌ’ ఎంపికపై క్లిక్ చేయాలి. వెంటనే ప్యాకేజీ వివరాలు కనిపిస్తాయి. మరింత సమాచారం కోసం 90031 40699, 85959 31291 నంబర్లను సంప్రదించవచ్చు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..