Benefits of Camphor: కర్పూరం దేవుడికి హారతి ఇవ్వడానికే కాదు సుగంధ ద్రవ్యంగా కూడా ఉపయోగిస్తారు. అంతే కాదు.. ఈ కర్పూరంవలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఆయుర్వేద చికిత్సలో కర్పూరాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. అసలు కర్పూర సువాసన పీలిస్తే చాలు శారీరక రుగ్మతలన్నీ పోయినట్లు, సేద తీరినట్లు ఉంటుంది. మానసిక ప్రశాంతత చేకూరుతుంది. కర్పూరం వల్ల కలిగే ఆరోగ్యఫలితాలు ఏమిటంటే..
* అన్ని రకాల ఆర్థరైటిస్, రుమాటిక్ నొప్పుల నివారిణిగా, నరాల సంబంధమైన సమస్యలు, వీపు నొప్పికి కర్పూరం బాగా పనిచేస్తుంది.
* పుండ్లు మానడానికి, పిల్లలకు గజ్జి, బొబ్బలు తగ్గడానికి, బ్రాంకయిటిస్, పలు రకాల ఇన్ఫెక్షన్లకు కర్పూరం ఉపయోగిస్తారు.
* స్వల్ప గుండె సమస్యలు, అలసట సమస్యలకు కొద్ది మొత్తం కర్పూరం వాడితే ఫలితముంటుంది.
* నాసికా సమస్యలకు యాంటిసెప్టిక్ గా కూడా దీనిని ఉపయోగిస్తారు. అందుకే విక్సు వెపోరబ్, కొన్నిరకరాల ఆయింట్మెంట్లన్నిటిలోనూ, చర్మం పై పుతగాపూసే లేపనములలోను, శ్వాసనాళాల్లో ఊపిరి సలపడానికి వాడే మందులలోను కర్పూరం వాడతారు.
* కర్పూరం నూనెలో దూదిని తడిపి లెప్రసీ వ్యాధివల్ల ఏర్పడిన గాయంమీద ప్రయోగిస్తే త్వరితగతిన మానుతుంది.
* కర్పూరాన్ని పొడిచేసి, నోటిలో ఉంచుకొని లాలాజలాన్ని మింగుతుంటే అతి దప్పిక తగ్గుతుంది.
* కాలుష్యాన్ని పోగొట్టి, వాతావరణాన్ని స్వచ్ఛంగా మారుస్తుంది.
*. అంటువ్యాధులు ప్రబలకుండా చేస్తుంది.
* కళ్ళకు మేలు చేస్తుంది కనుకనే కాటుకలో దీనిని వాడతారు. జలుబును, కఫాన్ని తగ్గిస్తుంది.
* మానసిక జబ్బులను సైతం పోగొడుతుంది.
*రక్తాన్ని శుద్ధి చేసి రక్త ప్రసరణ సవ్యంగా ఉండేలా చేస్తుంది.
*.అలజడులు, ఆందోళనలు తగ్గించి ఆనందాన్ని, ఆహ్లాదాన్ని ఇస్తుంది.
* కర్పూరం పురుగుల మందులు, చెడువాసనల నిర్ములనకు, బట్టలను కొరికి తినే చెదపురుగులు, నిర్ములనకు ఉపయోగిస్తుంటారు.
Also Read: మంగళవారం హనుమంతుడికి తమలపాకుల హారాన్ని సమర్పిస్తే కలిగే అద్భుత ఫలితాలు