Walking Benefits: రోజూ 30 నిమిషాల వాకింగ్‌తో శరీరంలో ఎలాంటి మార్పులో తెలిస్తే.. ఇక ఆగరు..

వాకింగ్‌ వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మనందరికీ తెలిసిందే. వాకింగ్‌కి మించిన ఈజీ ఎక్స్‌ర్‌ సైజ్‌ మరొకటి లేదని వైద్య నిపుణులు సైతం చెబుతుంటారు. ప్రతి రోజూ కనీసం 30 నిమిషాలు వాకింగ్‌ చేస్తే.. చాలు మీ శరీరంలో ఊహించని మార్పులు, లాభాలు కలుగుతాయని అంటున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

Walking Benefits: రోజూ 30 నిమిషాల వాకింగ్‌తో శరీరంలో ఎలాంటి మార్పులో తెలిస్తే.. ఇక ఆగరు..
Walking

Updated on: Jan 23, 2025 | 1:39 PM

రోజూ 30 నిమిషాలు అంటే కేవలం అరగంట పాటు వాకింగ్‌ చేయటం వల్ల మీరు ఊహించని లాభాలు ఉన్నాయి. పక్షవాతం, అధిక రక్తపోటు, టైప్ 2 మధుమేహం, గుండె జబ్బులు మొదలైన అనేక వ్యాధుల నుండి ఈ నడక మనల్ని రక్షిస్తుంది. అలాగే వాకింగ్‌ వల్ల గుండెకు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అలాగే గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అంతేకాదు..జిమ్‌కి వెళ్లి భారీ కసరత్తులు చేయాల్సిన పనిలేకుండా.. ప్రతిరోజూ కొన్ని నిమిషాలు నడవడం వల్ల బరువు అదుపులో ఉంటుంది. అందువలన మన శరీరంలోని అదనపు కొవ్వు తగ్గుతుంది. శరీర బరువు కూడా తగ్గుతుంది.

రోజూ ఉదయం కనీసం 30 నిమిషాల పాటు నడవడం వల్ల మధుమేహులకు మేలు చేస్తుంది. అధిక రక్తపోటుతో బాధపడే వారు ప్రతిరోజూ ఉదయం 30 నిమిషాల పాటు నడవడం వల్ల రక్తపోటును అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది. అంతేకాదు.. వాకింగ్‌ మన జీవక్రియను పెంచడం ద్వారా మన జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల పాటు నడవడం వల్ల మన ఎముకలు దృఢంగా మారడంతో పాటు కండరాలు బలపడతాయి. కండరాల తిమ్మిరి, ఎముకల నొప్పులు, కీళ్లనొప్పులు వంటి సమస్యలకు నివారణలు లేవు. వాకింగ్‌ వల్ల శరీరంలో శక్తి పెరుగుతుంది.

రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి కూడా నడక మంచి ఫలితాన్నిస్తుంది. ప్రతిరోజూ కొన్ని నిమిషాలు నడవడం వల్ల మన రోగనిరోధక శక్తిని బలోపేతం చేసుకోవచ్చు. పైగా, ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇతర వ్యాయామాల మాదిరి కాకుండా, నడక మానసిక ఆరోగ్యానికి మంచిది. రోజూ వాకింగ్ చేయడం వల్ల మీ మనసుకు విశ్రాంతినిచ్చి ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..