Pregnancy: గర్భిణీ స్త్రీలలో కాల్షియం లోపిస్తే ఏమవుతుందో తెలుసా.?

|

Aug 31, 2024 | 7:52 AM

ఇక గర్భం దాల్చిన సమయంలో మహిళల శరీరంలో విటమిన్స్‌ లోపం అస్సలు ఉండకూడదు. ముఖ్యంగా క్యాల్షియం లోపం ఉన్నట్లయితే ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని నిపుణులు చెబుతున్నారు. గర్భధారణ సమయంలో కాల్షియం శరీరంలో కీలక పాత్ర పోషిస్తుందని అంటున్నారు. ఇంతకీ క్యాల్షియం పోషించే పాత్ర ఏంటి.?

Pregnancy: గర్భిణీ స్త్రీలలో కాల్షియం లోపిస్తే ఏమవుతుందో తెలుసా.?
Pregnancy
Follow us on

ప్రతీ మహిళ జీవితంలో గర్భం దాల్చడం అనేది ఒక కీలక ఘట్టం. మరో జీవికి జన్మనిస్తున్నాన్న సంతోషం ఓవైపు, ఏదో తెలియని భయం మరోవైపు. మహిళల్లో మానసిక ఇబ్బందులకు దారి తీస్తుంటాయి. అందుకు గర్భిణీలుగా ఉన్న సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతుంటారు. ముఖ్యంగా తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తల్లితో పోటు కడుపులో బిడ్డకు కూడా అవసరమైన పోషకాలు అందేలా ఫుడ్‌ తీసుకోవాలని సూచిస్తుంటారు.

ఇక గర్భం దాల్చిన సమయంలో మహిళల శరీరంలో విటమిన్స్‌ లోపం అస్సలు ఉండకూడదు. ముఖ్యంగా క్యాల్షియం లోపం ఉన్నట్లయితే ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని నిపుణులు చెబుతున్నారు. గర్భధారణ సమయంలో కాల్షియం శరీరంలో కీలక పాత్ర పోషిస్తుందని అంటున్నారు. ఇంతకీ క్యాల్షియం పోషించే పాత్ర ఏంటి.? ఒకవేళ దీని లోపం వల్ల ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

కాల్షియం ఎముకలు, దంతాలను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గర్భధారణ సమయంలో శిశువు ఎముకలు, దంతాలు వేగంగా అభివృద్ధి చెందుతాయి. ఇందుకు కాల్షియం ఎంతో అవసరం. శిశువుకు కాల్షియం తల్లి శరీరం నుంచి లభిస్తుంది. తల్లి శరీరంలో కాల్షియం లోపం ఉంటే పుట్టబోయే బిడ్డపై ప్రభావం పడుతుంది. అంతేకాకుండా గర్భిణీలోనూ ఎముకలు బలహీనంగా మారుతాయి. భవిష్యత్తులో బోలు ఎముకల వ్యాధి వంటి వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది.

ఇక పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంపై కూడా కాల్షియం లోపం తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. శిశువు ఎముకలు సరిగ్గా అభివృద్ధి చెందవు. ఇది పుట్టిన తరువాత శిశువులో బలహీనతకు దారితీస్తుంది. అలాగే శిశువు గుండె, కండరాలతో పాటు నరాల అభివృద్ధిపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. బిడ్డ కడుపులో తగినంత కాల్షియం పొందకపోతే.. అది భవిష్యత్తులో చిన్నారుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.

గర్భధారణ సమయంలో స్త్రీలకు రోజుకు 1000 నుంచి 1200 mg కాల్షియం అవసరం ఉంటుంది. ఇది పాలు, పెరుగు, జున్ను, ఆకుకూరలు, నువ్వులు, బాదం వంటి ఆహార పదార్థాల ద్వారా లభిస్తుంది. అయితే నువ్వులు వేడి చేసే అవకాశం కూడా ఉంటుంది. కాల్షియం లోపం ఉంటే వైద్యుడి సూచన మేరకు కాల్సియం సప్లిమెంట్స్‌ను తీసుకోవచ్చు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్ వార్తల కోసం క్లిక్‌ చేయండి..