ప్రయాణ సమయం లేదంటే ఖాళీగా ఉన్న సమయాల్లో సంగీతాన్ని అస్వాదించడానికి ఇయర్‌ఫోన్‌లు వాడుతుంటాం. కానీ, మొదట్లో శబ్దం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో మాటలు సులభంగా వినిపించేందుకు ఇయర్ ఫోన్లు వాడేవారు. మాట్లాడుకోవటమే కాకుండా పాటలు వినడానికి కూడా వాడేవారు. ఇప్పుడు సినిమాలు, వీడియోలు, రీళ్లు, టీవీ షోలు చూడడం ఇలా అన్ని సందర్భాల్లోనూ ఇయర్ ఫోన్స్ వాడుతున్నారు. అయితే వీటి వినియోగం పరిమితంగా ఉంటే పర్వలేదు. అధికంగా ఉపయోగించే వారిలో వినికిడి శక్తి తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 1.1 బిలియన్ మందికి పైగా.. ఎక్కువ సౌండ్‌తో కూడిన సంగీతాన్ని వినడం వల్ల వినికిడి శక్తి తగ్గే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరించింది. ఇయర్ ఫోన్, ఇయర్ బడ్, ఎయిర్ ప్యాడ్, బ్లూటూత్‌తో ఫోన్‌లో ఎక్కువ మాట్లాడడం.. ఎక్కువ శబ్బంతో మ్యూజిక్‌ను అస్వాదించడం వల్ల అది వినికిడిపై ప్రభావం చూపుతున్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. రోజంతా వీటిని ఉపయోగించడం వల్ల చెవిలో ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. ఇయర్ ఫోన్‌ల వల్ల ఆరోగ్యంపై ఎలాంటి దుష్ప్రభావాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.
రోజంతా చెవిలో ఇయర్ ఫోన్ పెట్టుకుంటే చెవిటితనం మాత్రమే కాదు మానసిక సమస్యలు కూడా పెరుగుతాయి. బ్రెయిన్ డ్యామేజ్ జరుగుతుంది. ఇయర్‌ఫోన్‌లను ఎక్కువసేపు వాడటం వల్ల మెదడుపై ప్రభావం పడుతుంది. ఇయర్ ఫోన్లు లేదా హెడ్ ఫోన్స్ ద్వారా వెలువడే విద్యుదయస్కాంత తరంగాలు మన మెదడుపై చెడు ప్రభావం చూపుతాయి. అదనంగా, బిగ్గరగా సంగీతం కారణంగా, మెదడు కణాల పై పొర నాశనం అవుతుంది. తద్వారా చెవి, మెదడు మధ్య కనెక్షన్ బలహీనపడుతుంది.
ఇయర్‌ఫోన్‌లను ఎక్కువసేపు ఉపయోగించడం వల్ల మీరు చెవిటితనంతో బాధపడాల్సి వస్తుంది. నిజానికి ఎయిర్ ఫోన్ ను ఎక్కువ సేపు ఉంచుకోవడం వల్ల చెవుల నరాలపై ఒత్తిడి పడుతుంది. తద్వారా నరాల్లో వాపు సమస్య పెరుగుతుంది. వైబ్రేషన్ వల్ల వినికిడి కణాలు మరింత సున్నితంగా మారతాయి. కాబట్టి, మీరు చెవిటివారిగా మారే ప్రమాదం ఉంది. అధ్యయనం ప్రకారం, 90 డెసిబుల్స్ కంటే ఎక్కువ ఉన్న పాటను 2 గంటల కంటే ఎక్కువసేపు వింటే, అతను చెవిటివాడిగా మారే అవకాశం ఉంది. చెవుల వినికిడి సామర్థ్యం 90 డెసిబుల్స్ మాత్రమే. ఇది నిరంతరం పాటలు వినడం ద్వారా కాలక్రమేణా 40 నుండి 50 డెసిబుల్స్ వరకు తగ్గుతుంది. దాంతో ఆ వ్యక్తి సుదూర శబ్దాలను వినలేడు.
టిన్నిటస్ – టిన్నిటస్ కూడా ఒక సమస్య కావచ్చు, ఇది చెవుల లోపల గాలి ఈలలుగా వీచే వ్యాధి. లోపలి చెవిలోని కోక్లియా కణాలు నాశనం కావడం వల్ల ఇలాంటి గాలి శబ్దం వస్తుంది.
ఇన్ఫెక్షన్ – మనం నిరంతరం ఇయర్‌ఫోన్‌లు ధరించినప్పుడు చెవిలో వ్యాక్స్, ఇతర మురికి వాటి పాడ్‌లలో చిక్కుకుపోతుంది. శుభ్రపరచకుండా ఇయర్‌ఫోన్‌లను నిరంతరం ఉపయోగించడం వల్ల చెవి లోపల ఫంగల్, బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా, ఇయర్‌ఫోన్‌లు కూడా చాలామంది మార్చుకుంటూ ఉంటారు. అలాంటి వారిలో కూడా ఇన్‌ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంటుంది.
తలనొప్పి – ఇయర్ ఫోన్ నుండి వెలువడే విద్యుదయస్కాంత తరంగాల కారణంగా అది ఆ వ్యక్తి మెదడుపై చెడు ప్రభావం చూపుతుంది. దాని కారణంగా అతను తలనొప్పి, నిద్రలేమి సమస్యతో బాధపడాల్సి వస్తుంది.
ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి