దంతాలు తెల్లగా ఉంటే.. ముఖం అందం పెరుగుతుంది. అందంగా కనిపించడంలో పళ్లు కూడా ప్రముఖ పాత్ర పోషిస్తాయి. పళ్ళు పసుపు రంగులో ఉండటం వల్ల కొన్నిసార్లు మనం బహిరంగంగా నవ్వడం కూడా సాధ్యం కాదు. అదే సమయంలో పసుపు దంతాల కారణంగా, ఒక వ్యక్తి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. ఉదయం, రాత్రి పడుకునే ముందు దంతాలను శుభ్రం చేయాలని నిపుణులు తరుచూ చెబుతుంటారు. ఎందుకంటే.. ఇలా చేయడం వల్ల దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. దంతాలను సరిగ్గా శుభ్రం చేయకపోతే, క్రమంగా పసుపు రంగులోకి మారడం ప్రారంభమవుతుంది. అయితే, మీరు కూడా ఇదే సమస్యతో బాధపడుతుంటే.. పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయుర్వేద నిపుణులు కొన్ని సులభమైన ఇంటి నివారణలను చెబుతున్నారు. దీన్ని అనుసరించిన తర్వాత దంతాలు ముత్యాల్లా మెరిసిపోవడంతోపాటు.. అందం కూడా పెరుగుతుందని పేర్కొంటున్నారు.
దంతాలు పసుపు రంగులోకి మారి.. ఎన్ని ప్రయత్నాలు చేసినా తెల్లదనం రాకపోతే ఇంట్లోనే ఈ స్పెషల్ హోం రెమెడీని ప్రయత్నించవచ్చు. ఇందుకోసం ముందుగా ఒక చెంచా లవంగం పొడి, ఒక చెంచా బ్లాక్ సాల్ట్, ఒక చెంచా యాలకుల పొడి, ఒక చెంచా దాల్చిన చెక్క పొడి, ఎండిన వేప, పుదీనా ఆకులు తీసుకోవాలి. వీటన్నింటిని బాగా కలిపి పౌడర్‌లా తయారు చేసుకోవాలి. ఆ తర్వాత పొడిని ఓ బాక్స్‌లో నిల్వ చేయండి. మీరు దీనికి ఆవాల నూనెను కూడా జోడించాలి.
దంతాలు తెల్లగా చేసే ఈ పొడిని ఉపయోగించడం చాలా సులభం. ఇందుకోసం ముందుగా ఈ పౌడర్‌ను టూత్‌బ్రష్‌కు అప్లై చేసి పళ్లపై తేలికగా రుద్దండి.. రెండు నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. దీంతో మీ దంతాల మెరుపును తిరిగి తెస్తుంది. దీనితో పాటు, మీరు మీ దంతాలలో కావిటీలను కూడా నివారించగలుగుతారు. ఈ ప్రక్రియను కొన్ని వారాలపాటు ఉదయం, రాత్రి వేళల్లో చేస్తూనే ఉండాలి.
నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.
మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..