కిడ్నీల్లో రాళ్ల సమస్యా?.. అయితే ఇలా చేసి చూడండి..

| Edited By: Pardhasaradhi Peri

Oct 19, 2019 | 7:45 AM

మానవ శరీరంలో అతి ముఖ్యమైన అవయవాలు కిడ్నీలు. రక్తంలోని మలినాలను శుద్ది చేయడానికి వాటిని బహిర్గతం చేయడం ద్వారా మొత్తం శరీరాన్ని శుభ్రంగా ఉంచడానికి సహాయపడతాయి మూత్రపిండాలు. ఇటీవల కిడ్నీల్లో రాళ్ల సమస్యలు అధికంగా నమోదవుతున్నాయి. దీనికి కారణం మూత్రపిండాల పట్ల సరైన అవగాహన లేకపోవడంతో పాటు తగినన్ని నీళ్లను తాగకపోవడం ప్రధాన కారణాలు. కిడ్నీల్లో రాళ్లు ఎలా ఏర్పడతాయి? మనం ప్రతి రోజు తీసుకునే ఆహారంలో ఉండే లవణాలు మరియు ఖనిజాల యొక్క “కాల్షియం ఆక్సలేట్” […]

కిడ్నీల్లో రాళ్ల సమస్యా?.. అయితే  ఇలా చేసి చూడండి..
Follow us on

మానవ శరీరంలో అతి ముఖ్యమైన అవయవాలు కిడ్నీలు. రక్తంలోని మలినాలను శుద్ది చేయడానికి వాటిని బహిర్గతం చేయడం ద్వారా మొత్తం శరీరాన్ని శుభ్రంగా ఉంచడానికి సహాయపడతాయి మూత్రపిండాలు. ఇటీవల కిడ్నీల్లో రాళ్ల సమస్యలు అధికంగా నమోదవుతున్నాయి. దీనికి కారణం మూత్రపిండాల పట్ల సరైన అవగాహన లేకపోవడంతో పాటు తగినన్ని నీళ్లను తాగకపోవడం ప్రధాన కారణాలు.

కిడ్నీల్లో రాళ్లు ఎలా ఏర్పడతాయి?

మనం ప్రతి రోజు తీసుకునే ఆహారంలో ఉండే లవణాలు మరియు ఖనిజాల యొక్క “కాల్షియం ఆక్సలేట్” అనే పదార్థం ఘన రూపంలోకి మారి రాళ్లుగా తయారవుతాయి. ఇవి మూత్ర నాళాల్లోకి అడ్డుపడి మూత్ర విసర్జనకు ఆటంకం కలిగిస్తాయి. అదే సమయంలో కిడ్నీల్లో విపరీతమైన నొప్పి కూడా వస్తుంది.


నిమ్మ రసంతో ఎంతో మేలు
కిడ్నీల్లో రాళ్ల సమస్యతో బాధపడే వారికి నిమ్మరసం లేదా లెమన్ జ్యూస్ ఎంతో ఉపయోగపడుతుంది. నిమ్మలోని “సిట్రేట్” కంటెంట్ మన శరీరంలో కాల్షియం ఖనిజ గట్టిపడటాన్ని సులభంగా నిరోధిస్తుంది. అందువల్ల మీరు అల్పాహారం ముందు ఖాళీ కడుపుతో ఒక గ్లాసు నిమ్మరసం తాగడం అలవాటు చేసుకుంటే కిడ్నీ స్టోన్స్ సమస్య రాకుండా చూసుకోవచ్చు.

 


తులసి ఆకులతో అద్భుత ఫలితం

తులసి ఆకులలో “ఎసిటిక్ యాసిడ్” కంటెంట్ ఉన్నందున మూత్రపిండాల్లో రాళ్లను కరిగించడంలో ఇది గొప్ప పాత్ర పోషిస్తుంది. ప్రతిరోజూ ఒక టీస్పూన్ తులసి రసం తినడం వల్ల మీ కిడ్నీ ఆరోగ్యం మెరుగుపడుతుంది.

 


ఆపిల్ సైడర్ వెనిగర్ ఇంటి డాక్టర్
మీ ఇంటిల్లిపాదికి డాక్టర్ ఆపిల్ సైడర్ వెనిగర్ ఆపిల్ సైడర్ వెనిగర్ లోని “ఎసిటిక్ యాసిడ్” కంటెంట్ తులసి ఆకుతో సమానంగా ఉంటుంది. మీరు భోజనానికి ముందు ప్రతిరోజూ ఒక టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ ను నీటితో కలిపి సేవిస్తే మీకు కిడ్నీలో రాళ్ళు ఉంటే శరీరంలో చాలా త్వరగా కరిగిపోయేలా చేస్తుంది. ఇది రెడీమేడ్‌గా ఆయా షాపుల్లో లభ్యమవుతుంది.

అదే విధంగా గోదుమ గడ్డి రసం కూడా మూత్రపిండాల్లో రాళ్లను నిరోధించడంలో ప్రముఖంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రాళ్లు పెరగకుండా సహకరిస్తాయి. అయితే ఇవన్నీ పాటిస్తూ వైద్య నిపుణలను సంప్రదిస్తే మంచి ఫలితాలు వచ్చే అవకాశముంటుంది.