
వర్షాకాలంలో ముక్కు కారటం సాధారణమే. చాలా మంది ఇళ్లలో ఇది కనిపిస్తుంది. కొంత మందికి వర్షాకాలంలో ముక్కు కారుతుంటుంది. ఈ సమస్య జలుబు, సైనస్, అలెర్జీ కారణంగా వస్తుంది. ఈ సమస్య మీకూ ఉంటే.. వెంటనే మీరు మొదట డాక్టర్ వద్దకు పరిగెత్తాల్సిన అవసరం లేదు. మందులు తీసుకోకుండానే ఇంట్లోనే కొన్ని ఇంటి నివారణల ద్వారా ముక్కు కారటం సమస్యను చిటికెలో తగ్గించుకోవచ్చు. ఎలాగో ఇక్కడ తెలుసుకుందాం..
వర్షాకాలంలో ముక్కు కారుతుంటే.. అల్లం, తులసి ఆకులు, నిమ్మరసం, ఒక చెంచా తేనెతో తయారుచేసిన గోరువెచ్చని టీని రోజుకు 2-3 సార్లు తాగవచ్చు. ఇది జలుబును తగ్గిస్తుంది. అలెర్జీలను నివారిస్తుంది.
యూకలిప్టస్ నూనె లేదా పుదీనా ఆకులతో వేడి నీటిలో ఆవిరి పట్టినా ఫలితం ఉంటుంది. తలను ఒక గుడ్డ లేదంటే టవల్‌తో కప్పి గాలి పీల్చుకోవాలి. ఇది ముక్కు దిబ్బడను తొలగించడానికి, ముక్కు కారటం తగ్గించడానికి సహాయపడుతుంది.
వర్షాకాలంలో జలుబు సమస్యలకు ఒకటి లేదా రెండు వెల్లుల్లి రెబ్బలను నెయ్యి లేదా ఆవ నూనెలో వేయించి తింటే జలుబు ఇట్టే నయమవుతుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.