Lifestyle: చెమటతో వచ్చే దుస్తుల మరకలు ఎలా తొలగించుకోవాలో తెలుసా.?

వేసవిలో చాల మంది ఎదుర్కొనే సమస్యల్లో చెమట ప్రధానమైంది. విపరీతమైన వేడి కారణంగా చెమట ఎక్కువగా వస్తుంది. దీంతో చెమట వాసనతో పాటు ధరించిన దుస్తులు కూడా వాసన వస్తుంటాయి. అయితే వాసన అయితే దుస్తులు ఉతికితే సరిపోతుంది. కానీ చెమట వల్ల మరకలు కూడా ఏర్పడుతాయి. కాలర్‌పై, ఆర్మ్‌పిట్స్‌ వద్ద దుస్తుల రంగు మారిపోతుంది...

Lifestyle: చెమటతో వచ్చే దుస్తుల మరకలు ఎలా తొలగించుకోవాలో తెలుసా.?
Summer

Updated on: Apr 22, 2024 | 3:53 PM

వేసవిలో చాల మంది ఎదుర్కొనే సమస్యల్లో చెమట ప్రధానమైంది. విపరీతమైన వేడి కారణంగా చెమట ఎక్కువగా వస్తుంది. దీంతో చెమట వాసనతో పాటు ధరించిన దుస్తులు కూడా వాసన వస్తుంటాయి. అయితే వాసన అయితే దుస్తులు ఉతికితే సరిపోతుంది. కానీ చెమట వల్ల మరకలు కూడా ఏర్పడుతాయి. కాలర్‌పై, ఆర్మ్‌పిట్స్‌ వద్ద దుస్తుల రంగు మారిపోతుంది. దీంతో దుస్తులు ధరించాలంటే ఇబ్బందిగా అనిపిస్తుంది. అయితే చెమట కారణంగా వచ్చే మరకలు ఎలా తొలగించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

* ప్రతీ ఇంట్లో ఉండే బేకింగ్ సోడాతో ఈ మరకలను సింపుల్‌గా చెక్‌ పెట్టొచ్చు. బేకింగ్ సోడా బట్టలపై ఉన్న చెమట మరకలను త్వరగా తొలగిస్తుంది. చెమట తడిసిన ప్రదేశంలో కొంచెం బేకింగ్ సోడాను చిలకరించి, ఆపై 30 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. అనంతరం బ్రష్‌తో స్మూత్‌గా రుద్దితే సరిపోతుంది.

* నిమ్మరసంలో సహజసిద్ధమైన బ్లీచింగ్ గుణాలు ఉంటాయి. ముఖ్యంగా తెల్లటి దుస్తులపై మరకలను తొలగించడంలో సహాయపడుతుంది. చెమట మరకపై కొద్దిగా నిమ్మరసం రాసి, 10 నుంచి 15 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత కడిగేస్తే సరిపోతుంది మరక సింపుల్‌గా తొలగిపోతుంది. అయితే ముదురు రంగు దుస్తులపై నిమ్మకాయ రుద్దితో కలర్‌ వెలిసిపోయే అవకాశం ఉంటుంది.

* బట్టలు చెమట మరకలతో పాటు దుర్వాసన వస్తుంటే వైట్ వెనిగర్ ఉపయోగించండి. స్ప్రే బాటిల్‌లో సగం నీరు, సగం వైట్ వెనిగర్‌తో నింపాలి. ఈ లిక్విడ్‌ను మరకలు ఉన్న చోట స్ప్రే చేసి కాసేపటి తర్వాత కడిగేస్తే సరిపోతుంది.

* చెమట వల్ల దుస్తులు మరకలు అయితే కార్న్ స్టార్చ్ ఉపయోగించండి. చెమట మరకలపై మొక్కజొన్న పిండిని వేయాలి. అనంతరం కొన్ని గంటలపాటు అలాగే వదిలేసి బ్రష్‌తో రుద్దితే సరిపోతుంది.

* ఇక త్వరగా మరకలు పోగొట్టడంలో ఐస్‌ క్యూబ్స్‌ కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. మరకలు ఉన్న చోట ఐస్‌ ముక్కలతో రుద్దాలి. ఇలా చేయడం వల్ల మరకలు త్వరగా పోతాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..