AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సిగరెట్ మళ్లీ ముట్టరు.. ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు.. ఎవ్వరు చెప్పని సీక్రెట్స్..

సిగరెట్ అలవాటును మానేయడం చాలా కష్టం అని ఫిక్స్ అయిపోయారా? అయితే మీకో గుడ్ న్యూస్. దృఢ సంకల్పం ఉంటే.. మన ఇంట్లో దొరికే చిన్న చిన్న వస్తువులతోనే ఈ వ్యసనానికి శాశ్వతంగా గుడ్ బై చెప్పేయొచ్చు. స్మోకింగ్ మానేయడానికి హెల్ప్ అయ్యే ఆ 6 అద్భుతమైన టిప్స్ ఇప్పుడు తెలుసుకుందాం..

సిగరెట్ మళ్లీ ముట్టరు.. ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు.. ఎవ్వరు చెప్పని సీక్రెట్స్..
How To Quit Smoking Easily
Krishna S
|

Updated on: Jul 07, 2026 | 8:50 AM

Share

ఒక చిన్న దమ్ము.. క్షణకాలం పాటు మెదడుకు డోపమైన్ అందించి కిక్ ఇవ్వొచ్చు. కానీ అదే అలవాటు జీవితాంతం తీరని శోకాన్ని మిగుల్చుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ధూమపానం వల్ల క్యాన్సర్, ఊపిరితిత్తుల వ్యాధులు, ప్రాణాంతక గుండె జబ్బులు వస్తాయని సిగరెట్ ప్యాకెట్‌పై బొమ్మలు వేసి మరి మొత్తుకుంటున్నా.. చాలామంది ఈ వ్యసనం నుండి బయటపడలేకపోతున్నారు. ఒకసారి దీనికి బానిసలైతే మానేయడం కష్టమే.. కానీ అసాధ్యం మాత్రం కాదు. మీ దినచర్యలో కొన్ని చిన్న మార్పులు, కాస్త దృఢ సంకల్పం ఉంటే ఈ స్మోకింగ్ భూతాన్ని సులభంగా తరిమికొట్టవచ్చు.

స్మోకింగ్‌కు గుడ్ బై చెప్పే 6 అద్భుతమైన మార్గాలు

సంకల్పం ముఖ్యం

ధూమపానం మానేయాలనే ప్రయాణంలో మొదటి అడుగు మీ మనసే. ‘‘నేను నా ఆరోగ్యం కోసం, నా కుటుంబం కోసం ఈ అలవాటును మానేస్తున్నాను’’ అనే దృఢ నిశ్చయం మీలో బలంగా నాటుకుపోవాలి. ఈ అంతర్గత ప్రేరణే మిమ్మల్ని లక్ష్యం వైపు నడిపిస్తుంది.

ట్రిగ్గర్స్ గుర్తించి.. దూరం పెట్టండి

కొంతమందికి మద్యం తాగినప్పుడు, లేదా స్నేహితులతో కలిసి టీ తాగేటప్పుడు సిగరెట్ వెలిగించే అలవాటు ఉంటుంది. అలాంటి ట్రిగ్గర్ సమయాలను గుర్తించి వాటికి దూరంగా ఉండండి. ఒకేసారి మానేయడం కష్టమైతే.. రోజుకు తాగే సిగరెట్ల సంఖ్యను క్రమక్రమంగా తగ్గిస్తూ రండి.

నోటికి పని చెప్పండి

మీకు పొగతాగాలనే కోరిక కలిగినప్పుడల్లా నోటిని ఖాళీగా ఉంచకండి. సిగరెట్‌కు బదులుగా వీటిని ట్రై చేయండి..

  • యాలకులు లేదా సోంపు నమలడం.
  • షుగర్-ఫ్రీ చూయింగ్ గమ్ లేదా గట్టి మిఠాయిలు తినడం.
  • బాదం, వాల్‌నట్స్ వంటి డ్రై ఫ్రూట్స్ లేదా ఎండిన క్యారెట్ ముక్కలను నమలడం. ఇవి మీ దృష్టిని సిగరెట్ వైపు వెళ్లకుండా మళ్లిస్తాయి.

వ్యాయామం, యోగాతో ఒత్తిడికి చెక్

చాలామంది ఒత్తిడి తగ్గించుకోవడానికి స్మోక్ చేస్తుంటారు. కానీ దానికి బదులు క్రమం తప్పకుండా వ్యాయామం, యోగా చేయడం వల్ల శరీరంలో ఎండార్ఫిన్లు విడుదలవుతాయి. ఇవి సహజంగానే ఒత్తిడిని తగ్గించి, పొగతాగాలనే కోరికను అణచివేస్తాయి.

ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సపోర్ట్

మీరు సిగరెట్ మానేయాలని నిర్ణయించుకున్న విషయాన్ని మీ కుటుంబ సభ్యులకు, నమ్మకమైన స్నేహితులకు చెప్పండి. మీరు దారి తప్పుతున్నప్పుడు వారు మిమ్మల్ని హెచ్చరిస్తారు, మానసికంగా ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తారు.

కొత్త అభిరుచులను అలవర్చుకోండి

ఖాళీ సమయం దొరికితేనే సిగరెట్ ఆలోచనలు వస్తాయి. అందుకే మీ మెదడుకు నచ్చిన వేరే పని పెట్టండి. డ్రాయింగ్ వేయడం, క్రాఫ్ట్స్ చేయడం, గార్డెనింగ్ లేదా మీకు నచ్చిన కొత్త విషయాలు నేర్చుకోవడం లాంటి వాటిపై దృష్టి పెట్టండి. ఇది మీ మూడ్‌ను మార్చడమే కాకుండా స్మోకింగ్ మానేసే ప్రాసెస్‌ను సులభతరం చేస్తుంది.

సిగరెట్ తాగడం వల్ల పోయేది మీ ఆరోగ్యం మాత్రమే కాదు.. మీ కుటుంబ సంతోషం కూడా. ఒక్క క్షణం ఆలోచించండి.. ఇప్పుడే మీ దృఢ సంకల్పాన్ని తీసుకోండి. ఆరోగ్యకరమైన రేపటి వైపు అడుగులు వేయండి..

Follow Us
రామ్‌ చరణ్‌కు సర్జరీ.. 'అపోలో' ఉండగా.. గంగా హాస్పిటల్ ఎందుకు?
రామ్‌ చరణ్‌కు సర్జరీ.. 'అపోలో' ఉండగా.. గంగా హాస్పిటల్ ఎందుకు?
IND vs SL Test: రీఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. దూరమైన ముగ్గురు..
IND vs SL Test: రీఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. దూరమైన ముగ్గురు..
రాత్రి పడుకునే ముందు ఈ 3 విషయాలను చూడొద్దు.. ప్రశాంతమైన నిద్రకు..
రాత్రి పడుకునే ముందు ఈ 3 విషయాలను చూడొద్దు.. ప్రశాంతమైన నిద్రకు..
సింపుల్ చిట్కా.. వర్షాకాలంలో బట్టలు ఇలా ఆరబెట్టుకోండి..
సింపుల్ చిట్కా.. వర్షాకాలంలో బట్టలు ఇలా ఆరబెట్టుకోండి..
పెద్దల పాదాలకు నమస్కారం ఎందుకు చేస్తారు? చరణస్పర్శ వెనుక ఉన్న..
పెద్దల పాదాలకు నమస్కారం ఎందుకు చేస్తారు? చరణస్పర్శ వెనుక ఉన్న..
వా.. ఏం ఐడియా సర్.. హైదరాబాద్‌లో ఇక కరెంట్ కష్టాలకు చెక్!
వా.. ఏం ఐడియా సర్.. హైదరాబాద్‌లో ఇక కరెంట్ కష్టాలకు చెక్!
పక్కా తెలంగాణ ఫోక్ సాంగ్..యూట్యూబ్‌ను ఊపేస్తోన్న కొత్త సినిమా పాట
పక్కా తెలంగాణ ఫోక్ సాంగ్..యూట్యూబ్‌ను ఊపేస్తోన్న కొత్త సినిమా పాట
మక్క గారెలు ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే..
మక్క గారెలు ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే..
మిథున రాశిలోకి కుజుడు.. వారి జీవితాల్లో తిరుగులేని విజయాలు
మిథున రాశిలోకి కుజుడు.. వారి జీవితాల్లో తిరుగులేని విజయాలు
డిగ్రీ పూర్తి చేశారా? ISROలో ఉద్యోగం పొందే అవకాశం..
డిగ్రీ పూర్తి చేశారా? ISROలో ఉద్యోగం పొందే అవకాశం..