Postpone Periods Naturally: పీరియడ్స్ ని నేచురల్ గా ఇలా వాయిదా వేసుకోండి.. ఆ ట్రిక్స్ ఏంటంటే!
మహిళలకు పీరియడ్స్ అనేది ఒక వరమే అయినా.. దీంతో అనేక నష్టాలను ఎదుర్కొనాల్సి ఉంటుంది. సరిగ్గా నెలసరి సమయాల్లో ఏదో ఒక ఫంక్షన్, పార్టీలు, పెళ్లిళ్లు ఉంటాయి. దీంతో వెళ్లలేని పరిస్థితి నెలకొంటుంది. ముఖ్యంగా క్రీడాకారులకు అయితే మరిన్ని ఇబ్బందులను ఎదుర్కొనాల్సి ఉంటుంది. అయితే చాలా మంది నెలసరిని ఆపేందుకు ట్యాబ్లెట్స్ ని వేసుకుంటారు. ఏదో ఒకసారి ట్యాబ్లెట్స్ వేసుకుంటే పర్వాలేదు. కానీ ప్రతిసారీ నెలసరిని వాయిదా వేయడం మంచిది కాదు. దీని వల్ల మహిళలకు..
మహిళలకు పీరియడ్స్ అనేది ఒక వరమే అయినా.. దీంతో అనేక నష్టాలను ఎదుర్కొనాల్సి ఉంటుంది. సరిగ్గా నెలసరి సమయాల్లో ఏదో ఒక ఫంక్షన్, పార్టీలు, పెళ్లిళ్లు ఉంటాయి. దీంతో వెళ్లలేని పరిస్థితి నెలకొంటుంది. ముఖ్యంగా క్రీడాకారులకు అయితే మరిన్ని ఇబ్బందులను ఎదుర్కొనాల్సి ఉంటుంది. అయితే చాలా మంది నెలసరిని ఆపేందుకు ట్యాబ్లెట్స్ ని వేసుకుంటారు.
ఏదో ఒకసారి ట్యాబ్లెట్స్ వేసుకుంటే పర్వాలేదు. కానీ ప్రతిసారీ నెలసరిని వాయిదా వేయడం మంచిది కాదు. దీని వల్ల మహిళలకు మరిన్ని లేని పని సమస్యలు ఎక్కువ అవుతాయి. కాగా పీరియడ్స్ టైమ్ లో మహిళలు ప్యాడ్స్ మారుస్తూ ఉంటారు. బయట ఉన్నప్పుడు అది అసౌకర్యానికి దారి తీస్తుంది.
ట్యాబ్లెట్స్ వేసుకోవడం వల్ల ఆరోగ్య పరంగా కూడా అలసట, నడుం నొప్పి, కడుపులో నొప్పి, ఛాతీ నొప్పి, తల నొప్పి వంటి సమస్యలను ఎదుర్కొనాల్సి ఉంటుంది. ట్యాబ్లెట్స్ కాకుండా.. సహజమైన పద్దతుల్లో కూడా పీరియడ్స్ ని వాయిదా వేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.
పీరియడ్స్ వచ్చే వారం రోజుల ముందు యాపిల్ సైడర్ వెనిగర్ ను.. నీటిలో కలుపుకుని తాగాలి. ఇలా చేస్తే ఆరోగ్యంతో పాటు నెలసరి కూడా బ్రేక్ అవుతుంది. పీరియడ్స్ వచ్చే ముందు నిమ్మ రసం అధికంగా తీసుకుంట.. రుతుక్రమం అనేది ఆలస్యంగా వస్తుంది. దీని గురించి ప్రాచీన వైద్య గ్రంధాల్లో తెలిపారు.
నెలసరి వచ్చే ముందు జెలటిన్ నీటిని వారం రోజుల ముందు నుంచి తాగితే నెలసరి అనేది లేటుగా వస్తుంది. అయితే మరీ ఎక్కువగా తీసుకోకూడదు. అలాగే దాల్చిన చెక్కతో తయారు చేసిన టీ తాగడం వల్ల కూడా నెలసరి అనేది లేటుగా వస్తుంది. అలాగే కడుపు ఉబ్బరం, కండరాల తిమ్మిరి, అధిక రక్త స్రావాన్ని కూడా అదుపు చేస్తుంది.