Crab Curry: పీతల కర్రీ చేయడం రాదా.. ఇదిగో ఈ రెసిపీ ఫాలో అయిపోండి!

| Edited By: Ravi Kiran

Mar 03, 2024 | 10:50 PM

పీతల కర్రీ.. ఇప్పుడున్న జనరేషన్‌లో చాలా మందికి పీతల గురించి తెలీదు. వీటితో చేసే కర్రీకి చాలా డిమాండ్ ఉంది. ముఖ్యంగా సముద్ర తీరాన ఉన్న ప్రాంతాల్లో వీటిని ఇష్టంగా వండుకుని తింటారు. పీతలు తినడం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. వీటిని సరిగ్గా వండితే చాలా టేస్టీగా ఉంటుంది. పీతలు కర్రీ రాని వాళ్లు ఒక్కసారి ఇలా వండండి.. మళ్లీ ఇలాగే చేసుకుని తింటారు. ఈ కర్రీని చాలా తక్కువ సమయంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని తయారు చేయడం కూడా చాలా సులభం. మరీ ఈ పీతల కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు..

Crab Curry: పీతల కర్రీ చేయడం రాదా.. ఇదిగో ఈ రెసిపీ ఫాలో అయిపోండి!
Crab Curry
Follow us on

పీతల కర్రీ.. ఇప్పుడున్న జనరేషన్‌లో చాలా మందికి పీతల గురించి తెలీదు. వీటితో చేసే కర్రీకి చాలా డిమాండ్ ఉంది. ముఖ్యంగా సముద్ర తీరాన ఉన్న ప్రాంతాల్లో వీటిని ఇష్టంగా వండుకుని తింటారు. పీతలు తినడం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. వీటిని సరిగ్గా వండితే చాలా టేస్టీగా ఉంటుంది. పీతలు కర్రీ రాని వాళ్లు ఒక్కసారి ఇలా వండండి.. మళ్లీ ఇలాగే చేసుకుని తింటారు. ఈ కర్రీని చాలా తక్కువ సమయంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని తయారు చేయడం కూడా చాలా సులభం. మరీ ఈ పీతల కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటి? ఎలా తయారు చేస్తారో ఇప్పుడు చూద్దాం.

పీతల కర్రీకి కావాల్సిన పదార్థాలు:

శుభ్రం చేసిన పీతలు, ఆయిల్, ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, కారం ఉప్పు, పసుపు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, కొత్తి మీర, ధనియాల పొడి, కొబ్బరి పొడి, జీలకర్ర పొడి, బిర్యానీ ఆకులు, టమాటాలు, ఎండు మిర్చి.

పీతల కర్రీ తయారీ విధానం:

ముందుగా పీతలను శుభ్రం చేసుకుని పక్కకు పెట్టుకోండి. వీటిలో పసుపు, ఉప్పు, కారం వేసి ఓ అరగంట సేపు మ్యారినేట్ చేసుకోండి. నెక్ట్స్ ఇప్పుడు ఒక కర్రీ పాత్రలో ఆవాల నూనె లేదా నార్మల్ ఆయిల్ అయినా ఉపయోగించుకోవచ్చు. ఆయిల్ వేడెక్కాక.. జీలకర్ర, బిర్యానీ ఆకులు, ఎండు మిర్చి వేసి బాగా వేయించుకోవాలి. ఇవి వేగాక.. ఉల్లి పాయ ముక్కలు, పచ్చి మిర్చి కూడా వేసి కలపాలి. ఉల్లి పాయలు రంగు మారాక.. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేయాలి. ఇప్పుడు టమాటా ముక్కలు వేసి.. మెత్తగా అయ్యేంత వరకు ఉడికించు కోవాలి.

ఇవి కూడా చదవండి

ఆ తర్వాత ధనియాల పొడి, కారం, పసుపు, గరం మసాలా, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇవి బాగా వేగాక మ్యారినేట్ చేసిన పీతలు కూడా వేసేయాలి. వీటిని కూడా ఓ ఐదు నిమిషాల పాటు వేయించి.. నీళ్లు పోయాలి. నెక్ట్స్ కొబ్బరి పొడి వేసి కర్రీ దగ్గర పడేంత వరకు ఉడికించు కోవాలి. చివరిగా కొత్తిమీర, కరివేపాకు వేసి ఓ నిమిషం పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే ఎంతో టేస్టీగా ఉండే పీతల కర్రీ సిద్ధం. దీన్ని అన్నం, రోటీస్‌తో తింటే చాలా రుచిగా ఉంటుంది.