AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lizards: ఇంట్లో బల్లుల బెడదతో విసిగిపోయారా? ఈ మ్యాజిక్ స్ప్రేతో క్షణాల్లో మాయం!

Lizards: ప్రముఖ మాస్టర్‌షెఫ్ పంకజ్ భదౌరియా పంచుకున్న ఈ చిట్కా, ఇంట్లో తిరిగే బల్లుల సమస్య నుండి చాలా సులభంగా విముక్తి కలిగిస్తుంది. మార్కెట్లో దొరికే కెమికల్ స్ప్రేల కంటే ఇది ఎంతో సురక్షితమైనది. అలాగే ప్రభావవంతమైనది. ఎండాకాలం, వర్షాకాలం వచ్చిందంటే చాలు..

Lizards: ఇంట్లో బల్లుల బెడదతో విసిగిపోయారా? ఈ మ్యాజిక్ స్ప్రేతో క్షణాల్లో మాయం!
Lizards At Home
Subhash Goud
|

Updated on: May 18, 2026 | 11:17 AM

Share

Lizards at Home: ఎండాకాలం, వర్షాకాలం వచ్చిందంటే చాలు.. ఇళ్లలోకి దోమలు, ఈగలు, కీటకాలతో పాటు బల్లుల రాక కూడా విపరీతంగా పెరుగుతుంది. చాలా మందికి గోడలపై బల్లులు తిరుగుతుంటే ఒళ్లు జలదరిస్తుంది. కొందరైతే భయంతో గదిలో నుండి బయటకు వచ్చేస్తుంటారు. బల్లులను తరిమేయడానికి నెమలి ఈకలు, కోడిగుడ్డు పెంకులు పెట్టినా పెద్దగా ఫలితం ఉండదు. అందుకే కేవలం 3 వస్తువులతో బల్లులను తక్షణమే పారద్రోలే ఒక అద్భుతమైన లిక్విడ్‌ను మాస్టర్‌షెఫ్ పంకజ్ భదౌరియా పరిచయం చేశారు.

స్ప్రే తయారు చేయడానికి కావలసిన వస్తువులు:

  • నాఫ్తలిన్ గోళీలు: 3
  • డెటాల్ (Dettol లిక్విడ్): 2 చెంచాలు
  • నీళ్లు: అర కప్పు

తయారు చేసే విధానం:

మొదటగా 3 నాఫ్తలిన్ గోళీలను ఒక కవర్లో వేసి, బాగా దంచి మెత్తటి పౌడర్‌లా చేసుకోండి. ఒక గిన్నెలో అర కప్పు నీళ్లు తీసుకుని, అందులో ఈ నాఫ్తలిన్ పౌడర్, 2 చెంచాల డెటాల్ లిక్విడ్‌ను వేయండి. ఈ మూడు వస్తువులు ఒకదానితో ఒకటి బాగా కలిసేలా బాగా మిక్స్ చేయండి. అంతే.. బల్లులను తరిమేసే పవర్‌ఫుల్ మాస్టర్ స్ప్రే సిద్ధం.

ఇంటిలోని ఏయే భాగాలలో స్ప్రే చేయాలి?

ఈ లిక్విడ్‌ను ఒక ఖాళీ స్ప్రే బాటిల్‌లో పోసుకుని, ఇంట్లో బల్లులు ఎక్కువగా తిరిగే ప్రాంతాలలో స్ప్రే చేయండి. ముఖ్యంగా వంట గదుల మూలలు. కిటికీల చుట్టుపక్కల, తలుపుల వెనుక భాగం. అలాగే వంటగదిలోని చీకటి ప్రాంతాలు, కిచెన్ సింక్ కింద, క్యాబినెట్ల వెనుక ఉండే ఖాళీ స్థలాలు.

ఇవి కూడా చదవండి

ఈ చిట్కా ఎందుకు అంత బాగా పనిచేస్తుంది?

నాఫ్తలిన్ గోళీలు, డెటాల్ రెండింటికీ చాలా తీవ్రమైన, ఘాటైన వాసన ఉంటుంది. ఈ వాసన బల్లులకు అస్సలు పడదు. అందువల్ల ఈ స్ప్రే చల్లిన ప్రాంతాలకు బల్లులు రావడానికి అస్సలు సాహసించవు.

తీసుకోవలసిన జాగ్రత్తలు:

ఈ స్ప్రేని ఉపయోగించేటప్పుడు కొన్ని చిన్న జాగ్రత్తలు పాటించడం అవసరం. ఇంట్లో చిన్న పిల్లలు లేదా పెంపుడు జంతువులు ఉంటే వారికి అందనంత ఎత్తులో దీనిని స్ప్రే చేయండి. అలాగే, నాఫ్తలిన్ ఘాటు ముక్కుకు తగలకుండా స్ప్రే చేసే సమయంలో చేతులకు గ్లౌజెస్, ముఖానికి మాస్క్ ధరిస్తే మరింత మంచిది.

ఇది కూడా చదవండి: Indian Railways: రైలులో జనరల్ బోగీలు ఎప్పుడూ ముందు, వెనుకే ఎందుకు ఉంటాయో తెలుసా? దీని వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us