Sleeping Tips: ఈ గండి కోట రహస్యం తెలిస్తే.. మీరూ రాత్రిళ్లు పడుకోగానే వెంటనే కునుకేస్తారు!

సాధారణంగా ఒక వ్యక్తి రోజుకు కనీసం 7 - 8 గంటలు నిద్రపోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. కానీ చాలా మందికి రాత్రి పూట పడుకున్న వెంటనే నిద్రపట్టదు. ఎంత ప్రయత్నించినా కంటిపై కునుకు రానేరాదు. మీరు కూడా అలాంటి సమస్యతో బాధపడుతున్నారా? పడుకున్న వెంటనే మంచి నిద్ర రావాలంటే..

Sleeping Tips: ఈ గండి కోట రహస్యం తెలిస్తే.. మీరూ రాత్రిళ్లు పడుకోగానే వెంటనే కునుకేస్తారు!
How To Fall Sleep In 2 Minutes

Updated on: Aug 29, 2025 | 1:46 PM

శారీరక, మానసిక ఆరోగ్యానికి ఆహారం, శారీరక శ్రమ ఎంత ముఖ్యమో.. నిద్ర కూడా అంతే ముఖ్యం. సాధారణంగా ఒక వ్యక్తి రోజుకు కనీసం 7 – 8 గంటలు నిద్రపోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. కానీ చాలా మందికి రాత్రి పూట పడుకున్న వెంటనే నిద్రపట్టదు. ఎంత ప్రయత్నించినా కంటిపై కునుకు రానేరాదు. మీరు కూడా అలాంటి సమస్యతో బాధపడుతున్నారా? పడుకున్న వెంటనే మంచి నిద్ర రావాలంటే ఏమి చేయాలా..ని ఆలోచిస్తున్నారా? అయితే ఈ చిట్కాలు ఫాలో అయిపోండి..

సాక్స్ ధరించడం

నిద్రపోయేటప్పుడు సాక్స్ ధరించడం వల్ల బాగా నిద్రపడుతుంది. ఇది మీ పాదాలకు వెచ్చని అనుభూతిని అందించడమే కాకుండా.. మెదడుకు నిద్ర సంకేతంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి, నిద్రపోయేటప్పుడు సాక్స్ ధరించడం మంచి ఆలోచన అని నిపుణులు సలహా ఇస్తున్నారు.

లైట్లు ఆర్పండి

కొంతమంది పడుకునే ముందు లైట్లు ఆర్పరు. ఈ అలవాటు వల్ల నిద్రపోవడంలో ఇబ్బంది కలుగుతుంది. అవును.. ఎక్కువ వెలుతురు ఉంటే, పడుకున్న వెంటనే నిద్రపోలేరు. కాబట్టి లైట్లు ఆఫ్ చేసి గదిలోకి వెలుతురు పడకుండా చూసుకోవాలి. ఈ సలహాను పాటించడం ద్వారా పడుకున్న వెంటనే చక్కగా నిద్రపోతారు.

ఇవి కూడా చదవండి

మంచి మంచం

మంచి నిద్ర రావాలంటే మీరు పడుకునే మంచం కూడా బాగుండాలి. శరీరంపై ఒత్తిడి కలిగించని, నొప్పి కలిగించని మృదువైన మంచం, దిండును ఉపయోగించాలి. ఇది ఖచ్చితంగా మంచి నిద్రకు సహాయపడుతుంది.

పరిసరాలను నిశ్శబ్దంగా ఉంచాలి

బెడ్ రూమ్ లో ఎక్కువ శబ్దం లేకుండా చూసుకోవాలి. శబ్దాలు వింటే వెంటనే నిద్రపట్టదు. కాబట్టి మీ బెడ్ రూమ్ ని నిశ్శబ్దంగా ఉంచడానికి ప్రయత్నించాలి. పడుకున్న వెంటనే నిద్రపోవడానికి ఇది ఖచ్చితంగా సహాయపడుతుంది.

శ్వాస వ్యాయామాలు

పడుకున్న వెంటనే మంచి నిద్ర పోవడానికి, పడుకునే ముందు కొన్ని శ్వాస వ్యాయామాలు చేయాలి. అంటే ముక్కు ద్వారా లోతైన శ్వాస తీసుకొని నెమ్మదిగా గాలిని వదలాలి. ఈ శ్వాస వ్యాయామం మంచి నిద్ర పొందడానికి సహాయపడుతుంది.

పుస్తకాలు చదవాలి

పడుకునే ముందు మొబైల్ చూసే బదులు ఏదైనా పుస్తకం చదవడం అలవాటు చేసుకోవాలి. ఒత్తిడిని తగ్గించడానికి, మనసును ప్రశాంతంగా ఉంచడానికి ఇది ఒక గొప్ప మార్గం. ఇది మీ నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది.

మొబైల్‌కి దూరంగా ఉండాలి

పడుకున్న వెంటనే నిద్రపోవాలనుకుంటే.. మొబైల్, ల్యాప్‌టాప్, ఇతర గాడ్జెట్‌లను బెడ్‌కు దూరంగా ఉంచాలి. ఎందుకంటే ఇవి మీ దృష్టి మరల్చుతాయి. దీని కారణంగా సరిగ్గా నిద్రపోలేరు.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.