High Protein: చలికాలంలో హై ప్రొటీన్ బ్రెక్‌ఫాస్ట్ కావాలనుకుంటున్నారా..? అయితే, సింపుల్‌గా ఇలా తయారు చేసుకోండి..

ఆధునిక కాలంలో ఎన్నో వ్యాధులు చుట్టుముడుతున్నాయి. ఈ క్రమంలో ఆరోగ్యంగా ఉండాలంటే పలు ఆహార నియమాలు పాటించడంతోపాటు శారీరకంగా చురుకుగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

High Protein: చలికాలంలో హై ప్రొటీన్ బ్రెక్‌ఫాస్ట్ కావాలనుకుంటున్నారా..? అయితే, సింపుల్‌గా ఇలా తయారు చేసుకోండి..
Healthy Breakfast Recipes

Updated on: Nov 18, 2022 | 9:27 AM

Healthy Breakfast Recipes: ఆధునిక కాలంలో ఎన్నో వ్యాధులు చుట్టుముడుతున్నాయి. ఈ క్రమంలో ఆరోగ్యంగా ఉండాలంటే పలు ఆహార నియమాలు పాటించడంతోపాటు శారీరకంగా చురుకుగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. డిజిటల్ యుగంలో చాలామంది సోషల్ మీడియాలో వీడియోలు లేదా చిత్రాల ద్వారా వారి ఉత్తమ ఆహార ఎంపికలను చూస్తుంటారు. దీని ద్వారా వాటిని జీవితంలో కూడా వర్తింపజేస్తున్నారు. డైట్ రొటీన్‌ను అనుసరించడం మంచిది.. అయితే దీని కోసం సరైన సమాచారాన్ని తెలుసుకోవడం కూడా అవసరం.. ప్రోటీన్, శరీరానికి చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. దానిని రెగ్యులర్‌గా తీసుకోవడం మంచిది. అయితే, ఎలాంటి పదార్థాలు తీసుకోవాలి..? ఏది తింటే మంచిది అనే గందరగోళం తరచుగా ప్రజలలో కొనసాగుతుంది. ఆరోగ్యకరమైన, రుచిగా ఉండే ప్రోటీన్ తీసుకోవడం ద్వారా పలు సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ముఖ్యంగా ఉదయం అల్పాహారంలో తీసుకునే కొన్ని హై ప్రొటీన్ వంటకాల గురించి ఇప్పుడు తెలుసుకోండి.. దీనిద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చు.

పాలకూర.. పెసరపప్పు దోశ..

మీరు మీ బ్రేక్‌ఫాస్ట్‌లో కొత్తగా ఏదైనా ప్రయత్నించాలనుకుంటే.. పాలకూర, పెసర పప్పుతో చేసిన దోశను ట్రై చేయవచ్చు..

కావలసిన పదార్థాలు: దీని కోసం మీకు నానబెట్టిన పెసర పప్పు, పాలకూర, ఉప్పు, నూనె అవసరం

పెసరపప్పు అట్టును ఇలా చేయండి: పెసర పప్పును రాత్రిపూట నానబెట్టండి. ఉదయం, నానబెట్టిన పప్పును మిక్సీలో రుబ్బండి.. దీని తరువాత, అందులో తరిగిన బచ్చలికూరను కలపండి. ఇప్పుడు ఉప్పు, ఒరేగానో ఇతర పదార్థాలను కలపాలి. ఆ తర్వాత పాన్ మీద దోశ వేసి తినండి..

సోయా పోహా

పోహా – సోయా రెండూ ప్రోటీన్ కు మంచి మూలాలు. వాటి నుంచి తయారుచేసిన పదార్థాలు రుచిగా ఉంటాయి. ఇలా బ్రేక్ ఫాస్ట్ లో సోయా పోహా సిద్ధం చేసుకోండి.

కావలసినవి: పోహా (1 కప్పు నానబెట్టినవి), శనగలు (1/2 కప్పు), బీన్స్ (1/2 కప్పు), తరిగిన సోయా (2 కప్పులు), జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, 1 టీస్పూన్ అల్లం, 1 టీస్పూన్ పచ్చిమిర్చి ( సన్నగా తరిగినవి) 1) ఉల్లిపాయ (సన్నగా తరిగినవి), కొత్తిమీర, ఉప్పు, నూనె, నిమ్మరసం అవసరం.

సోయా పోహాను ఇలా చేయండి: గిన్నెలో నూనె వేసి.. తీసుకుని అందులో జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేయాలి. కొంచెం వేడైన తర్వాత కొద్దిగా పచ్చిమిర్చి, అల్లం వేసి వేయించాలి. ఇప్పుడు దానిలో అన్ని కూరగాయలను వేసి, ఆపై ముక్కలు చేసిన సోయాను జోడించండి. బాగా వేగిన తర్వాత దానికి పోహా వేసి ఉడికిన తర్వాత పచ్చి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.

వీటిలో హైప్రొటిన్ ఉంటుందని.. చలికాలంలో తింటే శరీరానికి మంచిగా పోషకాలు అందుతాయని పేర్కొంటున్నారు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం..