మాయ లేదు మంత్రం లేదు.. నల్లగా మారిన వెండి ఆభరణాలను క్షణాల్లో మెరిపించే సూపర్ చిట్కా!

వెండి నగలు, పట్టీలు, మెట్టెలు వంటి నిత్యం వాడే వస్తువులు కాలక్రమేణా వాటి సహజ మెరుపును కోల్పోయి నల్లగా మారడం సాధారణం. గాలిలోని సల్ఫర్, ఒంటి చెమట, రోజూ వాడే సోపులు, ధూళి వల్ల ఈ మార్పు వస్తుంది. ఈ నలుపును వదిలించుకోవడానికి మూడు సులువైన చిట్కాలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ చూద్దాం.

మాయ లేదు మంత్రం లేదు.. నల్లగా మారిన వెండి ఆభరణాలను క్షణాల్లో మెరిపించే సూపర్ చిట్కా!
Clean Silver Jewellery At Home

Updated on: Jul 13, 2026 | 6:30 AM

సాధారణంగా మన ధరించే కొన్ని వెండి ఆభరణాలు కాలక్రమేనా.. నల్లగా మారిపోతూ ఉంటాయి. ఇందుకు ప్రధాన కారణం.. గాలిలోని సల్ఫర్, చెమట వల్ల అవి వాటి సహజ రంగును కోల్పోయి.. నల్లగా మారిపోతాయి. అయితే చాలా మంది వాటిని వాడకుండా అమ్మేస్తూ ఉంటారు. కానీ మీ ఇంట్లో ఉండే కొన్ని వస్తువులతోనే వాటిని మళ్లీ కొత్తవాటిలా మెరిపించవచ్చని మీకు తెలుసా? అయివు.. ఇంట్లొ దొరికే అల్యూమినియం ఫాయిల్ , బేకింగ్ సోడా, ఉప్పు, గోరువెచ్చని నీటి ద్వారా క్షణాల్లో మీరు వెండి ఆభరణాలను కొత్తవాటిలా మార్చేవచ్చు.

నల్లగా మారిన వెంటి ఆభరణాలను తెల్లగా మార్చే చిట్కాలు

అల్యూమినియం ఫాయిల్, బేకింగ్ సోడా పద్ధతి

ఇవి కూడా చదవండి

రసాయన చర్య ద్వారా నలుపును వేగంగా తొలగించడానికి ఈ పద్ధతి బాగా పనిచేస్తుంది. ఇందుకోసం ఒక చిన్న గిన్నె లోపలి భాగాన్ని అల్యూమినియం ఫాయిల్ పేపర్‌తో పూర్తిగా కప్పాలి. అందులో ఒక చెంచా బేకింగ్ సోడా, అంతే పరిమాణంలో ఉప్పు వేసి, గోరువెచ్చని నీరు పోయాలి. ఈ మిశ్రమంలో నల్లబడిన వెండి వస్తువులను వేసి, అవి అల్యూమినియం ఫాయిల్‌కు తగిలేలా 10 నిమిషాలు ఉంచాలి. తర్వాత వాటిని తీసి మెత్తగా రుద్ది, శుభ్రమైన నీటితో కడిగి తుడిస్తే నగలు వెంటనే కొత్తవాటిలా మెరుస్తాయి.

వైట్ టూత్‌పేస్ట్‌తో శుభ్రం చేయడం

మన ఇంట్లో వాడే సాధారణ తెల్లటి టూత్‌పేస్ట్ ఉపయోగించి కూడా వెండి మరకలను తొలగించవచ్చు. ఇందుకోసం పేస్ట్‌ తీసుకొని దానిని నగలపై రాసి, పాత మెత్తటి టూత్ బ్రష్‌తో నెమ్మదిగా రుద్దాలి. ఆపై గోరువెచ్చని నీటితో కడిగి, మైక్రోఫైబర్ గుడ్డతో క్లీన్‌గా తుడవాలి. అంతే క్షణాల్లో వెండి ఆభరణాలు కొత్తవాటిలా మారిపోతాయి.

వినెగర్, బేకింగ్ సోడా మిశ్రమం

వినెగర్, బేకింగ్ సోడా అద్భుతమైన సహజ క్లీనర్లుగా పనిచేస్తాయి. వీటితో వెండి ఆభరణాలను శుభ్రం చేసేందుకు ఒక కప్పు వినెగర్‌లో ఒక చెంచా బేకింగ్ సోడా కలిపి, ఆ నురుగు వచ్చే మిశ్రమంలో వెండి వస్తువులను కొద్దిసేపు నానబెట్టాలి. తర్వాత బ్రష్‌తో నెమ్మదిగా రుద్ది కడిగేయాలి.. తర్వాత ఒక క్లాత్‌తో తుడిస్తే.. క్షణాల్లో అవి మెరిసిపోతాయి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి,

Follow Us