
పిల్లల నుంచి పెద్దల వరకు అరటిపండ్లు ఇష్టం తింటారు. ఇవి రుచికే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. అయితే ప్రస్తుతం మార్కెట్లో కొందరు వ్యాపారులు లాభాల కోసం రసాయనాలతో పండించిన అరటిపండ్లు అమ్ముతున్నారు. ఇది ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. కాబట్టి మార్కెట్లో కొనుగోలు చేసతే అరటిపండ్లు ఏవి రసాయనాలతో పండించాలరో? ఏవి సహజంగా పండినవో ఈ చిన్న ట్రిక్‌తో తెలుసుకుందాం..
రసాయనికంగా పండించిన అరటిపండు కాండం ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. కానీ అరటిపండు మాత్రం పూర్తిగా పసుపు రంగులో కనిపిస్తుంది. అయితే, సహజంగా పండిన అరటిపండు కాండం, అరటి పండు రెండూ క్రమంగా పసుపు లేదా నల్ల రుంగులోకి మారుతాయి.
రసాయనికంగా పండించిన అరటిపండ్లు నిమ్మకాయ లాంటి పసుపు రంగులో ప్రకాశవంతంగా, చూడటానికి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. అయితే సహజంగా పండిన అరటిపండ్లు లేత పసుపు రంగులో ఉంటాయి.
అరటిపండ్లు సహజంగా పండినప్పుడు వాటిలో సహజమైన నల్ల మచ్చలు ఏర్పడతాయి. రసాయనికంగా పండిన అరటిపండ్లలో అలాంటి మచ్చలు ఉండవు. అవి పూర్తిగా శుభ్రంగా, నిండు పసుపు రంగులో కనిపిస్తాయి.
రసాయనికంగా పండించిన అరటిపండ్లు తక్కువ తీపి రుచిని కలిగి ఉంటాయి. కొన్నిసార్లు కొద్దిగా ఆస్ట్రిజెంట్ లేదా చేదు రుచిని కూడా కలిగి ఉంటాయి. సహజ అరటిపండ్లు చాలా తీపిగా, జ్యుసిగా రుచిగా ఉంటాయి.
ఒక బకెట్ నీటిని తీసుకొని అందులో అరటిపండ్లు వేయండి. అరటిపండ్లు నీటిపై తేలుతూ ఉంటే అవి సహజంగా పండినవి. అరటిపండ్లు నీటి అడుగున మునిగిపోతే, అవి రసాయనికంగా పండినవిగా అర్ధం చేసుకోవాలి. ఎందుకంటే రసాయనాలు అరటిపండ్ల బరువును పెంచుతాయి.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.