
గతంలో అందరూ నేలపై కూర్చుని తినేవారు. ఇప్పుడు ఆ అలవాటు పోయింది. కానీ, నేలపై కూర్చుని తినడం వల్ల మన ఆరోగ్యానికి చాలా లాభాలు ఉన్నాయి. ఇది కేవలం పాత ఆచారం కాదు, సైన్స్ కూడా ఒప్పుకున్న పద్ధతి. కాలు మడుచుకుని కూర్చుని తిన్నప్పుడు, మీ శరీరం సహజంగా వంగుతుంది. యోగాలోని ఈ భంగిమ జీర్ణవ్యవస్థను యాక్టివేట్ చేస్తుంది. దీనివల్ల జీర్ణక్రియ సులభమవుతుంది. కూర్చోని నెమ్మదిగా తినడం వల్ల కడుపు నిండినట్లు మెదడుకు తొందరగా తెలుస్తుంది. దీనివల్ల ఎక్కువ తినకుండా ఉంటారు. బరువు తగ్గడానికి ఇది హెల్ప్ చేస్తుంది. ఈ భంగిమలో కూర్చుంటే కండరాలు సాగి, రక్తం బాగా ప్రవహిస్తుంది. అంతేకాకుండా దీర్ఘకాలంలో మధుమేహం, రక్తపోటు వంటి వ్యాధుల నుండి ఉపశమనం పొందడానికి కూడా ఇది సహాయపడుతుంది.
మంచంపై కూర్చుని తినడం చాలా మందికి అలవాటు. కానీ ఇది చెడ్డ అలవాటు. మంచంపై సరిగ్గా కూర్చోలేరు. దీనివల్ల ఆహారాన్ని సరిగ్గా నమలడం, మింగడం కష్టమవుతుంది. త్వరగా గ్యాస్, అజీర్ణం వస్తాయి. క్రమం తప్పకుండా మంచంపై తింటే జీర్ణవ్యవస్థ బలహీనపడుతుంది. ఊబకాయం పెరుగుతుంది. నిద్రపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుంది. అంతేకాకుండా మంచంపై వంగి తినడం వల్ల నడుముపై ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల వెన్నునొప్పి, కీళ్ల సమస్యలు రావచ్చు. అంతేకాకుండా ఆహార కణాలు మంచంపై పడి.. బ్యాక్టీరియా పెరగడానికి, పరిశుభ్రత సమస్యలకు దారితీస్తాయి.
ఉదయం నిద్రలేచిన వెంటనే ఖాళీ కడుపుతో సరైన ఆహారం తీసుకుంటే రోజంతా శక్తివంతంగా ఉండవచ్చు.
డ్రింక్స్: మొదట గోరువెచ్చని నీరు లేదా నిమ్మకాయ నీరు త్రాగడం ఉత్తమం.
నానబెట్టినవి: నానబెట్టిన బాదం, ఎండుద్రాక్ష, వాల్‌నట్ లేదా అంజూర పండ్లను తినడం చాలా మంచిది.
పండ్లు: ఆరోగ్యకరమైన చర్మం, జీర్ణక్రియ కోసం బొప్పాయి లేదా ఆపిల్ తినవచ్చు.
పాలు: వేడి పాలు లేదా పసుపు పాలు తాగడం వల్ల శరీరం శుభ్రపడుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించాలని సూచిస్తున్నాము.)
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..