
కార్పొరేట్ జీవితం అంటే టార్గెట్స్, డెడ్‌లైన్స్, బ్యాక్-టు-బ్యాక్ మీటింగ్స్, ఎప్పుడూ ఆన్ అయి ఉండే ఫోన్ నోటిఫికేషన్స్ – ఇవన్నీ కలిపి ఒత్తిడిని సృష్టిస్తాయి. ఉదయం 7 గంటలకే మెయిల్స్ చెక్ చేయడం మొదలై, రాత్రి 11–12 గంటల వరకు ల్యాప్‌టాప్ మూసేయడం రోజువారీ రొటీన్‌గా మారిపోతుంది.
ఈ ఒత్తిడి శరీరంలో కార్టిసాల్ హార్మోన్ లెవెల్స్‌ను పెంచి, ఆందోళన, చిరాకు, ఏకాగ్రత లోపం, హై బీపీ, డయాబెటిస్ రిస్క్‌లను పెంచుతుంది. వ్యక్తిగత జీవితం మీద ఈ ఒత్తిడి ప్రభావం మరీ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి కారణాలతో వివాహబంధానికి స్వస్తి చెప్పి విడాకులు తీసుకున్న కథలెన్నో ఉన్నాయి. అయితే ఈ ఒత్తిడి ఒక పద్ధతిలో మేనేజ్ చేసి తమ వివాహబంధాన్ని పదిలం చేసుకున్నారు ముంబైకి చెందిన ఒక జంట.
ముంబైలోని బిజీ కార్పొరేట్ జీవితం, హై-ప్రొఫైల్ జాబ్స్, అంతర్జాతీయ బిజినెస్ ట్రిప్స్, సబర్బ్‌లోని లగ్జరీ ఫ్లాట్ – ఇదంతా ఒక పర్ఫెక్ట్ మ్యారేజ్ లైఫ్ లాగా కనిపిస్తుంది. కానీ దాని వెనకాల ఉండే సమస్యలు ఎవరికీ అర్థం కావు. లవ్ లాంగ్వేజ్ మాదిరిగానే స్ట్రెస్ లాంగ్వేజ్ కూడా ఉంటుంది. ఒక్కొక్కరు తమ ఒత్తిడిని ఒక్కోరూపంలో చూపిస్తారు. కొందరు ఒత్తిడి కారణంగా బంధాన్ని, జీవితాన్ని కూడా కోల్పోతున్నారు.
అలాంటి పరిస్థితులను ఎదుర్కొని తమ బంధాన్ని పదిలం చేసుకున్నారు ముంబైకి చెందిన కార్పొరెట్ కపుల్ అదితి, కరణ్. ఇద్దరూ కార్పొరెట్ ఉద్యోగులే. ఇద్దరి స్ట్రెస్ లాంగ్వేజ్‌లు వేరు. అదితి మాటల్లో ఆగ్రహాన్ని బయటపెడుతూ, మద్దతు కోరుకుంటుంది. కానీ కారణ్ అనలిటికల్ మైండ్‌తో, ఒంటరిగా టైమ్ తీసుకుని ప్రాసెస్ చేస్తాడు. ఫలితం? అదితి తను చెప్పింది కరణ్ వినడం లేదు అని ఫీల్ అవుతుంది, కరణ్ ఇంకా ఒత్తిడి అని భావించాడు.
సాయంత్రాలు సైలెంట్‌గా మారాయి, చిన్న చిన్న ఫైట్స్ పెద్ద గ్యాప్‌గా మారాయి. ఒక ఫ్రైడే, అదితి ఆఫీస్ రివ్యూలో షాక్ అయి ఇంటికి వచ్చింది. కరణ్ సపోర్ట్ ఇవ్వకపోవడంతో రెండు రోజులు మౌనం. సండే వరకు అదితి తన అమ్మ వద్దే ఉండిపోయింది. తమ వివాహబంధం బలంగా లేదని, విడాకులు తీసుకోవడమే మేలనే నిర్ణయానికి వచ్చింది.
కానీ, ఫ్రెండ్ సలహాతో కపుల్స్ థెరపీకి వెళ్లారు. థెరపిస్ట్ వారి డిఫరెంట్ స్ట్రెస్ లాంగ్వేజ్ స్టైల్స్‌ను గుర్తించి, ‘మీరు బ్రోకెన్ కాదు, ఒకరి రిథమ్‌ను లెర్న్ చేసుకోవాలి’ అని చెప్పారు. రియాక్ట్ అవ్వకుండా పాజ్ తీసుకోవడం మంచిదని సలహా ఇచ్చారు. ఏ గొడవ జరిగినా, ‘నేను వింటాను, కానీ 30 నిమిషాలు టైమ్ కావాలి. డిన్నర్ తర్వాత మాట్లాడదామా?’ కరణ్ అదితికి నచ్చజెప్పాలి.
అదితి కూడా స్పేస్ ఇచ్చి, జర్నలింగ్ లేదా వాకింగ్‌తో సెల్ఫ్-కేర్‌పై దృష్టి పెట్టాలని సూచించారు థెరపిస్ట్. రోజూ 15 నిమిషాలు వీడియోలు చూడటం, టీ తాగడం, లేదా వాక్ చేయడం వంటి ఒత్తిడి తగ్గించే పనుల వల్ల వర్క్ టాక్ లేకుండా రీకనెక్ట్ అవ్వడానికి సహాయపడుతుంది. వర్క్-లైఫ్ బ్యాలెన్స్ కోసం ఎంపతీ, ఫర్గివ్‌నెస్‌ను ప్రయారిటైజ్ చేశారు. దానివల్ల ఇద్దరూ ఒత్తిడిని జయించి తమ బంధాన్ని పదిలపరుచుకున్నారు.
ఇది అదితి-కరణ్ కథ మాత్రమే కాదు, కార్పొరెట్ వరల్డ్‌లో పనిచేస్తున్న చాలామంది ఉద్యోగులు ఇదే పరిస్థితులను ఎదుర్కొంటున్నారని చాలా అధ్యయనాల్లో తేలింది. ఫోర్బ్స్, మ్యారేజ్.కామ్ చేసిన పరిశోధనల ప్రకారం డ్యూయల్-కెరీర్ కపుల్స్‌లో 74% మంది వర్క్-రిలేషన్ బ్యాలెన్స్‌కు స్ట్రగుల్ అవుతున్నారు. కార్పొరెట్ వరల్డ్‌లో పనిచేసే భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకుని మసులుకోవడం వల్ల బంధం బలపడుతుందని సూచిస్తున్నారు నిపుణులు.