AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అరటిపండ్లు త్వరగా పండిపోతున్నాయా.. ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉండాలంటే ఇలా చేసి చూడండి!

అరటి పండ్లు అన్ని సీజన్లలో అందుబాటులో ఉంటాయి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే వీటిని పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు. అయితే వీటిని నిల్వ ఉంచడం అంత సులువేం కాదు, ఒక్క రోజులోనే పచ్చిగా ఉండి మరుసటి రోజుకి పండిపోతాయి, రెండు రోజులయ్యిదంటే ..

అరటిపండ్లు త్వరగా పండిపోతున్నాయా.. ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉండాలంటే ఇలా చేసి చూడండి!
Banana
Nikhil
|

Updated on: Nov 19, 2025 | 10:44 AM

Share

అరటి పండ్లు అన్ని సీజన్లలో అందుబాటులో ఉంటాయి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే వీటిని పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు. అయితే వీటిని నిల్వ ఉంచడం అంత సులువేం కాదు, ఒక్క రోజులోనే పచ్చిగా ఉండి మరుసటి రోజుకి పండిపోతాయి, రెండు రోజులయ్యిదంటే చాలు నల్ల మచ్చలు పడి, మూడో రోజు పూర్తిగా మెత్తబడిపోతాయి. అరటి పండ్లు త్వరగా పండిపోవడానికి కారణం అవి విడుదల చేసే ఎథిలీన్ అనే గ్యాస్. ఈ గ్యాస్‌ను కంట్రోల్ చేస్తే అరటిపండ్లను 10–15 రోజుల వరకు ఫ్రెష్‌గా ఉంచవచ్చు. చిన్నచిన్న జాగ్రత్తలతో అరటిపండ్లను ఎలా తాజాగా ఉంచాలో తెలుసుకుందాం..

ఇలా ట్రై చేయండి..

* ఎథిలీన్ గ్యాస్ ఎక్కువగా కాడ వైపు నుంచే బయటకు వస్తుంది. ఆ భాగాన్ని క్లింగ్ ఫిల్మ్ లేదా ఎడిబుల్​ ప్లాస్టిక్‌తో గట్టిగా చుట్టేయండి. ఇలా చేస్తే 4–6 రోజులు ఫ్రెష్​గా ఉంటాయి.

* ప్లాస్టిక్ ర్యాప్ లేకపోతే అల్యూమినియం ఫాయిల్‌తో కాడను కప్పండి. ఇది గ్యాస్‌ను రిఫ్లెక్ట్ చేసి పండ్లను త్వరగా పండకుండా చూస్తుంది.

* అరటి పండ్లు గుత్తిగా ఉంటే ఒక్కటి పండితే మిగతావన్నీ త్వరగా పండిపోతాయి. అందువల్ల గెల నుంచి ఒక్కొక్కటిగా విడదీసి ఉంచాలి.

* అరటి పండ్లను కాడ కిందికి వచ్చేలా వేలాడదీయాలి. ఇలా చేస్తే మాయిశ్చర్ కాడ వైపు చేరకుండా ఉంటుంది.

* పండ్లను బ్రౌన్ పేపర్ బ్యాగ్‌లో వేసి మూసి ఉంచాలి. ఎథిలిన్​ గ్యాస్ బ్యాగ్‌లోనే ఆగిపోతుంది. త్వరగా పండాలంటే ఆపిల్ లేదా టమాటాను జోడించాలి.

* అరటి పండ్లు కట్ చేసిన తర్వాత త్వరగా నలుపు పట్టకుండా నిమ్మరసం లేదా నారింజ రసం స్ప్రే చేయాలి. సిట్రిక్ యాసిడ్ ఆక్సిడేషన్‌ను ఆపుతుంది.

* కట్​ చేసిన ముక్కలను తేనెలో ముంచి ఫ్రిజ్‌లో పెడితే యాంటీ-ఆక్సిడెంట్స్ బ్రౌనింగ్‌ను ఆలస్యం చేస్తాయి. ఎక్కువ కాలం ఉంచాలంటే తొక్క తీసి, పీసెస్‌గా కట్ చేసి జిప్‌లాక్ బ్యాగ్‌లో వేసి ఫ్రీజర్‌లో పెట్టండి. 2–3 నెలల వరకు ఫ్రెష్‌గా ఉంటాయి. స్మూతీలకు డైరెక్ట్‌గా వాడుకోవచ్చు.

ఈ సింపుల్ హ్యాక్స్‌తో అరటిపండ్లు త్వరగా పాడవకుండా ఫ్రెష్​గా ఉంటాయి. మీరూ ట్రై చేసి చూడండి మరి!

తగ్గేదే లే.. 91 ఏళ్ల వయసులోనూ సర్పంచ్‌ బరిలో.. పోటీకి కారణం ఇదే..
తగ్గేదే లే.. 91 ఏళ్ల వయసులోనూ సర్పంచ్‌ బరిలో.. పోటీకి కారణం ఇదే..
35 ఏళ్ల తర్వాత రీఎంట్రీ..ఒకప్పటి ఈ టాలీవుడ్ హీరోను గుర్తుపట్టారా?
35 ఏళ్ల తర్వాత రీఎంట్రీ..ఒకప్పటి ఈ టాలీవుడ్ హీరోను గుర్తుపట్టారా?
16 ఏళ్ల తర్వాత కోహ్లీ-రోహిత్ రీఎంట్రీ.. ఎప్పుడు ఆడతారంటే..?
16 ఏళ్ల తర్వాత కోహ్లీ-రోహిత్ రీఎంట్రీ.. ఎప్పుడు ఆడతారంటే..?
జామపండు మీ హెల్త్ గేమ్ ఛేంజర్.. రోజు ఒకటి తినడం వల్ల ఎన్ని లాభాలో
జామపండు మీ హెల్త్ గేమ్ ఛేంజర్.. రోజు ఒకటి తినడం వల్ల ఎన్ని లాభాలో
రామ్ చరణ్ పెద్ది సినిమాలో ఛాన్స్ వస్తే నో చెప్పా
రామ్ చరణ్ పెద్ది సినిమాలో ఛాన్స్ వస్తే నో చెప్పా
మనదేశంలో ఇప్పటివరకు రైలు కూత వినని రాష్ట్రం..! అది ఏ రాష్ట్రమంటే
మనదేశంలో ఇప్పటివరకు రైలు కూత వినని రాష్ట్రం..! అది ఏ రాష్ట్రమంటే
భారత రాష్ట్రపతి vs రష్యా అధ్యక్షుడు.. ఎవరి ఆదాయం ఎంత?
భారత రాష్ట్రపతి vs రష్యా అధ్యక్షుడు.. ఎవరి ఆదాయం ఎంత?
సెంచరీ హాట్రిక్ మిస్సయిందన్న అర్ష్‌దీప్‌ను ఆడుకున్న విరాట్
సెంచరీ హాట్రిక్ మిస్సయిందన్న అర్ష్‌దీప్‌ను ఆడుకున్న విరాట్
నిమ్మకాయ తొక్కలను తీసిపారేయకండి.. అవి చేసే అద్భుతాలు తెలిస్తే..
నిమ్మకాయ తొక్కలను తీసిపారేయకండి.. అవి చేసే అద్భుతాలు తెలిస్తే..
ఈ వారంలో నాలుగు రోజులు బ్యాంకులు బంద్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఈ వారంలో నాలుగు రోజులు బ్యాంకులు బంద్‌.. ఏయే రోజుల్లో అంటే..