
తెల్ల జుట్టు సమస్యతో ఇబ్బంది పడుతున్నవారికి దానిమ్మ తొక్కలతో సహజమైన హెయిర్ డై తయారు చేసుకోవచ్చు. ఇది మీ జుట్టుకు అందమైన రంగును ఇవ్వడమే కాకుండా వెంట్రుకలు బలంగా, ఆరోగ్యంగా ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. దానిమ్మ తొక్కలో యాంటీఆక్సిడెంట్లు, టానిన్లు ఉంటాయి. ఇవి జుట్టును బలోపేతం చేస్తాయి. వాటికి సహజమైన నలుపు రంగును ఇస్తాయి. దీన్ని తయారు చేయడానికి, తలకు అప్లై చేయడానికి సరైన పద్ధతిని ఇక్కడ తెలుసుకుందాం..
దానిమ్మ తొక్కలతో హెయిర్ డై తయారు చేయడానికి కావాల్సినవి ముందుగా ఒక కప్పు ఎండిన దానిమ్మ తొక్కలు, 2 కప్పుల నీరు, 1 టీస్పూన్ టీ ఆకులు, 1 టీస్పూన్ ఆమ్లా పౌడర్, 1 టీస్పూన్ కాఫీ పౌడర్ ముదురు రంగు కోసం తీసుకోవాలి. ముందుగా దానిమ్మ తొక్కలను బాగా ఎండబెట్టి, ఆపై మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ లో రెండు కప్పుల నీళ్లు పోసి, దానిమ్మ తొక్కలు రుబ్బి మరిగించాలి. నీరు మరిగేటప్పుడు, దానికి టీ ఆకులు, కాఫీ పొడి వేయండి. నీరు సగానికి తగ్గే వరకు తక్కువ మంట మీద ఉడికించాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఫిల్టర్ చేసి చల్లబరచండి.
జుట్టు కు ఎలా అప్లై చేయాలి:
ముందుగా మీ జుట్టును బాగా కడిగి ఆరనివ్వండి. తయారుచేసిన దానిమ్మ తొక్క మిశ్రమాన్ని జుట్టు మూలాల నుంచి చివర్ల వరకు పొడవునా పూర్తిగా అప్లై చేయండి. హెయిర్ ప్యాక్ పూర్తిగా అప్లై చేసిన తరువాత 1 నుంచి 2 గంటలు అలాగే ఉంచండి. దీని తరువాత, గోరువెచ్చని నీటితో జుట్టును కడిగి, సహజ షాంపూ వాడండి.
దానిమ్మ తొక్కతో జుట్టు రంగు వేయడం వల్ల కలిగే ప్రయోజనాలు:
ఇది మీ జుట్టుకు సహజ రంగును ఇస్తుంది. ఇది ఎటువంటి హానికరమైన రసాయనాలు లేకుండా జుట్టుకు అందమైన ముదురు నలుపు రంగును ఇస్తుంది. జుట్టును బలపరుస్తుంది. దానిమ్మ తొక్కలలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, టానిన్లు జుట్టును వేళ్ళ నుండి బలపరుస్తాయి. చుండ్రును వదిలిస్తుంది. దానిమ్మ తొక్కలు యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి తల చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. చుండ్రును తగ్గించడంలో సహాయపడతాయి. జుట్టు పెరుగుదలను పెంచుతుంది. ఇది జుట్టు మూలాలను పోషిస్తుంది. ఇది జుట్టు వేగంగా పెరగడానికి, ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది.
మీరు మీ జుట్టుకు సహజంగా రంగు వేయాలనుకుంటే వారానికి ఒకసారి ఈ రంగును ఉపయోగించండి. క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల త్వరలోనే మీ జుట్టు పూర్తిగా నల్లగా మారి, జుట్టు బలంగా ఉంటుంది.
దానిమ్మ తొక్కలతో తయారు చేసిన ఈ సహజ జుట్టు రంగు, మీ జుట్టుకు ఎటువంటి నష్టం కలిగించకుండా అందమైన రంగు, పోషణను అందిస్తుంది. మీరు రసాయన జుట్టు రంగులను నివారించి ఆరోగ్యకరమైన జుట్టును కాపాడుకోవాలనుకుంటే, ఈ ఇంటి చిట్కాను ట్రై చేయండి. మంచి ఫలితం చూస్తారు.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..