Hair Care Tips: వర్షాకాలంలో చుండ్రు బాగా వేధిస్తోందా? అయితే ఈ సింపుల్‌ టిప్స్‌తో వదిలించుకోండి

|

Jul 17, 2022 | 9:23 PM

Home Remedies Dandruff: చుండ్రు అనేది ఒక సాధారణ సమస్య. చాలా మందిని ఈ సమస్య వెంటాడుతుంటుంది. చుండ్రు వల్ల తలలో విపరీతమైన దురదతో పాటు ఒక్కోసారి హెయిర్‌ ఫాల్‌ కూడా అవుతుంది. కాగా చుండ్రును వదిలించుకోవడానికి చాలామంది మార్కెట్లో దొరికే వివిధ రకాల సౌందర్య ఉత్పత్తులను..

Hair Care Tips: వర్షాకాలంలో చుండ్రు బాగా వేధిస్తోందా? అయితే ఈ సింపుల్‌ టిప్స్‌తో వదిలించుకోండి
Hair Care Tips
Follow us on

Home Remedies Dandruff: చుండ్రు అనేది ఒక సాధారణ సమస్య. చాలా మందిని ఈ సమస్య వెంటాడుతుంటుంది. చుండ్రు వల్ల తలలో విపరీతమైన దురదతో పాటు ఒక్కోసారి హెయిర్‌ ఫాల్‌ కూడా అవుతుంది. కాగా చుండ్రును వదిలించుకోవడానికి చాలామంది మార్కెట్లో దొరికే వివిధ రకాల సౌందర్య ఉత్పత్తులను వినియోగిస్తుంటారు. అయితే దీర్ఘ కాలంలో ఈ ప్రోడక్ట్స్‌ జుట్టుకు హాని చేస్తాయి. ఫలితంగా జుట్టు రాలడం ప్రారంభమవుతుంది. అంతే కాకుండా చుండ్రు సమస్య కూడా బాగా పెరుగుతుంది. అందుకే మార్కెట్‌ ప్రొడక్ట్స్‌కు బదులు కొన్ని ఇంటి చిట్కాలను ప్రయత్నిస్తే సరిపోతుంది. ఇవి మీ జుట్టుకు పోషణ అందించడమే కాకుండా ఆరోగ్యంగానూ ఉంచుతాయి.

అలోవెరా జెల్

జుట్టు ఆరోగ్యంగా ఉండేందుకు మీరు అలోవెరా జెల్‌ని ఉపయోగించవచ్చు. అలోవెరా జుట్టుకు చల్లదనాన్ని ఇస్తుంది. ఇందులో యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది శిరోజాలను ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది. జుట్టు కోసం అలోవెరా జెల్‌ను ఉపయోగించవచ్చు. జెల్‌ను రాసుకున్న కొద్దిసేపటి తర్వాత గాఢత తక్కువున్న షాంపుతో తలస్నానం చేయాలి.

ఇవి కూడా చదవండి

పెరుగు

చుండ్రును తొలగించడంలో పెరుగు సమర్థంగా పనిచేస్తుంది. ఈ హోం రెమెడీ చాలా ఎఫెక్టివ్. పెరుగును తలకు పట్టించి అరగంట పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత తేలికపాటి షాంపూతో జుట్టును కడగాలి. ఇది జుట్టును మృదువుగా చేయడంతో పాటు చుండ్రును తొలగిస్తుంది.

వెనిగర్

వెనిగర్‌లో ఔషధ గుణాలున్నాయి. ఇవి చుండ్రును వదిలించడంలో బాగా సహాయపడతాయి. స్నానం చేసే నీటిలో కొద్దిగా వెనిగర్ ను జోడించడం వల్ల జుట్టు సమస్యలను తగ్గించుకోవచ్చు. కొన్ని వారాల పాటు ఈ టిప్‌ పాటిస్తే చుండ్రు తొలగిపోతుంది.

గ్రీన్ టీ

గ్రీన్ టీలో యాంటీ ఫంగల్ గుణాలతో పాటు యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శిరోజాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతాయి. అదేవిధంగా చుండ్రును కూడా తొలగిస్తాయి. ఇక గ్రీన్ టీతో జుట్టును కడగడం ద్వారా చుండ్రు సమస్యలను దూరం చేస్తాయి. గ్రీన్ టీలో ఉండే యాంటీ ఫంగల్ గుణాలు తలపై పేరుకున్న చుండ్రును తొలగిస్తాయి. అదేవిధంగా జుట్టు పొడిబారడం వంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తాయి.

వేప

జుట్టు ఆరోగ్యంగా ఉండేందుకు వేప బాగా పనిచేస్తుంది. ఇది చుండ్రు సమస్యలను దూరం చేస్తుంది. వేపలో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి. ఇందుకోసం కొన్ని వేప ఆకులను రాత్రంతా నీటిలో ఉంచండి. ఉదయాన్నే ఈ నీటితో మీ జుట్టును శుభ్రం చేసుకోవాలి. ఇది చుండ్రుతో పాటు దాని వల్ల కలిగే దురద నుంచి ఉపశమనం కలిగిస్తాయి.

నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..