
కొలెస్ట్రాల్ సమస్యలు గుండె సంబంధిత వ్యాధులకు దారి తీసినప్పటికీ దీని లక్షణాలు తరచుగా కాళ్ళలో ఎక్కువగా కనిపిస్తాయి. ఈ విషయం చాలా మందికి తెలియదు. అందుకే వీటిని లైట్ తీసుకుంటారు. ఈ లక్షణాలు ఎక్కువగా మనం నడిచేటప్పుడు కనిపిస్తాయి. మన శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్ల కాళ్ళలోని సిరలు కుంచించుకుపోతాయి. దీంతో రక్త సరఫరా తగ్గుతుంది. ఇది కాళ్ళలో వివిధ సమస్యలకు దారితీస్తుంది. ఇలాంటి లక్షణాలు మీకు కనిపిస్తే మీరు వెంటనే అప్రమత్తం అవ్వాల్సి ఉంటుంది.
శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుదలను సూచించే ఐదు లక్షణాలు ఇవే.
నడిచేటప్పుడు నొప్పి: మీరు నడుస్తున్నప్పుడు మీ కాళ్ళు, తొడలు లేదా తుంటి భాగంలో తరచుగా నొప్పి లేదా తిమ్మిరిని అనిపించినా.. మీరు ఆగినప్పుడు అది మీకు హాయిగా అనిపించినా. అది మీ శరీరంలో రక్త ప్రసరణ సరిగా జరగట్లేదనే దానికి సంకేతం కావచ్చు. అంటే మీ శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్ల మీ కాళ్ళలోని సిరలు (ధమనులు) ఇరుకుగా మారి, కండరాలకు సరైన రక్త ప్రసరణను జరగదు.
కాళ్ళు త్వరగా అలసిపోవడం: మీ శరీరంలోని మిగిలిన భాగాలు బాగానే ఉన్నప్పటికీ, మీ కాళ్ళు మాత్రమే త్వరగా అలసిపోతే, అది కూడా రక్త ప్రసరణ సరిగా లేకపోవడానికి సంకేతం కావచ్చు. మీ సిరల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్ల మీ కండరాలు శక్తిని కోల్పోతాయి, మెట్లు ఎక్కడం లేదా ఎక్కువ దూరం నడిచినప్పుడు మీరు ఇంతకు ముందు కన్నా.. ఎక్కవ కష్టాన్ని అనుభవించవచ్చు.
ఒక పాదం మరొక పాదం కంటే చల్లగా మారడం: ముఖ్యంగా నడిచిన తర్వాత ఒక కాలు మరొక కాలు కంటే పదే పదే చల్లగా అనిపిస్తే, దాని అర్థం పాదానికి రక్త సరఫరా సరిగ్గా జరగట్లేదని అర్థం. రక్తం శరీరానికి వెచ్చదనాన్ని అందిస్తుంది, కాబట్టి రక్త ప్రవాహం తగ్గడం వల్ల పాదంలో చల్లదనం కనిపిస్తుంది. కొన్నిసార్లు, చర్మం పాలిపోయినట్లు లేదా నీలం రంగులో కూడా కనిపించవచ్చు.
పాదాలు లేదా వేళ్లలో తిమ్మిర్లు: మీ పాదాలలో తరచుగా జలదరింపు, తిమ్మిరి లేదా మంట అనిపిస్తే, అది రక్త ప్రసరణ సరిగా లేకపోవడం వల్ల కూడా కావచ్చు. నరాలకు ఆక్సిజన్ లేకపోవడం వల్ల వాటి పనితీరు దెబ్బతింటుంది. ఇది చాలా కాలం పాటు కొనసాగితే, మీ పాదాలపై గాయాలు కూడా త్వరగా నయం కాకపోవచ్చు.
నడిచిన తర్వాత పాదాల రంగు మార్పు:నడుస్తున్నప్పుడు మీ పాదాల చర్మం పాలిపోయినట్లు, మచ్చలుగా లేదా కొద్దిగా నీలం రంగులోకి మారితే, అది రక్త ప్రసరణ సరిగా లేకపోవడానికి సంకేతం. తీవ్రమైన సందర్భాల్లో, చర్మం మెరుస్తూ కనిపించవచ్చు, జుట్టు తక్కువగా పెరగవచ్చు లేదా గాయాలు నెమ్మదిగా నయం కావచ్చు.
మరిన్ని లైఫ్‌స్లైట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.