చికెన్, మటన్ తింటే బీపీ పెరుగుతుందా..? నాన్‌వెజ్ తినేవాళ్లు ఇవి తప్పక తెలుసుకోవాలి..

మీరు బీపీకి మందులు వాడుతున్నారా? అయినప్పటికీ మీ రక్తపోటు అదుపులోకి రావడం లేదా? అయితే మీరు తినే ఆహారంలోనే ఏదో సైలెంట్ కిల్లర్ దాగి ఉన్నాడని అర్థం. కేవలం మందులు వేసుకుంటే సరిపోదు, మన వంటింట్లో మనం రోజూ వాడే 4 రకాల పదార్థాలు బీపీని ప్రాణాంతక స్థాయికి తీసుకెళ్తున్నాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ ప్రమాదకరమైన ఆహార పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

చికెన్, మటన్ తింటే బీపీ పెరుగుతుందా..? నాన్‌వెజ్ తినేవాళ్లు ఇవి తప్పక తెలుసుకోవాలి..
Foods To Avoid For Hypertension

Updated on: May 15, 2026 | 12:40 PM

ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో వయస్సుతో సంబంధం లేకుండా వేధిస్తున్న అతిపెద్ద సమస్య హై బీపీ. దీనిని వైద్య పరిభాషలో సైలెంట్ కిల్లర్ అని పిలుస్తారు. ఎందుకంటే ఇది శరీరంలో ఉన్నా కూడా ఎటువంటి లక్షణాలు వెంటనే బయటపడవు. కానీ లోలోపలే గుండెపోటు, కిడ్నీ ఫెయిల్యూర్, పక్షవాతం వంటి ప్రాణాంతక సమస్యలకు దారితీస్తుంది. బ్రిటిష్ హార్ట్ ఫౌండేషన్ నివేదిక ప్రకారం.. బీపీ ఉన్నవారు ప్రాణాపాయం నుంచి తప్పించుకోవాలంటే 4 రకాల ఆహార పదార్థాలకు వెంటనే స్వస్తి చెప్పాలి.

ఉప్పు: బీపీకి ప్రధాన శత్రువు

రక్తపోటు పెరగడానికి ప్రధాన కారణం మనం తీసుకునే ఉప్పు. ఆహారంలో ఉప్పు ఎక్కువైతే రక్తనాళాలలో నీరు పేరుకుపోయి ఒత్తిడి పెరుగుతుంది. ఇది గుండెపై అదనపు భారాన్ని మోపుతుంది. వంటల్లో ఉప్పు తగ్గించండి. భోజనం చేసేటప్పుడు పక్కన విడిగా ఉప్పు వేసుకోవడం తక్షణం మానేయండి. రుచి కోసం నిమ్మరసం, సహజమైన మసాలాలు వాడండి.

ప్రాసెస్ చేసిన మాంసం

సాసేజ్‌లు, హాట్ డాగ్‌లు, బేకన్ వంటి నిల్వ ఉంచిన మాంస పదార్థాలు బీపీ రోగులకు విషంతో సమానం. ఇవి పాడవకుండా ఉండటానికి విపరీతమైన ఉప్పు, రసాయనాలను వాడతారు. వీటికి బదులుగా తాజా మాంసం, చేపలు, గుడ్లను పరిమితంగా తీసుకోవడం అలవాటు చేసుకోండి.

సాస్‌లు – ఊరగాయలు

మన తెలుగింటి వంటల్లో ఊరగాయలకు విడదీయలేని సంబంధం ఉంది. కానీ, బీపీ ఉన్నవారికి ఇవి అత్యంత ప్రమాదకరం. టొమాటో కెచప్, సోయా సాస్, నిల్వ పచ్చళ్లలో సోడియం పాళ్లు చాలా ఎక్కువగా ఉంటాయి. ఒక చిన్న స్పూన్ ఊరగాయలో మీరు రోజంతా తీసుకోవాల్సిన ఉప్పు కంటే రెట్టింపు ఉంటుంది.

బేకరీ – ఫాస్ట్ ఫుడ్

పిజ్జాలు, బర్గర్లు, కేకులు, బిస్కెట్లలో కేవలం ఉప్పు మాత్రమే కాదు, అనారోగ్యకరమైన కొవ్వులు, చక్కెరలు కూడా ఎక్కువే. ఇవి బరువు పెరగడానికి కారణమవుతాయి. పెరిగిన బరువు రక్తపోటును ప్రమాదకర స్థాయికి తీసుకెళ్తుంది. సోడా వంటి శీతల పానీయాలను కూడా పూర్తిగా పక్కన పెట్టాలి.

మనం తీసుకునే ఆహారమే మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. మందులు వాడుతున్నప్పటికీ ఆహార నియమాలు పాటించకపోతే ఎటువంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి పైన చెప్పిన వాటికి దూరంగా ఉంటూ.. తాజా పండ్లు, కూరగాయలు మరియు ఇంట్లో వండిన పోషకాహారాన్ని తీసుకోవడం ద్వారా మీ గుండెను భద్రంగా కాపాడుకోండి.

Follow Us