Lifestyle: బీపీతో గుండె ఒక్కటే కాదు.. ఇవి కూడా ప్రమాదంలో పడ్డట్లే..

ఒకప్పుడు 50 ఏళ్లు దాటిన వారిలో మాత్రమే కనిపించే ఈ సమస్య ఇప్పుడు 30 ఏళ్ల వారిని వేధిస్తుంది. ఓ అంచనా ప్రకారం ప్రస్తుతం భారత్‌లో ఏకంగా 3 కోట్ల మంది అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం భారతదేశంలో ప్రతీ నలుగురిలో ఒకరు బీపీకి గురయ్యే అవకాశం ఉందని తేలింది. ఇక బీపీ ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు కారణమవుతుతుందని...

Lifestyle: బీపీతో గుండె ఒక్కటే కాదు.. ఇవి కూడా ప్రమాదంలో పడ్డట్లే..
సిస్టోలిక్ పీడనం, ఒత్తిడిని కొలిచేటప్పుడు వినిపించే శబ్దం మధ్య చాలా సార్లు గ్యాప్ ఏర్పడుతుంది. దీనిని ఆస్కల్టేటరీ గ్యాప్ అంటారు. దీనిని నివారించడానికి మొదట పప్పెటరీ పద్ధతిని ఉపయోగించి సిస్టోలిక్ ఒత్తిడిని తనిఖీ చేయాలి. ధరించిన బట్టలపై బ్లడ్ ప్రెషర్ కఫ్ కట్టకపోవడమే మంచిది. ఇది 5-5mmHg యూనిట్ల ఒత్తిడిని పెంచుతుంది. కాబట్టి బట్టలు తొలగించి చర్మంపై కఫ్ కట్టుకోవడం వల్ల బీపీ ఎల్లప్పుడూ ఖచ్చితంగా కనిపిస్తుంది. రెండు రకాల రక్తపోటు కఫ్‌లు అందుబాటులో ఉంటాయి. ఒకటి మణికట్టుకు కట్టడానికి, మరొకటి చేతికి కట్టడానికి.

Updated on: Jul 07, 2024 | 3:26 PM

అధిక రక్తపోటు బారిన పడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ క్రమంగా పెరుగుతోంది. మారుతోన్న జీవన విధానం, తీసుకుంటున్న ఆహార మార్పులో కారణంగా బీపీ చాలా మందిలో సర్వ సాధారణంగా మారిపోయింది. ముఖ్యంగా ఒత్తిడితో కూడుకున్న జీవితం, రాత్రుళ్లు షిఫ్ట్స్‌లో పనిచేయడం కారణంగా యువత కూడా ఈ సమస్య బారిన పడుతున్నారు.

ఒకప్పుడు 50 ఏళ్లు దాటిన వారిలో మాత్రమే కనిపించే ఈ సమస్య ఇప్పుడు 30 ఏళ్ల వారిని వేధిస్తుంది. ఓ అంచనా ప్రకారం ప్రస్తుతం భారత్‌లో ఏకంగా 3 కోట్ల మంది అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం భారతదేశంలో ప్రతీ నలుగురిలో ఒకరు బీపీకి గురయ్యే అవకాశం ఉందని తేలింది. ఇక బీపీ ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు కారణమవుతుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బీపీ పెరగ్గానే మనం గుండె సంబంధిత సమస్యలు మాత్రమే వస్తాయని భావిస్తుంటాం. అయితే అధిక రక్తపోటు శరీరంలో మరెన్నో అవయవాలపై ప్రతికూల ప్రభావం చూపుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ బీపీ ప్రభావం చూపే ఆ అవయవాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* శరీరంలో రక్తపోటు పెరగడం వల్ల మెదడు కణాలపై తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. రక్తపోటు మెదడు కణాలను దెబ్బతీస్తుందని అంటున్నారు. మెదడులో ఒక్కసారిగా రక్తం వేగం పెరగడం వల్ల కణాలు పగిలిపోయే ప్రమాదం ఉంటుంది. ఇది మరణానికి కూడా దారి తీయొచ్చని హెచ్చరిస్తున్నారు.

* అప్పటికే షుగర్‌ సమస్యతో బాధపడుతున్న వారికి బీపీ కూడా ఉంటే మరీ ప్రమాదమని నిపుణులు చెబుతున్నారు. డయాబెటిస్‌ రోగులకు అధిక రక్తపోటు ఉంటే కళ్ల నరాలు దెబ్బతినే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. సాధారణంగా మధుమేహ వ్యాధిగ్రస్తులకు రోగనిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది. డయాబెటిస్ రోగుల కళ్లలోని సిరలు పగిలిపోయే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

* అధిక రక్తపోటు కారణంగా కిడ్నీ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే వైద్యుల నిపుణు అభిప్రాయం ప్రకారం అధిక రక్తపోటు ఉన్న వారికి స్ట్రోక్‌ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చాలా సందర్భాల్లో ఇది ప్రాణాంతకం కావొచ్చని నిపుణులు చెబుతున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి…