Hibiscus Health benefits: మందార పువ్వులో మీకు తెలియని ఆరోగ్య రహాస్యాలు..! అన్నీ ఇన్నీ కాదు..

|

Feb 11, 2023 | 7:16 PM

మందార ఆకులు, పువ్వులు సహజ వర్ణద్రవ్యం. యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు ఉంటాయి. మందార ఆకులను, పువ్వులను వారానికి రెండు సార్లు జుట్టుకు పట్టించడం వల్ల జుట్టు పెరుగుదలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది.

Hibiscus Health benefits: మందార పువ్వులో మీకు తెలియని ఆరోగ్య రహాస్యాలు..! అన్నీ ఇన్నీ కాదు..
Hibiscus
Follow us on

మందార పువ్వు పూజకు మాత్రమే కాకుండా అందం, ఆరోగ్యం విషయంలో కూడా ఎంతో మేలు చేస్తుంది. మందార పువ్వు చర్మం, జుట్టుతో సహా అనేక ఆరోగ్య సంబంధిత సమస్యలకు సహాయపడుతుంది. దీనిలోని ఔషధ గుణాలు మధుమేహం, అధిక రక్తపోటు సమస్యలో కూడా ప్రయోజనకరంగా ఉంటాయి. మందారలో కార్బోహైడ్రేట్, కొవ్వు, ప్రోటీన్, విటమిన్ సి, కాల్షియం, ఐరన్ వంటి అనేక పోషకాలు ఉన్నాయి.

హైబిస్కస్ సారం యాంటీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ లక్షణాలను కలిగి ఉందని, రక్తంలో అధిక చక్కెర, ఇన్సులిన్ స్థాయిలను తగ్గిస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. జుట్టు పెరుగుదల మందార ఆకులు, పువ్వులు జుట్టు ఆరోగ్యానికి ప్రయోజనకరమైన లక్షణాలను కలిగి ఉంటాయి. మందార ఆకులు, పువ్వులు సహజ వర్ణద్రవ్యం. యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు ఉంటాయి. మందార ఆకులను, పువ్వులను వారానికి రెండు సార్లు జుట్టుకు పట్టించడం వల్ల జుట్టు పెరుగుదలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది.

మందార మొక్కలో శ్లేష్మ భాగాలు ఎక్కువగా ఉన్నందున పాలీశాకరైడ్‌ల సమూహానికి చెందినవి. దీని ఆకులను చర్మ వ్యాధులకు ఉపయోగిస్తారు. మందార మ్యూకిలేజ్ ఎక్స్‌ట్రాక్ట్‌లో గ్లిజరిన్ ఉంటుంది. ఇది వృద్ధాప్యాన్ని దూరం చేసి చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..