Hibiscus: జుట్టు రాలిపోతుందా? మందారతో ఇలా చెయ్యండి.. అమేజింగ్ రిజల్ట్స్

జుట్టుని ఆరోగ్యంగా ఉంచుకోవాలని, పొడుగ్గా పెంచుకోవాలని చాలా మంది అనుకుంటారు. అందుకోసం బయట కొనే కెమికల్ ప్రొడక్ట్స్‌కి బదులు.. మందార పూలు, ఆకులను కూడా వినియోగించుకోవచ్చు. మందార జుట్టు పెరుగుదలకి హెల్ప్ చేస్తుంది. చుండ్రుని తగ్గిస్తుంది. తెల్లజుట్టుని దూరం చేస్తుంది.

Hibiscus: జుట్టు రాలిపోతుందా? మందారతో ఇలా చెయ్యండి.. అమేజింగ్ రిజల్ట్స్
Hibiscus For Hair Growth

Updated on: Jun 25, 2024 | 4:08 PM

ప్రస్తుతం యూత్ ఫేస్ చేస్తోన్న అతి పెద్ద ప్రాబ్లమ్ హెయిర్ ఫాల్. అమ్మాయిలు, అబ్బాయిలు అని తేడా లేదు. ప్రస్తుతం ఉన్న లైఫ్ స్టైల్, పొల్యూషన్, స్ట్రస్ వంటి కారణాల వల్ల.. విపరీతంగా జుట్టు రాలిపోతుంది. కొందరు రకరకాల ప్రొడక్ట్స్ వాడుతుంటారు. వాటి వల్ల ప్రయోజనం లేకపోగా.. దీర్ఘకాలంలో పలు రకాలు స్కిన్, ఆరోగ్య సమస్యలు వెంటాడే అవకాశం ఉందివ. అయితే హెయిర్ ఫాల్‌ని అదుపు చేయడానికి మందార ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అందమైన పూలును ఇచ్చే మందార చెట్టులో అంత సీన్ ఉందా..? అనుకుంటున్నారేమో.. ఒక్కసారి మీ అమ్మమ్మలు, నాన్నమ్మలను దీని గురించి అడిగితే క్లారిటీ వస్తుంది.

మందార  పువ్వులు, ఆకులతో మీ హెయిర్‌కు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ముఖ్యంగా హెయిర్ ఫాల్‌కు మందార పువ్వులతో చెక్ పెట్టవచ్చు. మందార పూలను.. కాస్త పెరుగులో వేసి పేస్ట్‌లా చేసుకోవాలి. దీనిని తలకు అప్లై చేసి కాస్త మర్దన చేసి.. ఒక అరగంట అలానే ఉంచాలి. ఆపై గోరువెచ్చని నీటితో క్లీన్ చేసుకోవాలి. నెలకు నాలుగు సార్లు ఇలా చేస్తే.. మార్పు మీకే అర్థం అవుతుంది.

మందార ఆకుల పొడి, మెంతుల పొడి, ఉసిరిని కలిపి హెయిర్ ప్యాక్​గా అప్లై చేయవచ్చు. ఇలా చేయడం వల్ల చుండ్రు సమస్యకు చెక్ పెట్టవచ్చు. అలానే.. మందారను పొడిగా చేసుకుని.. దానిని కొబ్బరి నూనెలో మిక్స్ చేసుకోవాలి. దీనిని రెగ్యూలర్​గా తలకు రాస్తూ ఉంటే.. జుట్టు రాలడం తగ్గుతుంది. జుట్టు కూడా చాలా నాణ్యంగా మారుతుంది.  మందార పువ్వులు, ఆకులను పేస్ట్ చేసి.. కుంకుడు కాయలతో పాటు నానబెట్టి.. వాటితో తలస్నానం చేసినా హెయిర్ ఫాల్ తగ్గుతుంది.. గ్రోత్ కూడా బాగుంటుంది. అలానే  అల్లం రసం,  మందార పూల పొడి మెత్తని పేస్ట్‌లా కలుపుకుని.. మీ తలకి అప్లై చేయండి. అలానే అరగంట పాటు ఉంచి క్లీన్ చేయండి. వారానికి రెండు సార్లు ఇది అప్లై చేస్తే..  జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.

(Note: నిపుణులు ప్రకారం ఈ వివరాలను అందించాం. అందం, ఆరోగ్యానికి సంబంధించిన ఏ టిప్స్ ఫాలో అయ్యేముందు అయినా మీరూ సంబంధిత నిపుణులను సంప్రదించండి)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..