Constipation: మలబద్ధకాన్ని ఇలా సులభంగా పరిష్కరించుకోండి.. వెంటనే రిలీఫ్!

|

Nov 13, 2024 | 2:08 PM

ఈ మధ్య కాలంలో చాలా మంది ఇబ్బంది పడే సమస్యల్లో మల బద్ధకం కూడా ఒకటి. మలబద్ధకం కారణంగా చాలా మంది ఇతర అనారోగ్య సమస్యలకు గురి కావాల్సి వస్తుంది. ఇవి కాస్తా దీర్ఘకాలిక వ్యాధులుగా మారుతున్నాయి. మలబద్ధకాన్ని తగ్గించేందుకు ఇలా ఈజీగా చేస్తే సరి..

Constipation: మలబద్ధకాన్ని ఇలా సులభంగా పరిష్కరించుకోండి.. వెంటనే రిలీఫ్!
Constipation
Follow us on

తిన్న ఆహారం జీర్ణమై.. శరీరం పోషకాలు గ్రహించిన అనంతరం వ్యర్థ పదార్థాలను ఎప్పటికప్పుడు బయటకు పంపేస్తుంది. ఇలా మలం ద్వారా, మూత్రం ద్వారా చాలా రకాల వ్యర్థాలు బయటకు పోతాయి. అలా బయటకు పోకుండా ఉంటే మాత్రం అనారోగ్య సమస్యలు తప్పవు. ప్రస్తుత కాలంలో చాలా మంది మలబద్ధక సమస్యతోనే ఇబ్బంది పడుతున్నారు. ప్రతి రోజూ మూడు సార్లు ఆహారం తీసుకుంటారు. మూడు సార్లు కూడా విరేచనం చేయాలి. అయితే మనలో చాలా మంది ఉదయం మాత్రమే బాత్రూమ్‌కి వెళ్తారు. ఆ తర్వాత వచ్చినా బలవంతంగా ఆపేసుకుంటారు. ఇలా చేయడం చాలా తప్పు. దీని వలన వ్యర్థాలు బయటకు పోకుండా.. శరీరంలోనే ఉంటాయి. దీని వలన అనేక రోగాలు, ఇన్ఫెక్షన్స్ రాక తప్పదు. ఫైబర్ ఉండే ఆహారాలను తక్కువగా తీసుకోవడం వల్ల ఈ సమస్య వచ్చి పడుతుంది. ఫైబర్ ఉన్న ఆహారాలు త్వరగా జీర్ణం అవుతాయి. మరి మల విసర్జన సాఫీగా జరగాలంటే ఏం చేయాలో.. ఎలాంటి ఆహారాలో తీసుకుంటే మంచిదో ఇప్పుడు చూద్దాం.

వెస్టర్న్ బాత్రూమ్స్:

ఈ మధ్య కాలంలో చాలా మంది వెస్టర్స్ టాయిలెట్సే ఉపయోగిస్తారు. ఇంతకు ముందు ఉన్న ఇండియన్ టాయిలెట్స్‌ని పూర్తిగా అవైడ్ చేస్తున్నారు. కానీ అంతకు ముందు వాడిన ఇండియన్ టాయిలెట్సే ఎంతో ఆరోగ్యం. ఇలా కూర్చోవడం వల్ల మల విసర్జన సవ్యంగా సాఫీగా అవుతుంది. భారతీయ మరుగు దొడ్లు ఉపయోగిస్తే.. పొట్టపై ఒత్తిడి పడుతుంది. కానీ వెస్టర్న్ టాయిలెట్స్‌లో కేవలం కూర్చీలో కూర్చున్నట్లు ఉంటుంది. కాబట్టి అప్పుడప్పుడూ గుంజీలు తీస్తూ ఉండండి.

ఫైబర్ రిచ్ ఫుడ్స్:

మీ ఆహారంలో ఫైబర్ ఎక్కుగా ఉండే ఆహారాలను ఎంచుకోండి. దీని వలన తిన్న ఆహారం త్వరగా జీర్ణమై.. మల విసర్జన సాఫీగా జరుగుతుంది. ఆకు కూరలు, పండ్లు, కూరగాయలు వంటివి తీసుకుంటే ఎలాంటి ఆటంకం లేకుండా బాత్రూమ్‌కి వెళ్లవచ్చు.

ఇవి కూడా చదవండి

నీళ్లు:

చాలా మంది నీళ్లను తాగడంలో కూడా బద్ధకిస్తూ ఉంటారు. ఈ కారణంగా కూడా తిన్న ఆహారం జీర్ణం కాదు. కాబట్టి తరచూ నీటిని ఎక్కువగా తాగుతూ ఉండండి. అయితే భోజనం చేసిన అనంతరం మాత్రం వెంటనే నీళ్లు తాగకూడదు. ఇలా తాగితే జీర్ణ సమస్యలు వస్తాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి.