Health: నిత్యం యవ్వనంగా ఉండాలనుకుంటున్నారా.? అయితే మీ ఆహారంలో ఇవి ఉండేలా చూసుకోండి..

| Edited By: Ravi Kiran

Oct 27, 2021 | 6:20 AM

Health: మనం తీసుకునే ఆహారం మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా యవ్వనంగా కనిపించాలన్నా..

Health: నిత్యం యవ్వనంగా ఉండాలనుకుంటున్నారా.? అయితే మీ ఆహారంలో ఇవి ఉండేలా చూసుకోండి..
Anti Aging Food
Follow us on

Health: మనం తీసుకునే ఆహారం మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా యవ్వనంగా కనిపించాలన్నా, తొందరగా చర్మం ముడతలు పడకూడదన్న కూడా మనం తీసుకునే ఆహారంపైనే ఆధారపడి ఉంటుందన్న విషయం మీకు తెలుసా.? అవును.. యాంటీ ఆక్సిడెంట్లు, ఆరోగ్యకర‌మైన కొవ్వులు ఉండే ఆహారాన్ని తీసుకుంటే చర్మం నిత్యం యవ్వనంగా ఉంటుంది. మరి అలాంటి పోషకాలు లభించే కొన్ని ఆహార పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

* చర్మ సంరక్షణలో బొప్పాయి క్రీయాశీలకంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలను శరీరానికి మేలు చేస్తాయి. కేవలం శరీరంలోపలే కాకుండా చర్మంపై కూడా మంచి ఫలితాలను చూపిస్తుంది. ఈ పండును తినడం వల్లే కాకుండా ఫేస్‌ ప్యాక్‌ల ఉపయోగించిన ముఖంపై ముడతలు, మచ్చలు తగ్గిపోతాయి.

* దానిమ్మను నిత్యం తీసుకుంటే రక్తం పుడుతుందన్న విషయం మనకు తెలిసిందే. అయితే ఇందులో ఉండే అనేక రకాల విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లను చర్మాన్ని కూడా రక్షిస్తాయని తెలుసా.? ముఖ్యంగా సూర్యకిరణాల నుంచి చ‌ర్మాన్ని రక్షించడానికి, ముడ‌తలను తగ్గించడానికి దానిమ్మ ఉపయోగపడుతుంది.

* ఆకుకూరలను తినడం వల్ల కూడా చర్మాన్ని రక్షించుకోవచ్చు. ముఖ్యంగా పాల‌కూర, బ్రోకలీ వంటి ఆకుకూర‌లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలను కలిగి ఉంటాయి. ఇవి చర్మాన్ని అందంగా, యవ్వనంగా ఉంచేందుకు దోహదపడతాయి.

* టమాటలను ఫేస్‌ప్యాక్‌గా ఉపయోగించడం చూసే ఉంటాయి. ఇందులో ఉండే పోషకాలు చర్మానికి అంతలా మేలు చేస్తాయి మరి. టమాటలో ఉండే లైకోపీన్ సూర్యుని నుంచి వ‌చ్చే హానికరమైన కిరణాల నుంచి చర్మాన్ని దెబ్బతినకుండా కాపాడుతుంది. ఇక టమాటను ఆహారంగా తీసుకున్నా మంచి ఫలితం లభిస్తుంది.

Also Read: Bribery Case: లంచం కేసులో ఇద్దరు కస్టమ్స్ అధికారుల అరెస్ట్.. హైదరాబాద్‌లో కలకలం..

Crime News: చిన్నారులపై అఘాయిత్యం.. సిగిరేట్లు తాగాలంటూ చెట్టుకు కట్టేసి కొట్టారు.. చివరకు..

Palnadu Politcs: ఎమ్మెల్యే కాసు, యరపతినేని మధ్య రాజకీయ వైరం కొత్త టర్న్‌.. పౌరుషాల గడ్డ పల్నాడులో వైసీపీ నేతల ‘గాంధీ’గిరి