AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Honey for weight loss: బరువు సులువుగా తగ్గే చిట్కా.. దీనిని రోజూ ఆహారంలో మితంగా తీసుకోండి చాలు..

తేనె అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉంది. ముఖ్యంగా శరీర బరువును అదుపులో ఉంచుతుంది. అధిక బరువును తగ్గించడానికి సాయపడుతుంది.

Honey for weight loss: బరువు సులువుగా తగ్గే చిట్కా.. దీనిని రోజూ ఆహారంలో మితంగా తీసుకోండి చాలు..
Honey
Madhu
|

Updated on: Feb 06, 2023 | 2:45 PM

Share

తేనే ఒక ఔషధాల సమ్మేళనం. దీనిలో అనేక రకాల విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. సహజసిద్ధ స్వీటెనర్ గానూ తేనె ఉపయోగపడుతుంది. అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉంది. ముఖ్యంగా శరీర బరువును అదుపులో ఉంచుతుంది. అధిక బరువును తగ్గించడానికి సాయపడుతుంది. అయితే దానిని శరీరానికి అందించే విధానంపై ఆధారపడి దాని ప్రయోజనాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో అసలు తేనెను ఎలా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదో.. నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం.. బరువు నియంత్రణకు తేనే ఉపకరిస్తోందో తెలుసుకుందాం..

  • గార్సినియా కంబోజియాతో కూడిన తేనెతో మీ రోజును ప్రారంభించడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి, వాటిలో ముఖ్యమైనది ఏమిటంటే ఇది బరువు తగ్గడం. పలు అధ్యయనాలు సూచించినట్లుగా, గార్సినియా కాంబోజియా మీ జీవక్రియను మెరుగుపరచడంలో సాయపడుతుంది. ఇది రోజంతా శరీరాన్ని యాక్టివ్ గా ఉంచడానికి, అవసరమైన శక్తిని అందించడానికి సాయపడుతుంది.
  • అలాగే శరీర జీవ క్రియను ఉత్తేజితం చేయడానికి పరగడుపున వెచ్చని నీటిలో తేనెను కలపి తీసుకోవచ్చు. ఇది జీర్ణ ప్రక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే ఆకలిని తగ్గిస్తుంది. కేలరీల వినియోగాన్ని తగ్గిస్తుంది.
  • చక్కెరతో పోల్చితే, తేనెలో తక్కువ కేలరీలు ఉంటాయి. అందుకే చక్కెర స్థానంలో రోజూ తేనెనె తీసుకోవడం ద్వారా మంచి ఆరోగ్య ప్రయోజనాలు సమకూరుతాయి. అంతేకాకుండా, కాఫీ, తృణధాన్యాలు, టీ , ఇతర పానీయాలలో శుద్ధి చేసిన చక్కెర స్థానంలో తేనెను ఉపయోగించవచ్చు.
  • తేనె జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది, ఎందుకంటే ఆహారంలో లభించే కార్బోహైడ్రేట్‌లను విచ్ఛిన్నం చేయడం ద్వారా ఆహారాన్ని జీర్ణం చేయడంలో సహాయపడే ఎంజైమ్‌లను కలిగి ఉంటుంది. ముఖ్యంగా రాత్రి భోజనం తర్వాత కొన్ని చెంచాల తేనె తీసుకుంటే ప్రయోజనకరంగా ఉంటుంది. అధిక మోతాదులో భోజనం చేసినప్పుడు కూడా తేనె తీసుకుంటే జీర్ణక్రియ ప్రభావవంతంగా పనిచేయడానికి ఉపకరిస్తుంది.
  • మీ శరీర శక్తి స్థాయిలను పెంచడానికి ఒక గొప్ప మార్గం ఏమిటంటే, వ్యాయామానికి ముందు తేనెను తీసుకోవడం. మీ శరీరానికి అధిక తీవ్రతతో వ్యాయామం చేయడానికి అవసరమైన అదనపు శక్తిని ఇది ఇస్తుంది. మీరు వర్కవుట్ చేసే ముందు ఒక టీస్పూన్ తేనెను తింటే, మీరు ఎక్కువ శ్రమ చేయగలుతారు.
  • తేనెలో సహజ చక్కెరలు పుష్కలంగా ఉంటాయి. ఇది సంతృప్తిని అందిస్తుంది. అనారోగ్యకరమైన స్నాక్స్ పై కోరికలను తగ్గిస్తుంది. ఎందుకంటే తేనెకు ఆకలిని అణచివేసే శక్తి కూడా ఉంది. ఒక చెంచా తేనె శరీరానికి పోషకాహార సమతుల్యత కోల్పోకుండా పనిచేయడానికి అవసరమైన శక్తిని ఇస్తుంది.
  • తేనెలో విటమిన్లు, మినరల్స్ అధికంగా ఉంటాయి. ముడి సేంద్రీయ తేనె లోని జీవన పోషకాలు జీవక్రియను వేగవంతం చేయడం ద్వారా కొవ్వును బర్న్ చేసే శరీర సామర్థ్యాన్ని పెంచుతాయి. అందుకోసం ఉదయం పూట, పడుకునే ముందు తేనెను తీసుకోవాలి. తేనెలోని ముఖ్యమైన సమ్మేళనాలు ఆకలిని పరిమితం చేయడం ద్వారా బరువు తగ్గడంలో సహాయపడతాయి. అందువల్ల, బరువు తగ్గడానికి తేనె ఉత్తమమైన ఆహారం.
  • ఏదైనా మితంగా తీసుకుంటేనే ఆరోగ్యం అన్న విషయాన్ని గుర్తు ఉంచుకోవాలి. ముఖ్యంగా బరువు తగ్గడానికి తేనె మంచి ప్రత్యామ్నాయంగా భావిస్తున్నప్పటికీ, ప్రతిరోజూ దానిని ఎక్కువగా తినడం వల్ల కేలరీలు పెరుగుతాయన్న విషయాన్న మర్చిపోకూడదు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం..