Anger: కోపం అన్ని అనర్థాలకి కారణం..ప్రాణాంతకం కూడా.. ఇలా నియంత్రించుకోండి..!

|

Oct 09, 2022 | 12:07 PM

కోపం మన సంబంధాన్ని నాశనం చేస్తుంది. చేసిన పని పాడైపోతుంది. కాబట్టి మీరు సులభమైన ఉపాయాలతో మీ కోపాన్ని నియంత్రించుకోవాలనుకుంటే, మీరు కొన్ని చర్యలు తీసుకోవాలి.

Anger: కోపం అన్ని అనర్థాలకి కారణం..ప్రాణాంతకం కూడా.. ఇలా నియంత్రించుకోండి..!
Control Anger
Follow us on

ప్రాణాంతకంగా మారే ప్రమాదం పొంచివుంది. ఎందుకంటే కోపం వచ్చినప్పుడు మనం ఎక్కడ నిలబడి ఎవరితో మాట్లాడుతున్నామో కూడా ఆలోచించరు. కోపం మన సంబంధాన్ని నాశనం చేస్తుంది. చేసిన పని పాడైపోతుంది. కాబట్టి మీరు సులభమైన ఉపాయాలతో మీ కోపాన్ని నియంత్రించుకోవాలనుకుంటే, మీరు కొన్ని చర్యలు తీసుకోవాలి. కోపాన్ని తగ్గించుకునే మార్గాల గురించి ఇప్పుడు చెప్పుకుందాం.

ఏదైనా మీకు కోపం తెప్పిస్తే ముందుగా లోతైన శ్వాస తీసుకోండి. ఇది మీకు విశ్రాంతినిస్తుంది. లోతైన శ్వాస ఉత్సాహం, ఆందోళన, నిరాశ కోపాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. మీకు కోపం వచ్చినప్పుడు లోతైన శ్వాస తీసుకోండి. ఇది అసలు విషయం నుండి మీ దృష్టిని మళ్లించడానికి మీకు సహాయపడుతుంది.

కోపాన్ని తగ్గించడంలో సంగీతం చాలా సహాయపడుతుంది. మీకు కోపం వచ్చినప్పుడు, పాటలు వినడం ప్రారంభించండి. మంచి సంగీతాన్ని వినడం వల్ల మీకు విశ్రాంతి లభిస్తుంది. మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మీకు అకస్మాత్తుగా కోపం వచ్చినప్పుడు కొంతదూరం నడవడం ప్రారంభించండి. ఇది కోపాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది.  నడక శరీర కండరాలను సడలించి మీ మనస్సును ప్రశాంతపరుస్తుంది. ఇలా చేయడం ద్వారా మీరు సమస్యను అర్థం చేసుకుంటారు. ఇది పరిస్థితిని సర్దుబాటు చేయడంలో మీకు సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

అంతేకాదు, కోపం, మానసిక ఆరోగ్యానికి యోగా, ధ్యానం కూడా అతి ముఖ్యమైనవి. తరచుగా కోపానికి గురయ్యే వారికి మనశ్శాంతి కరువవుతుంది. అప్పుడు యోగా, ధ్యానం చేయటం ద్వారా కోపాన్ని కంట్రోల్‌ చేసుకోగలుగుతారు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి