Drinking Warm Water: నిత్యం వేడి నీటిని తాగడం వల్ల ఎన్ని ప్రయోజనాలో.. తెలిస్తే ఇకపై కూల్ డ్రింక్స్‌ను పట్టుకోనే పట్టుకోరు..

|

Dec 27, 2022 | 6:02 PM

గోరువెచ్చని నీటిని తాగడం వల్ల గొంతు ఇన్ఫెక్షన్‌ల నుంచి దూరంగా ఉండవచ్చు. ముఖ్యంగా చలికాలంలో వేడినీటిని తాగడం వల్ల శారీరక అలసత్వం తొలగిపోయి చురుకుగా ఉంటాం. అలాగే చలి ప్రభావం కూడా..

Drinking Warm Water: నిత్యం వేడి నీటిని తాగడం వల్ల ఎన్ని ప్రయోజనాలో.. తెలిస్తే ఇకపై కూల్ డ్రింక్స్‌ను పట్టుకోనే పట్టుకోరు..
Benefits Of Drinking Warm Water
Follow us on

ప్రస్తుత కాలంలో మనం అనేక రకాల జీవన విధానాలు, ఆహారపు అలవాట్లను అనుసరిస్తున్నాము. అందులో భాగంగానే చాలా మందికి కాలంతో పని లేకుండా చల్లని నీళ్లను లేదా ఫ్రిజ్ వాటర్‌ను తాగే అలవాటు ఉంటుంది. అలాగే అనునిత్యం వేడినీళ్లను తాగేందుకు ఇష్టపడేవారు కూడా ఉంటారు. అయితే నిత్యం చల్లని నీళ్లను తాగే అలవాటు మంచిది కాదని పలువురు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే వేడినీటిని తాగడం వల్ల శరీరం హైడ్రెటెడ్‌గా ఉండడమే కాక జీర్ణక్రియలో మెరుగుదల, చర్మ సమస్యలు, దీర్ఘకాలిక తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుందని అంటున్నారు.

అలాగే కొన్ని నివేదికల ప్రకారం గోరువెచ్చని నీటిని తాగడం వల్ల గొంతు ఇన్ఫెక్షన్‌ల నుంచి దూరంగా ఉండవచ్చు. ముఖ్యంగా చలికాలంలో వేడినీటిని తాగడం వల్ల శారీరక అలసత్వం తొలగిపోయి చురుకుగా ఉంటాం. అలాగే చలి ప్రభావం కూడా శరీరం మీద పెద్దగా  ఉండదు. అందువల్ల కాలంతో పని లేకుండా అనునిత్యం వేడినీటిని తాగాలని వైద్యులు కూడా పెర్కొంటున్నారు. అలా చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయంటున్నారు. మరి ఆ ప్రయోజనాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

వేడినీళ్లను తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు:

బరువు తగ్గడం: ప్రతి రోజు ఉదయాన్నే ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో చెంచా తేనెతో కలుపుకుని తాగితే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. తద్వారా శరీరం బరువు తగ్గడంలో వేడి నీరు సహాయపడుతుంది .

ఇవి కూడా చదవండి

ఋతుస్రావం: ఋతుస్రావం సమయంలో రాత్రి వేళ పడుకునే ముందు గోరువెచ్చని నీటిని తాగడం మంచిది. అలా చేయడం వల్ల ఉదర కండరాలపై వేడి నీరు ప్రభావం చూపి నొప్పి నుంచి ఉపశమనం కలిగే అవకాశం ఉంది.  

జీర్ణక్రియ: మీరు నిద్రలేవగానే ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో తేనె, నిమ్మరసం కలిపి తాగడం వల్ల మీ జీర్ణవ్యవస్థ  ఉత్తేజితమవుతుంది. మీరు తినే ఆహారంలో ఉన్న నూనెను వేడి నీరు విచ్ఛిన్నం చేయడం ద్వారా మీ జీర్ణక్రియ సక్రమంగా సాగుతుంది.

మలబద్ధకం: శరీరంలో తగినంత నీరు లేకపోవడం వల్ల తరచుగా మలబద్ధకం సమస్య ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ సమస్య ఎదురవకుండా పడుకునే ముందు, మేల్కొన్నప్పుడు వేడి నీటిని తాగాలి. ఇలా చేయడం వల్ల శరీరంలోని ప్రేగు కదలికలను మెరుగుపరచడంలో వేడినీరు సహాయపడుతుంది. ఫలితంగా మలబద్ధకం నుంచి ఉపశమనం పొందవచ్చు.

గొంతు సమస్యలు, ఖఫం:  ప్రతి రోజూ గోరువెచ్చని నీటిని తాగడం వల్ల గొంతు సమస్యలు, చికాకు, దగ్గు, జలుబు వంటివాటి నుంచి ఉపశమనం పొందవచ్చు. 

సుఖ నిద్ర: పడుకునే ముందు గోరువెచ్చని నీటిని తాగడం వల్ల మీ శరీర కండరాలు, నరాలు విశ్రాంతి దశకు చేరుకుంటాయి. తద్వారా మీరు ప్రశాంతమైన నిద్రలోకి జారుకోవచ్చు. 

చర్మ సంరక్షణ: సరిపడినంతగా గోరువెచ్చని నీటిని తాగడం వల్ల మీ శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఫలితంగా మీ శరీరంపై ఉన్న క్రిములు, బ్యాక్టీరియా చర్మాన్ని వీడిపోతాయి. ఆ విధంగా మీరు మీ చర్మాన్ని రక్షించుకోవచచ్చు. 

మరిన్ని లైఫ్‌స్టైల్‌ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.