ప్రస్తుత ఉరుకులు, పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరిదీ టెన్షన్ లైఫ్ అయ్యింది. చిన్న అంశానికి కూడా అతిగా ఆలోచించడం, ఫలితంగా తీవ్రమైన తలనొప్పితో బాధపడుతుంటారు. మరికొందరు గంటల తరబడి కంప్యూటర్, మొబైల్ ఫోన్ల వినియోగం వల్ల కూడా తలనొప్పి సమస్య ఎదుర్కొంటారు. అయితే, తలనొప్పికి అనేక కారణాలు ఉన్నప్పటికీ, చాలా మంది ఈ సమస్యతో ఎక్కువగా సతమతం అవుతుంటారు. తలనొప్పి తగ్గించుకునేందుకు మెడిసిన్స్ వాడుతుంటారు. అయితే, ఈ సమస్య నుంచి బయటపడేందుకు హోం రెమెడీస్ బాగా ఉపకరిస్తాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. మరి తల నొప్పిని తగ్గించే హోం రెమెడీస్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
1. తలనొప్పితో బాధపడేవారు మంచి నూనెను తలకు పట్టించి మర్ధన చేస్తే మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. తలనొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుందని చెబుతున్నారు.
2. చమోమిలే నూనెతోనూ రకరకాల ప్రయోజనాలు ఉన్నాయి. అజీర్తి, వికారం, చర్మంపై దద్దుర్లు, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను తగ్గించడంలో అద్భుతంగా పని చేస్తుంది. ఇది మంచి నిద్రను కూడా ప్రోత్సహిస్తుంది. చమోమిలే నూనెను తలనొప్పికి చికిత్స చేయడానికి, ఒత్తిడి, మానసిక ఆందోళనను తగ్గించడంలోనూ అద్భుతంగా పని చేస్తుంది.
3. యూకలిప్టస్ ఆయిల్‌తోనూ అద్భుత ప్రయోజనాలు ఉన్నాయి. ఈ నూనెను వినియోగించడం వల్ల తలనొప్పి సమస్యలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదండోయ్.. గాయాలను తగ్గించడంలోనూ, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలోనూ, జలుబు వంటి సమస్యలను కూడా తగ్గిస్తుందని పేర్కొంటున్నారు నిపుణులు.
4. లావెండర్ ఆయిల్‌ను చర్మం సౌందర్యం కోసం ఉపయోగిస్తారు. దీని వినియోగం వల్ల శరీరాక ఇబ్బందలు, మానసిక నైరాశ్యం, ఒత్తిడి, ఆందోళన వంటి లక్షణాలన్నీ తగ్గుతాయని చెబుతున్నారు నిపుణులు. అలాగే మైగ్రేన్ తలనొప్పితోనూ పోరాడుతుందని, అద్భుత ఊరటనిస్తుందని చెబుతున్నారు.
గమనిక: పైన పేర్కొన్న కథనం నిపుణులు అభిప్రాయం, ఇంటర్నెట్‌లో లభించిన కొంతమేర సమాచారం ఆధారంగా ఇవ్వడం జరిగింది. దీనినే ప్రామాణికంగా తీసుకోవడం తగదు. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరిండం లేదు. ఏవైనా సమస్యలుంటే ముందుగా వైద్యులను సంప్రదించి, వారి సలహాలు, సూచనల మేరకు చికిత్స పొందాలి.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..