శరీరం చాలా సంక్లిష్టమైన నిర్మాణం, చిన్న విషయాలు కూడా ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. శరీరంలోని ఏ భాగంలోనైనా సమస్య వస్తే అది మొత్తం ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. శరీరంలో శక్తిని కలిగి ఉండటానికి, మనం సరిగ్గా పని చేయడానికి, కండరాలలో రక్త ప్రసరణ సజావుగా సాగడం చాలా ముఖ్యం. రక్త ప్రసరణ తగ్గితే.. అనేక ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. రక్తప్రసరణ సక్రమంగా జరగకపోతే ఇతర అవయవాలతో పాటు గుండె సంబంధిత సమస్యలు కూడా పెరిగే ప్రమాదం ఉంది. మారుతున్న జీవనశైలి, జంక్ ఫుడ్స్ కారణంగా శరీరంలో రక్త ప్రసరణ బాగా దెబ్బతింటుంది. శరీరంలో రక్త ప్రసరణకు సరిగా లేకపోవడం.. తిమ్మిరి, వాపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఈ సమస్య రక్తపోటు, బరువు పెరగడం, మధుమేహం వంటి సమస్యలను కూడా కలిగిస్తుంది. అందుకే తినే ఆహారం, తాగే డ్రింక్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం. మరి శరీరంలో రక్త ప్రసరణ పెరగడానికి ఏయే పదార్థాలు ఉపకరిస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
శరీరంలో రక్తప్రసరణ సరిగ్గా లేకుంటే పాదాల వాపు, చీలమండలు, చేతులు, కాళ్లు చల్లగా మారడం, తిమ్మిరిగా అనిపించడం వంటి లక్షణాలు తరచుగా కనిపిస్తాయి. ఇలాంటి లక్షణాలు నిరంతరం కనిపిస్తే, ఆహారంలో కొన్ని పదార్థాలను చేర్చడంతోపాటు, వైద్యుడిని కూడా సంప్రదించాల్సి ఉంటుంది.
టొమాటో: ఆహార రుచిని పెంచడానికి ఉపయోగించే టొమాటోలో లైకోపీన్ ఉంటుంది. ఇది గుండెకు మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే విటమిన్ కె రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.
డ్రై ఫ్రూట్స్: రోజువారీ ఆహారంలో బాదం, వాల్‌నట్స్ వంటి డ్రై ఫ్రూట్స్‌ని చేర్చుకోవాలి. వీటిలో ఉండే ఆక్సిడేటివ్ ఒత్తిడిని తగ్గిస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరచడంలో బాగా సహాయపడుతుంది. అదే సమయంలో అసంతృప్త కొవ్వును కలిగి ఉంటాయి. ఇది గుండె ఆరోగ్యానికి మంచిది.
ఈ కూరగాయలు తినండి: బీట్‌రూట్, వెల్లుల్లితో పాటు, కూరగాయలు సరైన పరిమాణంలో ఆహారంలో తినాలి. దీని కారణంగా శరీరంలో రక్త ప్రసరణ సరిగ్గా జరుగుతుంది.
విటమిన్ సి ఉన్న ఆహారాలు: ఆరెంజ్, స్వీట్ లైమ్ వంటి సిట్రస్ పండ్లను ఆహారంలో చేర్చుకోవాలి. విటమిన్ సి పుష్కలంగా ఉన్న పండ్లు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. రక్త ప్రసరణను మెరుగు పరచడంలో పుచ్చకాయ కూడా అద్భుతంగా పని చేస్తుంది.
రక్త ప్రసరణ సరిగ్గా జరగాలంటే మంచి జీవనశైలిని అలవర్చుకోవడం చాలా ముఖ్యం. ఇందుకోసం ఆహారంలో మార్పులు చేయడంతోపాటు యోగా, వ్యాయామాలు చేయడం వల్ల శరీరంలో రక్తప్రసరణ మెరుగుపడుతుంది.
మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..