Health Tips: నిద్రపోయే ముందు తలస్నానం చేయొచ్చా? చేయకూడదా? చాలా ముఖ్యమైన విషయాలు మీకోసం..

నిద్రపోయే ముందు ధ్యానం, యోగా, మానసిక వ్యాయామం చేయడం సర్వసాధారణం. నిద్రపోయే ముందు స్నానం చేయడం కూడా ట్రెండ్‌లో ఉంది. అయితే, నిద్రపోయే ముందు..

Health Tips: నిద్రపోయే ముందు తలస్నానం చేయొచ్చా? చేయకూడదా? చాలా ముఖ్యమైన విషయాలు మీకోసం..
Night Bathing

Updated on: Nov 23, 2022 | 8:00 AM

నిద్రపోయే ముందు ధ్యానం, యోగా, మానసిక వ్యాయామం చేయడం సర్వసాధారణం. నిద్రపోయే ముందు స్నానం చేయడం కూడా ట్రెండ్‌లో ఉంది. అయితే, నిద్రపోయే ముందు తలస్నానం చేయడం సరైందా? కాదా? అన్న ప్రశ్న చాలా మంది మదిలో మెదులుతుంటుంది. ఈ గందరగోళాన్ని ఇవాళ మనం క్లియర్ చేసుకుందాం. సాధారణంగా ప్రతి ఒక్కరూ రోజు ప్రారంభంలో స్నానం చేయడానికి శ్రద్ధ చూపుతారు. ఇంకొంత మంది రాత్రి పడుకునే ముందు కూడా స్నానం చేసి పడుకుంటారు. అయితే, ఇసురక్షితమేనా? ఇలా చేయడం వల్ల ఏమైనా ప్రయోజనాలు ఉన్నాయా? లేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయా? వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

నిద్రపోయే ముందు స్నానం చేయడం వల్ల ఏం జరుగుతుంది?

1. నిద్రపోయే ముందు తలస్నానం చేయడం వల్ల అలసట చాలా వరకు దూరం అవుతుంది. నిద్రకు ముందు స్నానం చేయడం వల్ల మంచి నిద్ర పడుతుంది. ఫలితంగా మరుసటి రోజంతా శరీరం ఎంతో తాజాగా, ఉత్సాహంగా ఉంటుంది.

2. రాత్రి పడుకునే ముందు తలస్నానం చేయడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. శరీరం రిలాక్స్‌గా ఉంటుంది. సిరల్లో రక్త ప్రవాహం మెరుగవుతుంది.

ఇవి కూడా చదవండి

3. స్నానం చేయడం ద్వారా వ్యక్తి శారీరకంగా మాత్రమే కాకుండా మానసికంగా కూడా మంచి అనుభూతి చెందుతాడు. అంతే కాదు.. చర్మం, జుట్టు కూడా ఆరోగ్యంగా మారుతాయి. ఎందుకంటే శరరీం, జుట్టుపై రోజంతా పేరుకుపోయిన మురికి సులభంగా తొలగిపోతుంది.

4. వేడి లేదా చల్లటి నీటితో స్నానం చేయడం అనేది ఎవరి ఇష్టం వారిది. అయినప్పటికీ.. కొంచెం గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చు. ఇది కండరాలకు ఉపశమనం కలిగిస్తుంది. చర్మంపై రంధ్రాలను తెరుస్తుంది. మంచి నిద్ర పడుతుంది.

లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..