Health Tips: తిన్న ఆహారం త్వరగా జీర్ణం కావాలంటే ఎటువైపు నిద్రపోవాలో తెలుసా? ఇంట్రిస్టింగ్ ఫ్యాక్ట్స్ మీకోసం..

|

Nov 05, 2022 | 6:57 AM

ప్రస్తుతం కాలంలో చాలా మంది జీర్ణ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. గ్యాస్, కడుపులో మంట, ఉబ్బరం, మలబద్ధకం మొదలైనవి చాలా సాధారణ సమస్యలు..

Health Tips: తిన్న ఆహారం త్వరగా జీర్ణం కావాలంటే ఎటువైపు నిద్రపోవాలో తెలుసా? ఇంట్రిస్టింగ్ ఫ్యాక్ట్స్ మీకోసం..
Sleeping Position
Follow us on

ప్రస్తుతం కాలంలో చాలా మంది జీర్ణ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. గ్యాస్, కడుపులో మంట, ఉబ్బరం, మలబద్ధకం మొదలైనవి చాలా సాధారణ సమస్యలు. ఈ సమస్యలను అధిగమించాలంటే.. ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాల్సి ఉంటుంది. లేదంటే.. ఇబ్బందులు తప్పవు. అయితే, ప్రస్తుతం చాలా మంది అనారోగ్యకరమైన జీవనశైలిని అనుసరిస్తున్నారు. ఫలితంగా అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. అయితే కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటే జీర్ణ సంబంధిత సమస్యను చాలా వరకు దూరం చేసుకోవచ్చు. తగినంత నీరు త్రాగడం, వ్యాయామం చేయడం, ఆహారాన్ని సరిగ్గా నమలడం, పీచుపదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారాలు తినడం వంటివి చేస్తే జీర్ణక్రియ బాగా జరుగుతుంది. ఇవన్నీ జీర్ణ సంబంధిత సమస్యలను మెరుగుపరుస్తాయి. ఇది కాకుండా, రాత్రి నిద్రించే భంగిమ కూడా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రాత్రిపూట నిద్రించే భంగిమ పొట్ట ఆరోగ్యాన్ని చాలా వరకు ప్రభావితం చేస్తుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా, గుండెల్లో మంట సమస్యను కూడా తగ్గిస్తుంది. ఈ పరిస్థితిలో మీరు కూడా జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలను కలిగి ఉంటే.. రాత్రి ఏ భంగిమలో నిద్రించడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చో ఇక్కడ తెలుసుకోండి..

ఎడమవైపు పడుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుందా?

మెరుగైన జీర్ణక్రియను నిర్వహించడానికి.. ఎడమ వైపు తిరిగి పడుకోవాలి. ఈ భంగిమలో పడుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ స్లీపింగ్ పొజిషన్ వల్ల జీర్ణమైన ఆహారం చిన్న పేగు నుంచి పెద్ద పేగుకు సులభంగా కదులుతుంది. ఎడమవైపు పడుకోవడం వల్ల గ్యాస్ట్రో ఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధిని కూడా నివారిస్తుంది. ఈ వ్యాధి ఉనికి కారణంగా, కడుపులో మంట, గ్యాస్, ఉబ్బరం సమస్య ఏర్పడే అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలో మంచి జీర్ణక్రియ కోసం నిపుణులు కూడా ఎడమ వైపున పడుకోవాలని సూచిస్తున్నారు. అన్నవాహిక క్రింద మన శరీరంలో ఎడమవైపున పొట్ట ఉంటుంది. మనం ఎడమవైపు పడుకున్నప్పుడు, కడుపులో ఉండే ఆమ్లం జీర్ణవ్యవస్థను గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా పెంచే సమస్య ఏర్పడుతుంది. మరోవైపు, గ్రావిటీ కడుపులో ఆమ్లాన్ని నిలుపుకుంటుంది. ఇది గుండెల్లో మంట, అజీర్తి ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

తిన్న తర్వాత ఈ భంగిమలో అస్సలు పడుకోవద్దు..

రాత్రి భోజనం చేసిన తర్వాత కుడి వైపు, వెల్లకిగా, బోర్లా పడుకుంటే అది ఆరోగ్యానికి హానికరం. గుండెల్లో తీవ్రమైన మంట, అజీర్తి సమస్యలకు దారితీస్తుంది. అంతే కాదు.. వెల్లకిగా, బోర్లా పడుకోవడం కూడా సరికాదు. యాసిడ్ రిఫ్లక్స్ కారణంగా మీకు గుండెల్లో మంట ఉంటే, మీ వెనుకభాగంలో పడుకోవడం మీకు సరికాదు. వెల్లకిగా నిద్రపోవడం వల్ల యాసిడ్ గొంతుకు చేరుకుంటుంది. ఫలితంగా రాత్రంతా మంట, అసౌకర్యాన్ని కలిగిస్తుంది.

మరో ముఖ్య గమనిక..

రాత్రి సమయంలో భోజనం చేసిన వెంటనే మంచం మీద పడుకోవద్దు. రాత్రి భోజనం, నిద్రకు మధ్య 2 గంటలు అయిని గ్యాప్ ఉండేలా చూసుకోవాలి. తద్వారా యాసిడ్ రిఫ్లక్స్ సమస్య రాకుండా ఉంటుంది.

లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..