మనలో మూడొంతుల మంది ఈరోజు ఆఫీసుల్లో గంటలకొద్ది కూర్చుని పని చేస్తున్నారు. ఈ జీవనశైలి మార్పు వల్ల వెన్నునొప్పి వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 2017 అధ్యయనం ప్రకారం.. మనం ఎక్కువ సమయం ఆఫీసులో లేదా ఇంట్లోనే కూర్చునే సమయాన్ని వెచ్చిస్తాం. ఇది మన ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. దీంతో అకాల మరణ ప్రమాదాన్ని పెంచుతుంది. జీ ఇంగ్లీష్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, బ్రిటీష్ సేఫ్టీ కౌన్సిల్ ఇండియా హెడ్ సురేష్ తన్వర్ పలు విషయాలు వెల్లడించారు. ఎక్కువ సేపు కుర్చీలో కూర్చోవడం వల్ల ఆరోగ్యానికి ఎలా హాని కలుగుతుందో వివరించారు.
30 నిమిషాల నుంచి 12 గంటల పాటు ఎక్కువసేపు కూర్చోవడం ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. నేడు అనేక ఉద్యోగాలకు కూర్చోవాల్సిన అవసరం ఉన్నప్పటికీ, నిశ్చల జీవనశైలిని భర్తీ చేయడానికి సాధారణ వ్యాయామానికి ప్రాధాన్యత ఇవ్వడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఎక్కువసేపు కూర్చోవడం వల్ల ఫ్యాట్ బర్నింగ్ నెమ్మదిస్తుంది. అలాగే టైప్ 2 డయాబెటిస్, కార్డియోవాస్కులర్ డిసీజ్ ముప్పు పెరుగుతుందని ఆయన వివరించారు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..