Health: ఖాళీ కడుపుతో ఈ డ్రింక్‌ తాగితే.. ఈ సమస్యలన్నీ పరార్‌..

|

Jul 07, 2024 | 9:04 PM

అలాంటి పసుపును ఉదయం ఖాళీ కడుపుతో తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా గోరు వెచ్చని నీటిలో పసుపు వేసుకొని తినడం వల్ల శరీరంలో పలు మార్పులు జరుగుతాయి. బరువు తగ్గాలనుకునే వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. గోరు వెచ్చిని నీటిలో చిటికెడు పసుపు వేసుకొని తాగితే బరువు తగ్గుతారు. పసుపులోని యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు...

Health: ఖాళీ కడుపుతో ఈ డ్రింక్‌ తాగితే.. ఈ సమస్యలన్నీ పరార్‌..
Turmeric Water
Follow us on

ఉదయాన్నే పరగడుపున తీసుకునే ఆహారం లేదా డ్రింక్స్‌ ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని తెలిసిందే. ముఖ్యంగా ఉదయం తీసుకునే కొన్ని వస్తువులు ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. ఇలాంటి వాటిలో ఒకటి పసుపు నీళ్లు. పసుపు ఆరోగ్యానికి ఎంతలా మేలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో ఆయుర్వేద గుణాలకు పసుపు పెట్టింది పేరు. ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి.

అలాంటి పసుపును ఉదయం ఖాళీ కడుపుతో తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా గోరు వెచ్చని నీటిలో పసుపు వేసుకొని తినడం వల్ల శరీరంలో పలు మార్పులు జరుగుతాయి. బరువు తగ్గాలనుకునే వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. గోరు వెచ్చిని నీటిలో చిటికెడు పసుపు వేసుకొని తాగితే బరువు తగ్గుతారు. పసుపులోని యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు నోటి ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ముఖ్యంగా చిగుర్ల సమస్యతో బాధపడేవారికి ఇవి బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు.

పసుపు నీటిని తాగడం వల్ల కడుపు సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. పసుపును ఉపయోగించడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతంది. జీర్ణ వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది. ఈ డ్రింక్‌ తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగవుతుంది, పొట్టను శుభ్రపరుస్తుంది. పసుపులో ఉండే కర్కుమిన్ శరీరంలో మంటను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని సంరక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. పసుపు నీళ్లు ఫ్రీ రాడికల్స్‌, సెల్ డ్యామేజ్ నుంచి చర్మాన్ని సంరక్షిస్తుంది. కీళ్ల నొప్పులతో బాధపడేవారికి కూడా పసుపు ఎంతనాగో ఉపయోగపడుతుంది. ఖాళీ కడుపుతో పసుపు నీరు తీసుకుంటే కీళ్ల సమస్యలు దూరమవుతాయి.

గ్యాస్‌, అజీర్ణం వంటి సమస్యలతో బాధపడేవారికి పసుపు నీళ్లు బాగా ఉపయోగపడతాయి. ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు, చెడు బ్యాక్టీరియాను దూరం చేస్తుంది. అంతేకాదు పసుపు నేచురల్‌ పెయిన్‌ కిల్లర్‌గా పనిచేస్తుంది. దీంతో నొప్పులు దూరమవుతాయి. పసుపు నీళ్లను క్రమంతప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తొలగిపోతుంది. దీంతో గుండె సంబంధిత సమస్యలు దరిచేరవు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..