Health: రుచిలోనే కాదు ఆరోగ్యంలోనూ అమోఘమే.. మొక్కజొన్న పొత్తులతో లాభాలెన్నో

|

Aug 15, 2022 | 9:20 AM

చిటపట చినుకులు పడుతున్న వేళ.. వేడి వేడి బొగ్గులపై కాల్చిన మొక్కజొన్న (Corn) తింటే ఆ మజానే వేరు. ఈ సీజన్‌లో మొక్కజొన్న పొత్తులు విస్తారంగా లభ్యమవుతాయి. మొక్కజొన్నను కాల్చుకుని తిన్నా, ఉడకబెట్టి తిన్నా, పాప్...

Health: రుచిలోనే కాదు ఆరోగ్యంలోనూ అమోఘమే.. మొక్కజొన్న పొత్తులతో లాభాలెన్నో
Corn
Follow us on

చిటపట చినుకులు పడుతున్న వేళ.. వేడి వేడి బొగ్గులపై కాల్చిన మొక్కజొన్న (Corn) తింటే ఆ మజానే వేరు. ఈ సీజన్‌లో మొక్కజొన్న పొత్తులు విస్తారంగా లభ్యమవుతాయి. మొక్కజొన్నను కాల్చుకుని తిన్నా, ఉడకబెట్టి తిన్నా, పాప్ కార్న్ రూపంలో తీసుకున్నా టేస్ట్ వేరే లెవెల్ లో ఉంటుంది. మొక్కజొన్న వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని మనకు తెలిసిందే. వర్షాకాలంలో మొక్కజొన్న తింటే ఈ సీజన్‌లో వచ్చే వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుందని ఆరోగ్య (Health) నిపుణులు చెబుతున్నారు. మొక్కజొన్నలో ఫ్యాట్‌, కార్బోహైడ్రేట్, ప్రొటీన్, ఫైబర్‌తో పాటు ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో రకాల విటమిన్లు, మినరల్స్‌ అధికంగా ఉంటాయి. జింక్‌, పాస్ఫర‌స్‌, మెగ్నిషియం, ఐర‌న్‌లు వంటి మూలకాలు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. దీన్ని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి. మొక్కజొన్న లోని పోషకాలు డయాబెటిస్‌ కంట్రోల్‌లో ఉంచడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా కళ్లకు మేలు చేస్తుంది. రక్తహీనతను నివారిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఎముకలు స్ట్రాంగ్‌ అవుతాయి. జుట్టుకు మంచి పోషకాలను అందించి బలంగా అయ్యేలా చేస్తాయి.

మొక్కజొన్న జుట్టు రాలే సమస్యను తగ్గిస్తాయి. అంతే కాకుండా జుట్టు త్వరగా తెల్లబడడాన్ని నివారిస్తుంది. చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంచడానికి తోడ్పడతాయి. మొక్కజొన్నలో ఉండే ఫైబర్‌ వల్ల మలబద్ధకం సమస్య దూరమవుతుంది. మొక్కజొన్నను ఏ రూపంలో తీసుకున్నా ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి. ఉడబట్టి , కాల్చుకుని, రోటీలు, కేక్‌, సమోసా, మసాలా ఇలా వివిధ రకాలుగా కార్న్ రుచులను ఎంజాయ్ చేస్తూ ఆస్వాదించవచ్చు.

నోట్.. ఈ కథనంలో పేర్కొన్న అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించేముందు నిపుణల సలహాలు తీసుకోవడం ఉత్తమం.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం క్లిక్ చేయండి..