why is steamed food good for health: ఆవిరితో ఉడికించిన ఆహారం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటుంటారు. ఎందుకంటే.. ఆవిరిపై ఆహారాన్ని ఉడికించడం వల్ల అందులోని పోషక విలువలు చెడిపోకుండా.. పదిలంగా ఉంటాయి. అంతేకాకుండా ఆవిరిపై ఉడికించిన ఆహారంలో చాలా తక్కువ నూనె ఉపయోగిస్తుంటాం. ఆ ఆహారంలో కొవ్వులు, కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఇది తేలికగా జీర్ణమవుతుంది. వేయించిన లేదా ఇతర మార్గాల్లో వండిన ఆహారంలో పోషక విలువలు తక్కువగా ఉంటాయి. ఆవిరి మీద ఉడికించిన ఆహారంలో విటమిన్లు, ఖనిజాలు చెక్కుచెదరకుండా ఉంటాయి. ఆవిరి పట్టడం వల్ల విటమిన్ బి, థయామిన్, నియాసిన్, విటమిన్ సి వంటి కొన్ని విటమిన్ల శక్తి పెరుగుతుంది. ఇందులో పొటాషియం, కాల్షియం, ఫాస్పరస్, జింక్ వంటి ఖనిజాలు చెక్కుచెదరకుండా అలాగే ఉంటాయి.
సాధారణంగా వంటలకు ఉపయోగించే నూనె ఆవిరిపై ఉడికించిన ఆహారానికి అవసరం ఉండదు. ఫలితంగా ఉడికించిన ఆహారంలో కొవ్వు శాతం చాలా తక్కువగా ఉంటుంది. కూరగాయలు, పండ్లు వంటి ఆహారాలు ఆవిరితో ఉడికించడం వల్ల మృదువుగా మారుతాయి. ఈ ఆహారం తింటే చాలా తేలికగా జీర్ణమవుతుంది. ఇది మీ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు అందుతాయి. ఈవిధమైన ఆహారం అధిక రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఆవిరిపై ఉడికించిన కూరగాయల రుచి, రంగు, ఆకృతి మారకుండా సంరక్షిస్తుంది. ఆవిరి మీద ఉడికించిన ఆహారాన్ని తినడం వల్ల పూర్తి పోషక విలువలు లభిస్తాయి.