ప్రస్తుత కాలంలో చియా సీడ్స్ ఉపయోగం బాగా పెరిగింది. చాలా మంది బరువు తగ్గడానికి వీటిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే చియా సీడ్స్ ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తాయి. ఒకరకంగా వీటిని ఆయుర్వేద ఔషధంగా పిలుస్తారు. ముఖ్యంగా చలికాలంలో చియా సీడ్స్ వాడకం మరింత మంచిదని చెబుతున్నారు. ఈ సమయంలో ఆరోగ్యంగా ఉండాలంటే డయాబెటిస్ పేషెంట్లు ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవాలి. యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ కంటెంట్ ఫుల్లుగా ఉండే వాటిలో చియా సీడ్స్ ఒకటి. ఒమేకా -3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి. మధుమేహాన్ని అదుపులో ఉంచడంలో సహాయపడతాయి.
చియా విత్తనాల్లో ఫైబర్ అధికంగా ఉండి జీర్ణ ఆరోగ్యానికి తోడ్పడతాయి. మలబద్ధకం, అజీర్ణం, గ్యాస్ వంటి సమస్యలను దూరం చేస్తాయి. క్రమబద్ధతను ప్రోత్సహిస్తాయి. యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్‌తో నిండిన చియా విత్తనాలు రోగనిరోధక శక్తిని బలపరుస్తాయి. జలుబు, ఫ్లూకి వ్యతిరేకంగా పోరాటంలో శక్తివంతంగా పనిచేస్తాయి. వీటిలోని విటమిన్లు, ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేస్తాయి. అధిక బరువును తగ్గిస్తాయి. కార్బో హైడ్రేట్లు, ప్రోటీన్లు పుష్కలంగా ఉండటం మూలంగా జీర్ణక్రియ ఆరోగ్యానికి మంచిది.
శీతాకాలంలో చియా విత్తనాలు చర్మ సంరక్షణకు మేలు చేస్తాయి. మీ శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడతాయి. ఇవి చర్మాన్ని సహజంగా తేమగా మార్చే కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. సహజ శక్తి ప్రమోటర్‌గా చియా విత్తనాలు స్థిరమైన శక్తి స్థాయిలను నిర్వహించడంలో సహాయపడతాయి. చలికాలంలో చియా విత్తనాలు శక్తి బూస్ట్‌గా పనిచేస్తాయి. చియా సీడ్స్‌లోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు గుండె జబ్బులను నివారించడంలో, ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ స్థాయిలను నిర్వహించడంలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. చియా గింజలలో ఉండే ప్రోటీన్ కంటెంట్ ఆకలి, అధికంగా తినాలనే కోరికలను తగ్గించడంలో సహాయపడుతుంది. దీంతో మీరు మితంగా తింటారు. ఫలితంగా బరువు కంట్రోల్‌లో ఉంటుంది.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..