Tomato Benefits: ‘లవ్ యాపిల్’గా ఇంటి ముందు అందమైన క్రోటన్ గా పెరిగిన టమాటా మొక్క .. కాలక్రమంలో కూరగాయగా మారింది.. అమెరికా నుంచి ఇంగ్లాండ్ లో అక్కడ నుంచి మనదేశంలో సుమారుగా 1850 లో అడుగు పెట్టింది టమాటా.. అదేనండి రామ ములగ పండు.. అతి తక్కువ సమయంలోనే టమాటా ఇది దేశీ కూరగాయల స్థానాన్ని సంపాదించుకుంది. ఇక ఇప్పుడు టమాటో కూరలేని ఇల్లు, టమాటో పండు అమ్మని కాయగూరల దుకాణం చూడలేం.. అయితే టమాటా తినడంతో అద్భుతమైన ప్రయోజాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. దీనిలో విటమిన్ సి, ఫోలేట్, పొటాషియం లభిస్తాయి. అయితే ప్రతి రోజు తినే మనం డైట్ లో తీసుకోవడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం..!
టమాటాలో ఉండే విటమిన్ కె, కాల్షియం వల్ల ఎముకలు గట్టి బడడానికి.. బలంగా ఉంచడానికి సహాయపడతాయి. ఇందులో ఉండే విటమిన్ ఏ దృష్టిని మెరుగుపరుస్తుంది. ఇక రేచీకటి నివారణకు టమాటాలు బాగా ఉపగయోగపడతాయి.
టమాటాలు సహజ క్యాన్సర్ ఫైటర్. టమోటాలు తీసుకోవడం వల్ల క్యాన్సర్ ప్రమాదాలను తగ్గిస్తుంది. బ్లడ్ షుగర్ లెవల్స్ ను బ్యాలెన్స్ చేయడానికి కూడా టమాటాలు ఉపయోగ పడతాయి. అంతేకాదు నొప్పులను టమాటా తగ్గిస్తుంది, బరువు తగ్గడానికి ఉపయోగపడతాయి.
టమాటా కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాదు అందానికి కూడా ఇవి బాగా ఉపయోగ పడతాయి. టమాటా లో ఉండే విటమిన్ ఏ జుట్టు గట్టిగా ఉండేలా కాంతివంతంగా ఉండేలా చేస్తుంది. దీనిలో వుండే బీటా కెరోటిన్ చర్మాన్ని రక్షించడానికి సహాయ పడుతుంది. టమాటా కు పంచదార అద్ది దానిని చర్మం మీద అప్లై చేస్తే.. చర్మం పై ముడతలు, గీతలు వంటి వాటిని ఇది తొలగిస్తుంది.
Also Read: