మన ఆరోగ్యం మనం తినే ఆహారం మీదనే ఆధారపడి ఉంటుంది. ఈ రోజుల్లో దాదాపు అందరూ హెల్తీ ఫుడ్ కి దూరమై జంక్ ఫుడ్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇలా చాలా మంది ఆరోగ్యకరమైన ఆహారం నుండి దూరంగా ఉంటున్నారు. ఇది మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. మన అనారోగ్యకర అలవాట్లు మన జుట్టును కూడా ప్రభావితం చేస్తుంది. మనం అనుసరించే తప్పుడు డైట్ వల్ల జుట్టు రాలడం, జుట్టు అకాల నెరసిపోవడం, జుట్టు పొడిబారడం, చుండ్రు వంటి అనేక సమస్యలకు దారి తీస్తుంది. అయితే, ఈ సమస్యను పరిష్కరించడానికి మార్కెట్లో అనేక ప్రత్యామ్నాయ పరికరాలు అందుబాటులో ఉన్నాయి. షాంపూ, కండీషనర్, ఆయిల్, హెయిర్ కలర్ వంటివి సమస్యకు పరిష్కారాలుగా సూచిస్తారు. కానీ వీటిలో ప్రమాదకరమైన రసాయనాలు ఉంటాయి. అంతే కాదు ధర కూడా ఖరీదైనదే. ఇలాంటి వాటిని ఉపయోగించడం వల్ల తాత్కాలికంగా సమస్యను పరిష్కరించినట్లు అనిపించవచ్చు. కానీ, అలాంటి అలవాట్లన్నీ మరొ సమస్యకు దారితీస్తుంది. అయితే, ఇలాంటి హోం రెమెడీని ఉపయోగిస్తే సమస్యకు సహజసిద్ధమైన పరిష్కారం ఖాయం.
మెలనిన్ లేకపోవడం వల్ల, మన జుట్టు తెల్లగా మారుతుంది. కరివేపాకు జుట్టులో మెలనిన్ లోపాన్ని తొలగిస్తుంది. అప్పుడు జుట్టు క్రమంగా తెల్లబడటం ఆగిపోతుంది. తెల్ల వెంట్రుకల స్థానంలో నల్ల వెంట్రుకలు పెరుగుతాయి. కరివేపాకును ఉపయోగించడం వల్ల జుట్టు మెరుస్తూ మృదువుగా మారుతుంది.
హెయిర్ మాస్క్ చేయడానికి, కరివేపాకు, కొబ్బరి నూనె, వేప ఆకులు, విటమిన్ ఇ క్యాప్సూల్స్, పెరుగు అవసరం. కరివేపాకు, వేప ఆకులను మిక్సీలో రుబ్బుకుని మాస్క్ తయారు చేసుకోవాలి. తర్వాత మరో పాత్రలో కొబ్బరినూనె, విటమిన్ ఇ క్యాప్సూల్, పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కొద్దిగా వేడి చేయండి. చల్లారిన తర్వాత అందులో కరివేపాకు, వేప ఆకుల మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి. మీ హెయిర్ మాస్క్ సిద్ధమవుతుంది.
జుట్టు మీద హెయిర్ మాస్క్ వేసుకునే ముందు, బాగా కడిగి, ఆరబెట్టండి. తర్వాత హెయిర్ మాస్క్‌ని జుట్టు, తలకు పట్టించాలి. ఒక గంట తర్వాత జుట్టును మళ్లీ కడగాలి. వారానికి రెండు సార్లు ఈ హోం రెమెడీని అనుసరించండి. మీరు త్వరలో ఫలితాలను చూస్తారు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం..