Hair Care Tips: జుట్టు సమస్యలకు చెక్‌పెట్టాలనుకుంటున్నారా? అయితే ఈ హెయిర్‌ మాస్క్‌లు ట్రై చేయండి..

Egg Hair Mask: గుడ్లలో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అంతేకాదు చర్మం, జుట్టు సంరక్షణలోనూ గుడ్లు ఉపయోగపడతాయి. ముఖ్యంగా జుట్టుకు సంబంధించిన పలు సమస్యలను ఇవి దూరం చేస్తాయి..

Hair Care Tips: జుట్టు సమస్యలకు చెక్‌పెట్టాలనుకుంటున్నారా? అయితే ఈ హెయిర్‌ మాస్క్‌లు ట్రై చేయండి..
Hair Care Tips

Updated on: Jun 25, 2022 | 7:00 PM

Egg Hair Mask: గుడ్లలో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అంతేకాదు చర్మం, జుట్టు సంరక్షణలోనూ గుడ్లు ఉపయోగపడతాయి. ముఖ్యంగా జుట్టుకు సంబంధించిన పలు సమస్యలను ఇవి దూరం చేస్తాయి. జుట్టు పల్చబడడం, చివర్లు చిట్లడం తదితర సమస్యలను అరికట్టడంలో గుడ్లు బాగా సహాయపడతాయి. ఇందుకోసం వివిధ రూపాల్లో గుడ్లను ఉపయోగించవచ్చు. పలు రకాల హెయిర్‌ మాస్క్‌లను తయారుచేసుకోవచ్చు. ఎగ్‌ హెయిర్‌ మాస్క్‌ (Egg Hair Mask) లు బలహీనమైన జుట్టుని దృఢంగా మారుస్తాయి. మృదువుగా మారుస్తాయి. మరి జుట్టుకు హెయిర్ మాస్క్‌గా గుడ్లను ఏయే మార్గాల్లో ఉపయోగించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం రండి.

గుడ్డు, ఆలివ్ ఆయిల్

ఒక గిన్నెలో గుడ్డు పచ్చసొన తీసుకోండి. దీనికి 2 టీస్పూన్ల ఆలివ్ ఆయిల్ కలిపి బాగా మిక్స్‌ చేయాలి. ఆపై ఈ హెయిర్ మాస్క్‌ని జుట్టుతో పాటు తలకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎగ్‌ హెయిర్‌ మాస్క్‌ పూర్తి ప్రయోజనాలు పొందేందుకు షవర్ క్యాప్ ధరించండి. 30 నుండి 40 నిమిషాల వరకు జుట్టును అలాగే వదిలేయండి. ఆ తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. వారంలో కనీసం 1-2 సార్లు ఈ హెయిర్‌ మాస్క్‌ను తలకు పట్టి్స్తే మంచిది.

ఇవి కూడా చదవండి

గుడ్డు, అవకాడో హెయిర్ మాస్క్

పండిన అవకాడోను సగానికి గుజ్జు చేయాలి. దీనికి గుడ్డులోని పచ్చసొన కలిపి బాగా మిక్స్‌ చేయాలి. ఈ మిశ్రమంలో ఎలాంటి ఉండలు ఏర్పడకుండా చూసుకోవాలి. ఆపై ఈ హెయిర్ మాస్క్‌ని జుట్టు, స్కాల్ప్ అంతా అప్లై చేయాలి. సుమారు 30 నుంచి 40 నిమిషాల పాటు అలాగే ఉంచండి. ఆ తర్వాత తేలికపాటి షాంపూతో జుట్టును కడిగేసుకోవాలి. వారంలో 1 నుంచి 2 సార్లు ఈ మాస్క్‌ను ఉపయోగించవచ్చు.

గుడ్డు, పెరుగు కలిపి..

ఒక గిన్నెలో గుడ్డు పచ్చసొన తీసుకోండి. దీనికి 2 చెంచాల తాజా పెరుగు కలిపి బాగా మిక్స్‌ చేయండి. ఈ హెయిర్ మాస్క్ ను జుట్టుతో పాటు స్కాల్ప్ పై కూడా అప్లై చేయండి. సుమారు 30 నుంచి 40 నిమిషాల పాటు అలాగే జుట్టును వదిలేయాలి. ఆ తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. వారంలో కనీసం 1-2 సార్లు ఈ హెయిర్‌ మాస్క్‌ను తలకు పట్టి్స్తే జుట్టు సమస్యలు తగ్గుతాయి.

గుడ్డు, కొబ్బరి నూనె ..

ఒక గిన్నెలో గుడ్డు పచ్చసొన తీసుకోని.. దీనికి 1 నుంచి 2 టీస్పూన్ల కొబ్బరి నూనె కలపండి. ఈరెండింటినీ బాగా మిక్స్‌ చేసి జుట్టుతో పాటు స్కాల్ప్ పై కూడా అప్లై చేయండి. ఆ తర్వాత షవర్ క్యాప్‌తో జుట్టును కవర్‌ చేసుకోవాలి. సుమారు 30 నుంచి 40 నిమిషాల తర్వాత తేలికపాటి షాంపూతో జుట్టును కడిగేసుకోవాలి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..