Using Mobile in Toilets: టాయిలెట్‌లోకి ఫోన్‌ తీసుకెళుతున్నారా..? మరి అలా చేయడం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలేమిటో మీకు తెలుసా..?

|

Dec 08, 2022 | 9:05 PM

ప్రస్తుత కాలంలో సెల్ ఫోన్ అనేది మానవ జీవితంలో ఒక ప్రధాన భాగంగా మారింది. పని సమయాలలో విశ్రాంతి లభించే కొంత సమయంలో కూడా మనం ఫోన్‌తోనే గడుపుతున్నాం కదా.. నిజం చెప్పాలంటే నిద్ర లేచేది..

Using Mobile in Toilets: టాయిలెట్‌లోకి ఫోన్‌ తీసుకెళుతున్నారా..? మరి అలా చేయడం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలేమిటో మీకు తెలుసా..?
Using Phone In Toilets
Follow us on

ప్రస్తుత కాలంలో సెల్ ఫోన్ అనేది మానవ జీవితంలో ఒక ప్రధాన భాగంగా మారింది. పని సమయాలలో విశ్రాంతి లభించే కొంత సమయంలో కూడా మనం ఫోన్‌తోనే గడుపుతున్నాం కదా.. నిజం చెప్పాలంటే నిద్ర లేచేది సెల్ ఫోన్ చూడడంతోనే, నిద్ర పోయేది కూడా దానిని చూస్తూనే.. ఈ విషయం నుంచి ఏ ఒక్కరూ మినహాయింపు కాదు. అందరికీ ఉన్న అలవాటే ఇది. అఖరికి చిన్న పిల్లలు కూడా ఈ ఫోన్లకు బానిసలు అయిపోతున్నారు. తినాలన్నా.. పడుకోవలన్నా.. చెప్పింది వినాలన్నా ఫోన్ ఇవ్వాల్సిందే. లేకపోతే పనులు జరగడంలేదు. అయితే మనలో కొందరు మరో అడుగు ముందుకేసి టాయిలెట్‌లోకి కూడా మొబైల్ ఫోన్‌ను తీసుకెళుతున్నారు.

ఈ రోజుల్లో చాలా మంది టాయిలెట్‌లలోనే ఎక్కువ సమయం గడపడానికి ఇదే ప్రధాన కారణమని చెప్పుకోవాలి. ఇలా బాత్‌రూమ్‌లకు కూడా ఫోన్ తీసుకెళ్లడాన్ని చాలా మంది తప్పు పడుతున్నారు. అయితే ఈ విధంగా టాయిలెట్‌లలోకి మొబైల్ తీసుకెళ్లి, అక్కడే ఎక్కువ సమయం గడపడం మన ఆరోగ్యానికి ప్రమాదకరమని మీకు తెలుసా..?  ఈ అలవాటు వల్ల కలిగే నష్టాలేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

బ్యాక్టీరియా సంక్రమణ:

టాయిలెట్‌లలో మన ఆరోగ్యానికి హానికరమైన లేదా హాని కలిగించే బ్యాక్టీరియా అన్ని సమయాలలోనూ ఉంటుంది. టాయిలెట్ ఉపయోగించిన తర్వాత చేతులు కడుక్కోవడం చాలా ముఖ్యం. మీరు ఫోన్‌ను అక్కడకు తీసుకెళ్లి బయటకు వచ్చిన తర్వాత దానిని శానిటైజ్ చేయాలి. అలా చేయకుండా వాడితే అది ఇన్‌ఫెక్షన్‌కు కారణమవుతుంది. దీనివల్ల ఆరోగ్యమే కాదు చర్మవ్యాధులు కూడా వస్తాయి.

ఇవి కూడా చదవండి

పైల్స్ వ్యాధి:

టాయిలెట్ లో ఫోన్ వాడటం వల్ల పైల్స్ వ్యాధి వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. చాలా మంది టాయిలెట్‌లో ఎక్కువసేపు ఫోన్‌ను వాడుతూ అక్కడే ఉంటారు. అలా చేయడం వల్ల వారి పాదాలు మొద్దుబారడం ప్రారంభిస్తాయి. నిపుణు ప్రకారం ఇది పురీషనాళంపై ఒత్తిడిని కలిగిస్తుంది. ఈ తప్పును నిరంతరం పునరావృతం చేయడం వల్ల పైల్స్ వ్యాధి బారిన పడే అవకాశముంది.

అతిసారం:

టాయిలెట్‌లో ఎక్కువ సమయం ఫోన్‌తో కాలం గడపడం వల్ల కూడా డయేరియా వస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇది తీవ్రమైన ఆరోగ్య సమస్య. ఈ వ్యాధి కారణంగా వాంతులు, విరేచనాలు వస్తాయి. దీనికి ప్రధాన కారణం ఫోన్ స్క్రీన్ ద్వారా మన శరీరంలోకి చేరే చెడు బ్యాక్టీరియా.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..