ఉపవాసాలు చేసే వారు కేవలం నీటిని మాత్రమే తీసుకోవడం మనం చూస్తూ ఉంటాం. అయితే వారు ఆకలిని తట్టుకోడానికి మంచినీటిని తాగుతూ ఉంటారు. అలాగే అధిక బరువు సమస్యతో బాధపడేవారు కూడా ఎక్కువ తినకుండా నీటిని తాగుతూ ఉంటారు. అయితే ఉపవాసం చేసే సమయంలో నీటిని వినియోగిస్తే అధిక బరువు సమస్య నుంచి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రారంభంలో ఈ ప్రక్రియ మంచి ఫలితాలను ఇచ్చినా దీర్ఘకాలంలో ఎలాంటి ఫలితాలు ఇస్తుందనే విషయం అప్పుడే చెప్పలేమని నిపుణులు చెబుతున్నారు. చికాగోలోని ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయం చేసిన ఒక అధ్యయనంలో ఉపవాసం సమయంలో నీటిని ఎక్కువగా తాగితే తక్కువ రక్తపోటు, కొలెస్ట్రాల్, ఇతర జీవక్రియకు ప్రయోజనాలు కలుగుతాయని వెల్లడైంది. నీటిని ఎక్కువగా వినియోగించడం వల్ల శరీరానికి తక్కువ క్యాలరీలు అందుతాయి. తద్వారా అధిక బరువు సమస్య తీరుతుంది. అయితే ఇలా నీటిని ఎక్కువగా తాగడం వల్ల మన ఆరోగ్యంపై ఏదైనా ప్రతికూల ప్రభావం పడుతుందనే అనుమానం వేధిస్తూ ఉంటుంది. అలాంటి అనుమానాలను నివృత్తి చేస్తూ అధిక నీటి వినియోగం వల్ల ఎలాంటి సమస్యలు ఉండవని నిపుణులు తెలుపుతున్నారు. ఈ అధ్యయనం గురించి మరిన్ని విషయాలు ఓ సారి తెలుసుకుందాం.
ఉపవాసం చేస్తూ నీటిని తాగుతూ బరువు తగ్గుదామనుకునే వారికి ఈ అధ్యయనం ఊపరిపోసింది. అయితే ఇలా అధిక రోజులు చేస్తే జీవక్రియ ప్రయోజనాలు ఉండవని నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వైద్యుల పర్యవేక్షణ లేకుండా ఐదు రోజులకు మించి ఎవరూ ఈ ఉపవాసాలు చేయడకూడదని పేర్కొంటున్నారు. ఈ కొత్త పేపర్ వాటర్ ఫాస్టింగ్ లేదా బుచింగర్ ఫాస్టింగ్‌పై ఎనిమిది అధ్యయనాలు ఇటీవల వెల్లడయ్యాయి. ఈ ఉపవాసాన్ని వైద్యపరంగా పర్యవేక్షిస్తారు. ఈ ఉపవాస ప్రక్రియ యూరోప్‌లో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ప్రజలు రోజుకు కొద్ది మొత్తంలో రసం, సూప్ మాత్రమే తీసుకుంటారు. సమీక్షలోని కొన్ని అధ్యయనాలు మాత్రమే ఉపవాసం ముగిసిన తర్వాత వారు కోల్పోయిన బరువును తిరిగి పొందారా? లేదా? అని ట్రాక్ చేశారు. వాటిలో ఒకదానిలో ప్రజలు మూడు నెలల్లో ఐదు రోజుల నీటి ఉపవాసంలో కోల్పోయినవన్నీ తిరిగి పొందారు. మరో రెండు అధ్యయనాల్లో కోల్పోయిన బరువులో కొద్ది మొత్తం మాత్రమే తిరిగి వచ్చింఘి. కానీ ఆ అధ్యయనాలు ఉపవాసాలు ముగిసిన తర్వాత వారి క్యాలరీలను పరిమితం చేయమని పాల్గొనేవారిని ప్రోత్సహించాయి.
కొన్ని అధ్యయనాల్లో టైప్ 1, టైప్ 2 మధుమేహంతో పాల్గొనేవారు ఉన్నారు. వారు ఉపవాసం నుంచి ఎటువంటి చెడు ప్రభావాలను అనుభవించలేదు, అయినప్పటికీ వారిని నిపుణులు నిశితంగా పరిశీలించారు. అలాగే ఉపవాసం సమయంలో వారి ఇన్సులిన్ మోతాదులను సర్దుబాటు చేశారు. ఈ సుదీర్ఘ ఉపవాసాల యొక్క అత్యంత సాధారణ దుష్ప్రభావాలు అడపాదడపా ఉపవాసం నుంచి వచ్చేవిగా ఉంటాయి, తలనొప్పి, నిద్రలేమి, ఆకలి వంటివి ఉన్నాయి. అధ్యయనాలలో జీవక్రియ అసిడోసిస్ లేదా మరణం వంటి తీవ్రమైన ప్రతికూల ప్రభావాలు లేవని కనుగొన్నారు. కాబట్టి ఇలాంటి ఉపవాసాలు వైద్యుల పర్యవేక్షణ మేరకు తక్కువ సార్లు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.
నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించేముందు వైద్యుల సలహాలు, సూచనలు తీసుకోవడం ఉత్తమం.
మరిన్ని హెల్త్ వార్తల కోసం క్లిక్ చేయండి