Ginger Peeling Tips: అల్లంపై ఉండే తొక్కను తీసేందుకు ఇబ్బంది పడుతున్నారా..? ఇలా చేయండి.. సులభమవుతుంది

అల్లం.. దీనిని వంటకాల్లో మనం ఎక్కువగా ఉపయోగించే వస్తువు. దీని వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. దీన్ని వంటకాల్లో చేర్చడం వల్ల రుచి మెరుగుపడుతుంది. అలాగే చాలా మంది టీ అల్లం లేకుండా తాగకుండా ఉండలేరు. అల్లం టీలో ఎంతో రుచినిస్తుంది. వింటర్ సీజన్‌లో అల్లం ప్రాముఖ్యత..

Ginger Peeling Tips: అల్లంపై ఉండే తొక్కను తీసేందుకు ఇబ్బంది పడుతున్నారా..? ఇలా చేయండి.. సులభమవుతుంది
Ginger

Updated on: Jul 01, 2023 | 9:32 PM

అల్లం.. దీనిని వంటకాల్లో మనం ఎక్కువగా ఉపయోగించే వస్తువు. దీని వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. దీన్ని వంటకాల్లో చేర్చడం వల్ల రుచి మెరుగుపడుతుంది. అలాగే చాలా మంది టీ అల్లం లేకుండా తాగకుండా ఉండలేరు. అల్లం టీలో ఎంతో రుచినిస్తుంది. వింటర్ సీజన్‌లో అల్లం ప్రాముఖ్యత చాలా పెరుగుతుంది. విటమిన్ ఎ, విటమిన్ డి, విటమిన్ ఎ, ఐరన్ జింక్, కాల్షియం అనేక ఇతర పోషకాలు ఇందులో ఉన్నాయి. అందుకే అవి మన శరీరానికి అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుస్తాయి. పచ్చి అల్లం నమలడం వల్ల జలుబు, దగ్గు, జలుబు, పొత్తికడుపు నొప్పి, అధిక కొలెస్ట్రాల్, మైగ్రేన్, అధిక రక్తపోటుకు మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది. అల్లం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కానీ దాని ఆకారం వంకర ఆకారంగా ఉంటుంది. చాలా మందికి ఉండే సమస్య ఏంటంటే దీని తొక్క తీయడమే. దాని పొట్టు తీయడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి అల్లంపై ఉండే తొక్క సులభంగా తీసే మార్గాలను చూద్దాం.

  1. ఫ్రిజ్ నుంచి కొంత సమయం ముందుగా బయటకు తీసేయండి. అల్లం ఫ్రీజ్‌లో ఉంచడం వల్ల దానిపై ఉండే తొక్క ఎండిపోతుంది. త్వరగా తీసేందుకు వీలుంటుంది. తొక్కలను తీయాలని అనుకున్నప్పుడు 15 నిమిషాల ముందు రిఫ్రిజిరేటర్ నుంచి బయటకు తీయండి. అల్లం ఉష్ణోగ్రత సాధారణమైనప్పుడు పైతొక్కను కత్తి సహాయంతో సులభంగా తీయవచ్చు.
  2. చెంచా ఉపయోగించండి: కొన్నిసార్లు మనం కత్తితో అల్లం తొక్కను తీయడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొవలసి వస్తుంది. ఈ సందర్భంలో మీరు ఒక చెంచా సహాయం తీసుకోవచ్చు. సన్నని, పదునైన చెంచాతో అల్లం పై తొక్కను తొలగించడానికి ప్రయత్నించండి. ఇది మీ పనిని సులభతరం చేస్తుంది. ఎక్కువ సమయం పట్టదు.
  3. అల్లంను అనేక ముక్కలుగా కోయండి: అల్లం ఆకారం నిటారుగా, చదునుగా ఉండదు. కాబట్టి దాని పై తొక్క తీయడంలో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అందుకని అల్లం పొట్టు తీసే ముందు చిన్న చిన్న ముక్కలుగా కోసి పరిమాణం 1 నుంచి 2 అంగుళాలు ఉండాలి. ఇప్పుడు చెంచా, కత్తి సహాయంతో తొక్కను దానిని సులభంగా తీయవచ్చు.

మరిన్ని లైఫ్‌స్టైల్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

ఇవి కూడా చదవండి